EPAPER

Actress Samantha Post: తెలంగాణ ప్రభుత్వానికి సమంత రిక్వెస్ట్ .. అలా చేయాలంటూ సలహా..

Actress Samantha Post: తెలంగాణ ప్రభుత్వానికి సమంత రిక్వెస్ట్ .. అలా చేయాలంటూ సలహా..

Actress Samantha Post: హీరోయిన్‌ సమంతా చేసిన ఓ చిన్న పోస్ట్‌ ఇప్పుడు టాలీవుడ్‌లో సెన్సెషన్‌గా మారింది. ఈ పోస్ట్ కొత్త అనుమానాలతో పాటు.. కొత్త అంశాలను తెరపైకి తీసుకొచ్చింది. ఇప్పటకే కాస్టింగ్‌ కౌచ్‌తో షేక్‌ అవుతోంది మళయాళ ఫిల్మ్ ఇండస్ట్రీ.. ఇప్పుడీ ప్రకంపనలు టాలీవుడ్‌ను షేక్ చేయబోతున్నాయా? అసలు ఇంతకీ నిజంగానే అలాంటి రిపోర్ట్ ఉందా? ఉంటే ఇన్నాళ్లు గోప్యంగా ఎందుకుంది?


తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోని మా మహిళలంతా హేమ కమిటీ రిపోర్ట్‌ను స్వాగతిస్తున్నాం.. కేరళలో ఉమెన్ ఇన్‌ సినిమా కలెక్టివ్‌ చేస్తున్న కృషిని అభినందిస్తున్నాం. వాళ్ల కృషే ఈ ఉద్యమానికి దారి తీసింది. ఆ WCC నుంచి ఇన్‌స్పైర్‌ అయ్యి.. టాలీవుడ్‌ ఫిల్మ్ ఇండస్ట్రీలోని మహిళల కోసం గ్రూప్ ది వాయిస్ ఆఫ్‌ ఉమెన్‌ ఏర్పాటైంది. లైంగిక వేధింపులపై సబ్‌ కమిటీ సమర్పించిన రిపోర్ట్‌ను పబ్లిష్‌ చేయాలని మేము తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇది టాలీవుడ్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో పనిచేసే మహిళల రక్షణ చర్యల కోసం ప్రభుత్వం, ఇండస్ట్రీ చేపట్టబోయే విధానాలకు తోడ్పడుతోంది. ఇది సమంత పెట్టిన పోస్ట్.. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.

టాలీవుడ్ ఇప్పుడు షేక్ అవ్వడానికి కారణం మళయాల ఫిల్మ్ ఇండస్ట్రీ.. ఎందుకంటే అక్కడ జస్టిస్‌ హేమ కమిటీ ఓ రిపోర్ట్‌ను రిలీజ్ చేసింది. మల్లు ఇండస్ట్రీలో పనిచేసే మహిళలు కాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని అర్ధమయ్యేలా చెప్పింది ఆ కమిటీ రిపోర్ట్.. ఒక్కొక్కరుగా వారి గొంతు విప్పడంతో అసలు ఇన్ని దారుణాలు జరుగుతున్నాయా? అని ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. ఇప్పటికే వేధించిన వారి పేర్లు కూడా బయటికి వచ్చాయి. వారిపై కేసులు కూడా నమోదయ్యాయి. అంతేకాదు ఈ దారుణాలకు బాధ్యత వహిస్తూ అసోసియేషన్‌ ఆఫ్‌ మళయాలమ్‌ మూవీ ఆర్టిస్ట్స్‌ అధ్యక్ష పదవికి స్టార్ హీరో మోహన్ లాల్ కూడా రిజైన్ చేశారు. ఇప్పటికీ కూడా ఈ ప్రకంపనలు ఆగలేదు.


అక్కడ రిపోర్ట్ బయటికి వచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు రావడం లేదనేది సమంత ప్రశ్న..? నిజానికి 2019లోనే ఈ Me too Movement స్టార్టయ్యింది. అప్పుడే తెలంగాణ గవర్నమెంట్‌ పోలీస్‌ ఆఫీసర్స్, ఇతర రంగాలకు చెందిన అధికారులతో హైలెవల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఓ సబ్‌ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ సబ్ కమిటీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో జెండర్ ఇక్వాలిటీ, వర్కింగ్‌ ఎన్విరాన్‌మెంట్, సెక్సువల్ హారాస్‌మెంట్‌పై విచారణ జరిపి రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ఇందులో అనేక సలహాలు, సూచనలు కూడా చేసింది. ఈ కమిటీ 24 క్రాఫ్ట్స్‌ అంటే జూనియర్ ఆర్టిస్ట్స్‌, డ్యాన్సర్స్, మెకప్ ఆర్టిస్ట్స్, డ్రైవర్స్‌ ఇలా అన్ని రంగాల వారితో భేటీ అయ్యింది. అనేక అభిప్రాయాలు సేకరించింది. ఈ సబ్‌ కమిటీలో సుప్రియా, స్వప్నాదత్, జీవితా రాజశేఖర్ లాంటివారు ఉన్నారు. ఈ కమిటీ 2022 జూన్‌లో ప్రభుత్వానికి రిపోర్ట్‌ను సబ్మిట్ చేసింది. అయితే ఈ రిపోర్ట్‌లో ఏముంది? ఎలాంటి సలహాలు ఇచ్చారు? ఏం సూచించారు? టాలీవుడ్‌లో కూడా కాస్టింగ్ కౌచ్ ఉందా? లైంగిక వేధింపులు ఉన్నాయా? అనే ఏ విషయం కూడా బయటికి రాలేదు. నిజానికి చాలా రోజులుగా ఈ రిపోర్ట్‌ బయట పెట్టాలన్న డిమాండ్లు చాలా రోజులుగా ఉన్నాయి. ఇప్పుడు సమంతా కోరింది కూడా అదే.

Also Read: కల్కి డిలిటెడ్ సీన్స్.. డిలీట్ చేయడమే బెటర్ అన్నట్టు ఉన్నాయే

సమంత పోస్ట్‌పై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అసలు మన టాలీవుడ్‌లో అలాంటి పరిస్థితులే లేవు. లేని అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి వివాదాన్ని సృష్టించడం ఎందుకు? అని వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాదు సమంతకు నిజంగా ఏదైనా సమస్య ఉంటే ఇన్నాళ్లు ఎందుకు మౌనంగా ఉన్నారు? అప్పుడే బయటపెడితే చర్యలు తీసుకునేవాళ్లం కదా అంటున్నారు. అంతేకాదు రిపోర్ట్ అనేది బయట పెట్టేది కాదని కూడా వాదిస్తున్నారు. మరో వర్షన్ ఏంటంటే.. కమిటీ వేశారు.. విచారణ జరిపారు. మరి రిపోర్ట్ బయట పెట్టడానికి వచ్చిన సమస్యేంటి? అనేది మరో క్వశ్చన్.. టాలీవుడ్‌లో నటులు ఎదుర్కొంటున్న సమస్యలేంటి? బాగుంటే బాగుంది.. లేదంటే ఇక్కడ సమస్యలు ఉన్నాయి.. అని చెప్పడానికి ఇబ్బంది ఏంటి? కేరళలో జరుగుతున్న పరిణామాలు చూశాక టాలీవుడ్‌పై అనుమానాలు పెరుగుతున్నాయి. నిజానికి ఇప్పటి వరకైతే ఎవ్వరూ బయటికి వచ్చి ఫిర్యాదులు, కానీ కామెంట్స్ కానీ చేయలేదు.. కానీ.. సినిమాల్లో చాన్స్‌ ఇప్పిస్తామని అంతర్గతంగా ఏమైనా వేధింపులు జరుగుతున్నాయా? అనే అనుమానాలు మాత్రం ఉండనే ఉన్నాయి. కొందరు మ్యూచువల్‌గా అంగీకరించే ఇలాంటి పనులు చేస్తున్నారని చెబుతున్నారు. కానీ ఓ రోల్ కోసం ఇలాంటి వాటికి కూడా అంగీకరించే పరిస్థితులు క్రియేట్ చేసింది ఎవరు? అనేది కూడా తేలాలి.

సమంత తన పోస్ట్‌లో నేరుగా తెలంగాణ గవర్నమెంట్‌ను రిక్వెస్ట్ అయితే చేసింది. మరి ఇండస్ట్రీ నుంచి సమంతకు మద్దతు దక్కుతుందా? లేదా? తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతుంది? రిపోర్ట్‌ రిలీజైతే కొందరి నటుల జాతకాలు మారిపోతాయా? లేదా అసలు రిపోర్ట్‌ తయారు చేయడంలో కాంప్రమైజ్ అయ్యారా? అనేది ముందు ముందు తేలనుంది.

Related News

Samantha : ఫైనల్‌గా కెమెరా ముందుకు వచ్చిన సామ్… ‘కల…’ అంటూ ఎమోషనల్ పోస్ట్

Ruksana Bano: ప్రముఖ సింగర్ మృతి.. షాకింగ్‌లో ఫ్యాన్స్.. విషం ఇచ్చి హత్య!

Bollywood Actress : ఇక బాలీవుడ్ ఖాళీ… టాలీవుడ్‌పై కన్నెసిన జాన్వీ బెస్ట్ ఫ్రెండ్..

Squid Game Season 2 Teaser: టీజర్ రిలీజ్ చేసిన నెట్ ఫ్లిక్స్.. ఈ భయంకరమైన ఆట చూడడానికి సిద్ధమా..?

Telugu Actress: ఎన్టీఆర్, ఏఎన్నార్ లనే ఢీ కొట్టిన నటి.. కానీ చనిపోతే మాత్రం.. !

Comedian Sapthagiri: ఇండస్ట్రీకి దూరమయ్యారా లేక దూరం పెట్టారా..?

Johnny Master: ఢీ 11 లో ఎలిమినేట్.. జానీ మాస్టర్ ఇంత కథ నడిపారా.?

Big Stories

×