EPAPER

Hyderabad Heavy Rains: భారీ వర్షాలతో నిండిపోయిన రిజర్వాయర్లు.. పలు రైళ్లు రద్దు

Hyderabad Heavy Rains: భారీ వర్షాలతో నిండిపోయిన రిజర్వాయర్లు.. పలు రైళ్లు రద్దు

Hyderabad Heavy Rains| తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో రెండో రోజు కురుస్తున్న నిరంతర వర్షాల ధాటికి హుస్సేన్ సాగర్ చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ కు మించి వరద నీరు చేరింది. హుస్సేన్ సాగర్ చెరువులో వరద నీరు చేరడంతో వాటల్ లెవెల్ 513.41 మీటర్లు దాటి పోయిందని.. అందువల్ల ఎక్కువగా ఉన్న నీటిని మూసీ నదిలోకి విడుదల చేస్తున్నామని గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (అధికారులు) తెలిపారు.


వరద నీరు నిరంతరాయంగా వస్తుండడంతో మూసి నది పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు జాగ్రత్తలు పాటించాలిన జిహెచ్ఎంసీ (GHMC) అధికారుల హెచ్చరికలు జారీ చేశారు. హస్సేన్ సాగర్ నుంచి మూసీ నదిలోకి నీరు విడుదల చేయడం వల్ల నది సమీపంలోని లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు వచ్చే ప్రమాదముందని అధికారులు అన్నారు. భారీ వర్షాల కారణంగా తలెత్తే వరద పరిస్థితిని జిహెచ్ఎంసీ అధికారులు పర్యవేక్షిస్తున్నామని.. వరద బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడతామని తెలిపారు.

మరోవైపు భారీ వర్షాలు కురుస్తుండడంతో నగరంలోని జంట జలాశయాలు ఓస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లో వరద నీరు చేరుతోంది. దీని వల్ల రెండు రిజర్వాయర్లు నిండిపోయినట్లు హైదరాబార్ మెట్రోపోలిటన్ వాటర్ సప్లై అండ్ సెవరేజ్ బోర్డ్ తెలిపింది.


హైదరాబార్ మెట్రోపోలిటన్ సెవరేజ్ బోర్డ్ మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. ”చేవెళ్ల, వికారాబాద్, శంకర్ పల్లి, మూమన్ పల్లి, దోబిపేట్ ప్రాంతాల నుంచి మూసీ నది ద్వారా గండిపేట్ కు వర్ష నీరు చేరుతోందని, అలాగే ఈసీ నది ద్వారా హిమాయత్ సాగర్ లోకి వరద నీరు చేరుతోందని తెలిపారు. వరద బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు ఎమెర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. తాగు నీరు కలుషితం కాకుండా తగిన మొత్తంలో క్లోరిన్ మిక్స్ చేస్తున్నట్లు వెల్లడించారు.

వర్షాల కారణంగా వరద సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజల జిహెచ్ ఎంసీ ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నెంబర్స్ కు ఫోన్ చేయగలరు. ఎమర్జెన్సీ కోసం ఫోన్ చేయాల్సిన హెల్ప్ లైన్ నెంబర్లు 040-21111111 or 9000113667.

Also Read: లేటు వయసులో సోగ్గాడి వేషాలు.. యువతులు కావాలని ఆ రిటైర్డ్ ఉద్యోగి ఏం చేశాడంటే..

భార వర్షాల కారణంగా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆదివారం పలు రైళ్లు నిలిచిపోగా.. మరి కొన్ని రద్దు అయ్యాయి. విజయవాడ – కాజీపేట్ రైలు మార్గంలో వరద నీరు వల్ల మహబూబా బాద్ జిల్లాలోని రైల్వే ట్రాక్ డ్యామేజ్ కావడంతో ఆ మార్గంలో ప్రయాణిస్తున్న దాదాపు 24 రైళ్లు నిలిచిపోయాయని సమాచారం. పైగా విజయవాడ డివిజన్ లోని 30 రైళ్లు రద్దు అయినట్లు రైల్వే శాఖ తెలిపింది.

సింహాద్రి, మచిలీపట్నం ఎక్స్ ప్రెస్ రైళ్లు మహబూబా బాద్ రైల్వే స్టేషన్ వద్ద నిలిచిపోగా.. గౌతమి, సంఝమిత్ర కంగ- కావేరి, చార్మినార్, యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ రైళ్లు కూడా నిలిపివేయబడ్డాయి. పందిళ్ల పల్లి వద్ద వరద కారణంగా మహబూబ్ నగర్- విశాఖపట్నం ఎక్స్ ప్రెస్ రైలు నాలుగు గంటలపాటు నిలిపివేశారు.

రద్దు అయిన రైళ్లు ఇవే..
విజయవాడ- సికింద్రాబాద్ 12713
సికింద్రాబాద్ – విజయవాడ 12714,
గుంటూరు – సికింద్రాబాద్ 17201
సికింద్రాబాద్ – సిర్పూర్ కాగజ్ నగర్ 17233
సికింద్రాబాద్ – గుంటూరు 12706
గుంటూరు – సికింద్రాబాద్ 12705

అలాగే విశాఖపట్నం- నాందేడ్ మధ్య ప్రయాణిస్తున్న రైలుని దారి మళ్లించారు. ఏలూరు నుంచి సికింద్రాబాద్ మధ్య మార్గంలో ఈ రైలు ప్రయాణించదు. విశాఖపట్నం నుంచి తిరిపతి వెళ్లే ట్రైన్ కూడా సికింద్రాబాద్, విజయవాడ మార్గంలో కాకుండా ఇతర మార్గంలో ప్రయాణిస్తోంది.

Related News

Hansika Motwani: అసభ్యకరంగా తాకాడు.. నొప్పి భరించలేకపోయా అంటూ హన్సిక ఎమోషనల్..!

Mokshagna: తొలి మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా.. ఆల్ టైం రికార్డ్ సృష్టించబోతున్న బాలయ్య..!

Nagabubu: నాగబాబు సెటైరికల్ పోస్ట్.. జానీ మాస్టర్ కేనా..?

Jani Master : కేసులో మరో ట్విస్ట్.. కూపీ లాగనున్న మహిళా కొరియోగ్రాఫర్..!

Bigg Boss 8 Day 18 Promo: హౌస్ లో పెద్ద డ్రామా నడుస్తోందే.. సోనియా కి ఝలక్ ఇచ్చిన నబీల్..!

Heroine Poorna: తల్లిని నిందించారు.. హేళన మాటలపై పూర్ణ ఎమోషనల్..!

NaniOdela2: ఫ్యాన్స్ గెట్ రెడీ.. మాస్ జాతరకు సిద్ధం కండమ్మా..!

Big Stories

×