Viral Video: సోషల్ మీడియాలో కేవలం ఎంటర్టైన్మెంట్ వీడియోలు మాత్రమే కాదు బాధకరమైన, ప్రమాదకరమైన వీడియోలు కూడా వైరల్ అవుతూ ఉంటాయి. ఇలాంటి వీడియోల్లో ముఖ్యంగా అమ్మాయిలపై ఆకతాయిలు చేసే అల్లర్లకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వెలుగుచూస్తుంటాయి. రోడ్డుపై చిన్న ఆడ పిల్ల నుంచి వృద్ధురాలి వరకు ఎవరైనా ఒంటరిగా కనిపిస్తే చాలు అస్సలు వదలకుండా వెంటాడి వారిని టీజ్ చేస్తుంటారు. ఇలా కేవలం టీజింగ్ మాత్రమే కాదు లైంగిక వేధింపులు, అత్యాచారం వంటి ప్రమాదాలు చాలా వెలుగుచూస్తుంటాయి. ఇలాంటిదే తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇలాంటి ఘటనలు ఎన్ని వెలుగులోకి వచ్చినా కూడా కొత్త చట్టాలు వాటి కోసం పుట్టుకువచ్చినా కూడా సమాజంలో మనుషులు మాత్రం అస్సలు మారడం లేదు. నిత్యం ఏదో ఒకచోట ఇలాంటి అత్యాచార ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా వెలుగుచూసిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది. నడిరోడ్డుపై ఆకతాయి వ్యక్తి ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. యువతిని వెంటాడుతూ ఆమెను కొడుతూ చిత్రహింసలు చేశాడు.
ప్రతీ చోట ఏదో ఒక ఘటన జరుగుతూనే ఉంటుంది. అమ్మాయిలను ఒంటరిగా ఉండడం చూసి ఆకతాయిలు ఆటపట్టిస్తుంటారు. అయితే తాజాగా ఓ యువతి ఒంటరిగా కనింపిచడంతో ఓ యువకుడు ఆమె వెంటపడి వేధించడం ప్రారంభించాడు. జన సంచారం లేకపోవడంతో యువతి ఒంటరిగా ఉండడం చూసి రెచ్చిపోయాడు. ఆమెను వెంటాడుతూ చిత్రహింసలు చేసేందుకు ప్రయత్నించాడు. ఈ తరుణంలో ఊహించని ఘటన వెలుగుచూసింది. అటువైపుగా ఓ బస్సు రావడంతో అందులో ఉన్న ప్రయాణికులు యువతిని చిత్రహింసలకు గురిచేయడం గమనించారు. దీంతో బస్సు నుంచి కొంత మంది యువకులు దిగి ఆమెను కాపాడేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆకతాయిని చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
For harrassing a girl on road pic.twitter.com/TBJmwRVHAc
— CCTV IDIOTS (@cctvidiots) April 9, 2023