EPAPER

PM Modi Vande Bharat: మూడు వందే భారత్ రైళ్లు ప్రారంభించిన ప్రధాని మోదీ.. దక్షిణాది రాష్ట్రాలకు పెద్దపీట!

PM Modi Vande Bharat:  మూడు వందే భారత్ రైళ్లు ప్రారంభించిన ప్రధాని మోదీ.. దక్షిణాది రాష్ట్రాలకు పెద్దపీట!

PM Modi Vande Bharat | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ఆగస్టు 31న మూడు కొత్త వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. ఈ మూడు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ టైన్లు తమిళనాడు, కర్ణాటక, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రా మధ్య ప్రయాణం సాగిస్తాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాలలో భాగంగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్లు ప్రజలు సౌకర్యవంతంగా రాష్ట్రాల మధ్య వేగంగా ప్రయాణించేందుకు ఉపయోగపడతాయని రైల్వే మంత్రిత్వశాఖ తెలిపింది.


వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ల ప్రాముఖ్యత
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 15, 2019లో ప్రారంభమైన వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్.. రైలు మార్గంలో వేగంగా ప్రయాణం, లగ్జరీకి ప్రతీకగా మారింది. ఈ ట్రైన్లో ఇప్పటివరకు కేవలం ఏసీ క్లాస్ సీటింగ్ మాత్రమే ఉంటాయి. అయితే త్వరలో స్లీపర్ వసతి కూడా వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో ఉంటుందని రైల్వే శాఖ ఇటీవల తెలిపింది. ప్రస్తుతం 100 వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ట్రైన్స్ దేశవ్యాప్తంగా 280 జిల్లాల్లో పరుగులు తీస్తున్నాయి. చాలా సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవం కోసం ఇందులో నిత్యం లక్షల మంది ప్రజలు ప్రయాణిస్తున్నారు.

కొత్త వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్లు ఏ మార్గంలో నడుస్తాయంటే

మీరట్ సిటీ – లక్నో వందే భారత్ ఎక్స్ ప్రెస్: ఉతర్ ప్రదేశ్ రాష్ట్రంలో మీరట్ నగరం నుంచి రాజధాని లక్నో వరకు ప్రయాణించే తొలి వందే భారత్ ఎక్స్ ప్రెస్ ని ప్రధాన మంత్రి మోదీ ప్రారంభించారు. ఈ ట్రైన్ వల్ల సాంస్కృతిక రంగం, పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని, స్థానిక పరిశ్రమలకు రాజధానితో అనుసంధానం జరుగుతందని ప్రధాని మోదీ అన్నారు.


మదురై – బెంగుళూరు వందే భారత్ ఎక్స్ ప్రెస్: తమిళనాడు లోని మదురై నుంచి కర్ణాటక రాజధాని బెంగుళూరు వరకు ఈ స్పెషల్ ట్రైన్ పరుగులు తీస్తుంది. ప్రాచీన దేవాలయాలకు పేరు గాంచిన మదురై, టెక్నాలజీకి పేరొందిన బెంగుళూరు నగరాల మధ్య చాలా సౌకర్యవంతమైన ప్రయాణం సాగేందుకు కొత్త వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఎంతో ఉపకరిస్తుందని.. ఈ ట్రైన్ వల్ల బిజినెస్, విద్య, కంపెనీలలో పనిచేసే ఉద్యోగులు తమిళనాడు నుంచి కర్ణాటకు సులువుగా రాకపోకలు చేయవచ్చని రైల్వే శాఖ తెలిపింది.

చెన్నై ఎగ్‌మోర్ – నాగర్ కోయిల్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ : తమిళనాడు ప్రజల సౌకర్యం కోసం కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన మరో ట్రైన్ ఇది. చెన్నై నగరం నుంచి నాగర్ కోయిల్ నగరం వరకు కొత్త వందే భారత్ ఎక్స్ ప్రయాణం సాగిస్తుంది. ఈ ట్రైన్ తమిళనాడులో మొత్తం 726 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. మార్గంలోని మొత్తం 12 జిల్లాల్లో ప్రకృతి అందాలు వీక్షిస్తూ.. ఈ ట్రైన్ లో ప్రయాణం చాలా హాయిగా సాగుతుంది.

వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో వసతులు
వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో అత్యాధునిక కవచ్ టెక్నాలజీతో కూడిన భద్రత ఏర్పాట్లు ఉన్నాయి. ట్రైన్ లో దివ్యాంగుల కోసం ప్రత్యేక టాయిలెట్లు, రొటేటింగ్ కుర్చీలు, కళ్లు లేని వారికి బ్రెయిలీ లిపిలో సైన్ భాష సూచికలు లాంటివి మరిన్ని ప్రత్యేకతలున్నాయి.

ALSO READ: ఇండియాలో బిలియనీర్లు.. టాప్‌లో ముంబై, మూడో ప్లేస్‌లో హైదరాబాద్

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×