Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున.. ప్రస్తుతం ఒకపక్క సినిమాలతో, ఇంకోపక్క బిగ్ బాస్ తో బిజీగా మారిన విషయం తెల్సిందే. హీరోగానే కాకుండా సపోర్టివ్ రోల్స్ తో కూడా మెప్పించడానికి నాగ్ రెడీ అవుతున్నాడు. ఇప్పటికే కుబేర సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న నాగ్.. రజినీకాంత్ నటిస్తున్న కూలీ సినిమాలో కూడా సైమన్ అనే పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ఇక ఇవన్నీ పక్కన పెడితే.. రేపే బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కానుంది. గత ఆరుసీజన్స్ కు నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరిస్తూ వస్తున్నాడు. మొదటి సీజన్ కు ఎన్టీఆర్, రెండవ సీజన్ కు నాని హోస్ట్ గా వ్యవహరించగా.. మూడోవ సీజన్ నుంచి ఏడవ సీజన్ వరకు నాగార్జుననే వ్యాఖ్యాతగా కొనసాగుతున్నాడు. నాగ్ పై ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోకుండా ప్రతి సీజన్ ను విజయవంతంగా ఫినిష్ చేస్తూ వస్తున్నాడు.
నాగ్ హోస్ట్ గా వ్యవహరించిన సీజన్స్ లో కొద్దోగొప్పో బాగా అనిపించిన సీజన్ లాస్ట్ సీజన్. 7 వ సీజన్ లో కంటెస్టెంట్స్ తో పాటు గొడవలు, నాగ్ యాంకరింగ్ కూడా సూపర్ గా ఉందని ప్రశంసలు దక్కాయి. దీంతో 8 వ సీజన్ పై మరింత హైప్ పెరిగింది. ఇక బిగ్ బాస్ 8 ను ఎప్పుడైతే అనౌన్స్ చేశారో.. అప్పటినుంచి నాగ్ రెమ్యూనరేషన్ గురించి చర్చలు సాగుతూనే ఉన్నాయి. ఒక్కో సీజన్ కు నాగ్ పారితోషికాన్ని పెంచుకుంటూ వస్తున్నాడు. ఇక అందుతున్న సమాచారాన్ని బట్టి.. ఈ సీజన్ కు కూడా నాగ్ బాగానే అందుకుంటున్నాడని టాక్ నడుస్తోంది.
కొన్ని రిపోర్ట్స్ ప్రకారం.. బిగ్ బాస్ సీజన్ 8 కి నాగ్ .. అక్షరాలా రూ. 30 కోట్లు అందుకుంటున్నాడట. సీజన్ 3 తో హోస్ట్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన నాగ్.. అప్పుడు రూ. 12 కోట్లను అందుకున్నట్లు సమాచారం. ఇక ఈ ఆరు సీజన్స్ లో.. ప్రతి సీజన్ కు పెంచుకుంటూ పోతూ.. ఇక ఇప్పుడు రూ. 30 కోట్లు అందుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందుకు మరో కారణం కూడా ఉంది.
బిగ్ బాస్ కు హోస్ట్ గా టాలీవుడ్ నుంచి మరో స్టార్ హీరో ఒప్పుకోవడం లేదు. దానికి కారణం.. ఆ షో ఎంత పాపులర్ అయినా.. దాని నుంచి వచ్చే ట్రోలింగ్ అంతా ఇంతా కాదు. ఈ విషయాన్ని స్వయంగా నానినే బహిరంగంగా చెప్పుకొచ్చాడు. జీవితంలో మరోసారి బిగ్ బాస్ కు హోస్ట్ గా వ్యవహరించను అని ఖరాకండీగా చెప్పుకొచ్చాడు.
ఇక దీంతో చేసేదేమి లేక మేకర్స్ సైతం నాగ్ ఎంత చెప్తే అంత అన్నట్లు ఇస్తున్నారని అంటున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ.. బిగ్ బాస్ నుంచి నాగ్ బాగానే సంపాదిస్తున్నాడు అనేది మాత్రం నమ్మదగ్గ నిజం. మరి ఈ సీజన్ తో నాగ్ ఎలాంటి విమర్శలను ఎదుర్కొంటాడు అనేది చూడాలంటే.. కొన్ని రోజులు ఆగాల్సిందే.