ప్రముఖ టెక్ బ్రాండ్ రెడ్‌మి తాజాగా అతి తక్కువ ధరలో Redmi 14C స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.

ఈ ఫోన్ 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ PLN 2,999 (దాదాపు రూ. 11,000) నుండి ప్రారంభమవుతుంది.

దీని టాప్ 8 GB RAM + 256 GB స్టోరేజ్ వేరియంట్ ధర PLN 3,699 (సుమారు రూ. 13,500)గా కంపెనీ నిర్ణయింది.

కంపెనీ మిడ్‌నైట్ బ్లాక్, సేజ్ గ్రీన్, డ్రీమీ పర్పుల్, స్టార్రీ బ్లూ కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్‌ను రిలీజ్ చేసింది.

ఫోన్ IPS LCD ప్యానెల్‌తో 6.88 అంగుళాల భారీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది HD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో మార్కెట్‌లోకి వచ్చింది.

కంపెనీ దీనికి 18W ఛార్జింగ్ ఫీచర్‌ సపోర్ట్‌తో 5160mAh పెద్ద బ్యాటరీని అందులోబాటులోకి తీసుకొచ్చింది.

అలాగే ఫోన్‌లో MediaTek Helio G81 చిప్‌సెట్ అందించబడింది. దీనిని గరిష్టంగా 8 GB RAM + గరిష్టంగా 256 GB స్టోరేజ్‌తో తీసుకొచ్చింది.

గ్రాఫిక్స్ కోసం ఇందులో Mali-G52 MC2 GPU అందుబాటులో ఉంది.

ఇది వెనుక వైపు 50MP ప్రధాన కెమెరాను కలిగి ఉంది. దీనితో పాటు LED ఫ్లాష్‌కు మద్దతు కూడా అందించబడింది.

ఫోన్ ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాలింగ్‌ల కోసం 13-మెగాపిక్సెల్ కెమెరాను కంపెనీ అందించింది. ఇది కాకుండా ఫోన్‌లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది.