EPAPER

Heavy Rain: కోదాడలో బీభత్సం సృష్టిస్తున్న వర్షం .. వరదలో కొట్టుకొచ్చిన 2 మృతదేహాలు

Heavy Rain: కోదాడలో బీభత్సం సృష్టిస్తున్న వర్షం .. వరదలో కొట్టుకొచ్చిన 2 మృతదేహాలు

Two Men’s deadbodies found in flood water: తెలుగు రాష్ట్రాల్లో వర్షం దంచి కొడుతుంది. దీంతో వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. చాలా చోట్ల భారీగా వరద నీరు రోడ్లపైకి, ఇళ్లలోకి వచ్చి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా సూర్యాపేట జిల్లా కోదాడ అతలాకుతలమైతుంది. వాగులు, వంకలు భారీగా పొంగిపొర్లుతున్నాయి. కాలనీలు కూడా వరద నీరుతో వాగలను తలపిస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం ఇంటి అడుగుపెట్టలేని పరిస్థితి దాపురించింది. ఎటు చూసినా వరద నీరు కనిపిస్తున్నది. పైగాని దానికి తోడు కురుస్తున్న వర్షం.. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోదాడ పట్టణంలోని రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. వైష్ణవి పాఠశాల సమీపంలోని వాగులో రెండు కార్లు, ఆటోలు వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. కొట్టుకుపోయిన ఓ కారులో మృతదేహం ఉన్నట్లుగా స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అదేవిధంగా శ్రీమన్నారాయణ కాలనీలో కూడా మరో మృతదేహం లభ్యమైనట్లు సమాచారం. మృతుడు శ్రీనివాసనగర్ కు చెందిన ఉపాధ్యాయుడి అని, శనివారం రాత్రి బైక్ పై ఆయన ఇంటికి వెళ్తుండగా వరదలో చిక్కుకుని మృత్యువాతపడ్డారంటా స్థానికులు చెబుతున్నట్లు తెలుస్తోంది.


Also Read: భారీ వర్షాలతో నిండిపోయిన రిజర్వాయర్లు.. పలు రైళ్లు రద్దు

ఇటు కోదాడ వ్యాప్తంగా ఎటు చూసినా వరద నీరే కనిపిస్తుంది. కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో కోదాడ పట్టణం పూర్తిగా వరదమయమైపోయింది. పట్టణంలోని పలు చోట్ల వరద డివైడర్ల పై నుంచి ప్రవహిస్తుండడంతో వాటిని పగులగొట్టి సహాయక చర్యలు చేపట్టారు. మేళ్లచెరువు రహదారులపై పూర్తిగా రాకపోకలను నిలిపివేశారు. కోదాడ పెద్ద చెరువు మత్తడి దూకడంతో నయానగర్ పూర్తిగా వరదనీటిలో మునిగిపోయింది. లోతట్టు ప్రాంతాలైతే పూర్తిగా జలమయమయ్యాయి. ఇటు హైదరాబాద్ కు వెళ్లే జాతీయ రహదారిపై వరద నీరు వచ్చి చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనను వ్యక్తం చేస్తున్నారు.


ఇదిలా ఉంటే.. భారీ వర్షాల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమైతున్నాయి. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడ – కాజీపేట్ రైలు మార్గంలో వరద నీరు వల్ల మహబూబాబాద్ జిల్లాలో రైల్వే ట్రాక్ డ్యామేజ్ కావడంతో ఆ మార్గం గుండా వెళ్లే పలు రైళ్లను నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఇటు విజయవాడ డివిజన్ లోని 30 రైళ్లను రైల్వేశాఖ రద్దు చేసినట్లు సమాచారం.

Also Read: సీఎం అత్యవసర రివ్యూ.. అధికారులు సెలవులు పెట్టొద్దు

తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సీఎస్, డీజీపీ, మున్సిపల్, కరెంట్, పంచాయతీరాజ్, హైడ్రా, ఇరిగేషన్ తోపాటు అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలంటూ ఆయన ఆదేశించారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో అధికారులెవ్వరూ సెలవులు పెట్టొద్దని, ఒకవేళ ఎవరైనా పెట్టినా వాటిని రద్దు చేసుకుని పనుల్లో నిమగ్నం కావాలని సూచించారు. ఇటు అత్యవసర విభాగాల అధికారులంతా క్షేత్రస్థాయిలో ఉంటూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని సీఎంఓకు పంపాలని ఆయన ఆదేశించారు.

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×