EPAPER

Ganesh Chaturthi 2024: తొలిసారి ఇంట్లో వినాయకుడిని ప్రతిష్టిస్తున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి

Ganesh Chaturthi 2024: తొలిసారి ఇంట్లో వినాయకుడిని ప్రతిష్టిస్తున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి

Ganesh Chaturthi 2024: హిందూ మతంలో భాద్రపద మాసం చాలా ముఖ్యమైనది. ఈ నెలలో ప్రధాన పండగలు జరుపుకుంటారు. భద్రపద మాసంలో వచ్చే ముఖ్యమైన పండగల్లో వినాయక చవితి కూడా ఒకటి. ప్రతి సంవత్సరం భద్రపద మాసంలోని శుక్లపక్ష చతుర్థి రోజు వినాయక చవితిని జరుపుకుంటారు. 10 రోజుల పాటు జరుపుకునే ఈ పండగ సెప్టెంబర్ 7 న ప్రారంభమై 17 వరకు కొనసాగనుంది.


చతుర్థి సందర్భంగా ప్రజలు తమ ఇళ్లలో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించుకొని పూజిస్తారు. గ్రామాల్లోని వీధుల్లో కూడా గణపతిని ప్రతిష్టించి పూజిస్తారు. ఇలా గణపతిని 10 రోజు పాటు పూజించడం వల్ల జీవితాల్లో సంతోషాలు, శ్రేయస్సు కలుగుతాయని నమ్ముతారు. మీ ఇంట్లో తొలిసారి గణపతిని ప్రతిష్టించాలని అనుకుంటే గనుక కచ్చితంగా కొన్ని నియమాలను అనుసరించడం మంచిది. వినాయకుని స్థాపనకు సంబంధించిన నియమాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వినాయక చవితి రోజు విగ్రహాన్ని కొనుగోలు చేసేటప్పుడు ఈ విషయాలపై శ్రద్ధ వహించడం అవసరం..
గణపతి యొక్క తొండం ఎడమవైపు ఉండేలా చూసుకోండి. విగ్రహం తొండం ఎడమ వైపు ఉన్న విగ్రహాన్ని ప్రతిష్టించడం పవిత్రమైనదిగా భావిస్తారు. అంతే కాకుండా విగ్రహంలో వినాయకుడి చేతు ఆశీర్వాదం భంగిమలో ఉండాలి. మరొక చేతు మోదకం పట్టుకొని ఉండేలా చూసుకోండి.


నాయకుడి విగ్రహాన్ని ఈశాన్య దిశలో ఉంచి ప్రతిష్టించాలి. విగ్రహం ముఖం ఉత్తరం వైపు చూస్తూ ఉండాలి. విగ్రహాన్ని శుభ్రమైన ప్రాంతంలోనే ప్రతిష్టించాలి. విగ్రహాన్ని ప్రతిష్టించే ప్రాంతంలో ఒక పీట వేసి ఆ ప్రాంతాన్ని అందంగా అలంకరించి దానిపైన తెల్లని వస్త్రాన్ని పరిచి ఆ తర్వాత విగ్రహాన్ని ప్రతిష్టించాలి.

పూజా విధానం:

వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించిన తర్వాత ముందుగా ఆ ప్రాంతంలో స్వచ్ఛమైన గంగాజలం చెల్లి ఆపై విగ్రహానికి అక్షింతలను సమర్పించండి. గణపతి విగ్రహానికి కుడివైపు నీటితో నిండిన కలశాన్ని ఉంచాలి. ఆ తర్వాత గణేశుడిని పుష్పాలు చేతిలో అక్షింతలతో పూజించండి.

దేవుడి పూజా సమయంలో పండ్లు, పువ్వులు, స్వీట్లు సమర్పించాలి. వినాయకుడికి ఇష్టమైన మోదకాన్ని సమర్పించడం మర్చిపోకండి. పూజా సమయంలో గణేశుడి దోషరహిత మంత్రాన్ని జపించాలి. ఆ తర్వాత హారతి ఇచ్చి పూజను పూర్తి చేయాలి.

వినాయకుడి పూజలో ఈ వస్తువులు తప్పనిసరిగా చేర్చాలి:

ముందుగా మీరు వినాయకుని విగ్రహాన్ని తీసుకురావాలి. పర్యావరణ అనుకూలమైన విగ్రహాన్ని కొనడం మంచిది.. ఇలా చేయడం వల్ల నిమజ్జనం సమయంలో పర్యావరణానికి ఎటువంటి హాని జరగదు.

విగ్రహాన్ని ప్రతిష్టించడానికి వేదిక:
గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్టించడానికి, మీకు వేదిక అవసరం. భగవంతుడిని ఎప్పుడూ నేలపై ఉంచకూడదు. విగ్రహ ప్రతిష్ఠాపనకు అనువైన, శుభ్రమైన స్థలాన్ని ఎంచుకోండి.

కలశం, కొబ్బరికాయ:
పూజ కోసం మీకు కలశం, కొబ్బరికాయ కూడా అవసరం. పూజ సమయంలో, మీరు విగ్రహం దగ్గర కలశాన్ని ఉంచాలి. ఈ కలశం పైన కొబ్బరికాయను ఉంచాలి. అందులో మామిడి ఆకులను కూడా వేయాలి.

ఎరుపు వస్త్రం:
దేవుడి విగ్రహ ప్రతిష్టాపనకు ఎర్రటి వస్త్రం కూడా అవసరం. పూజలో ఎరుపు బట్టలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. స్వామిని ప్రతిష్టించేటప్పుడు మీరు కూడా ఎర్రని వస్త్రాలను ధరించాలి.

ముల్లంగి ఆకులు:
ముల్లంగి ఆకులను ప్రత్యేకంగా గణేశుడికి నైవేద్యంగా పెడతారు. ఇవి వినాయకుడికి చాలా ఇష్టం. ముల్లంగి ఆకులను నైవేద్యంగా పెట్టడం వల్ల వినాయకుడి అనుగ్రహం కలుగుతుదందని చెబుతారు.

Also Read: 2 గ్రహాల కలయిక.. ఈ రాశుల వారికి అదృష్టం

పంచామృతం, మోదకం:
గణేశుడికి సమర్పించే పదార్ధాలలో పంచామృతం, ఇష్టమైన మోదక్ కూడా చేర్చండి.

ఇతర పదార్థాలు:
పూలు, మాల, దీపం, కర్పూరం, తమలపాకులు, పసుపు, ,దర్ప గడ్డి, అగరుబత్తీలు వినాయకుడికి సమర్పించాలి.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Surya Grahan 2024: త్వరలో సూర్య గ్రహణం.. ఈ రోజు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి

Vriddhi Yog Horoscope: ఈ రాశుల వారిపై ప్రత్యేక యోగం వల్ల కోటీశ్వరులు కాబోతున్నారు

Guru Vakri 2024 : మరో 20 రోజుల్లో బృహస్పతి తిరోగమనం కారణంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందబోతున్నారు

Budh Shani Yuti Horoscope: బుధ-శని సంయోగంతో ఈ 3 రాశుల వారు సంపదను పొందబోతున్నారు

Horoscope 19 September 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని ధనలాభం!

Budh Gochar 2024: కన్య రాశిలో బుధుడి సంచారం.. వీరికి అన్నీ శుభవార్తలే

19 September 2024 Rashifal: రేపు ధనుస్సుతో సహా 5 రాశుల వారికి సంపద పెరగబోతుంది

Big Stories

×