EPAPER

RahulDravid’s son: క్రికెట్.. జట్టులోకి రాహుల్ ద్రావిడ్ కొడుకు, ఆస్ట్రేలియాతో..

RahulDravid’s son: క్రికెట్.. జట్టులోకి రాహుల్ ద్రావిడ్ కొడుకు, ఆస్ట్రేలియాతో..

Rahul Dravid’s son: టీమిండియా క్రికెట్‌లో వారసుల హవా మొదలైంది. ఇప్పటికే సచిన్ కొడుకు ఐపీఎల్‌లో ఆడుతుండగా, తాజాగా రాహుల్ ద్రావిడ్ కొడుకు వంతైంది. అండర్ -19 జట్టులోకి సమిత్ ద్రావిడ్‌ ఎంపికయ్యాడు.


సమిత్ ద్రావిడ్ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఈ కుర్రోడు అండర్ -19 జట్టులోకి ఎంపికయ్యాడు. ఇంతకీ సమిత్ ఎవరో తెలుసా? టీమిండియా మాజీ కోచ్ రాహుల్‌ ద్రావిడ్ కొడుకు. కర్ణాటక స్టేట్ లీగ్‌లో అదరగొడుతున్నాడు.

రీసెంట్‌గా జరిగిన టోర్నీలో సమిత్ ఆల్ రౌండర్ అవతారం ఎత్తాడు. పరుగులు, వికెట్లు తీయడంతో సెలక్టర్ల దృష్టి మనోడిపై పడింది. ఈ ఏడాది జరిగిన కూచ్ బెహర్ ట్రోపీలో కర్ణాటక జట్టు విజయం సాధించడం వెనుక కీలక పాత్ర పోషించాడు.


ALSO READ: పారా ఒలింపిక్స్ లో నేడు మనవాళ్ల ఆటలు

బ్యాటింగ్‌లో 300 పైచిలుకు పరుగులు చేయడమేకాదు.. బౌలింగ్‌లో 16 వికెట్లు సొంతం చేసుకున్నాడు. రాహుల్‌ ద్రావిడ్ మాదిరిగా కూల్‌గా ఉంటాడు సమిత్. కాకపోతే మైదానంలో ఆటగాడి శైలిని బట్టి నిర్ణయాలు మార్చుకోవడం తిరుగులేదన్నది కొందరు క్రికెటర్లు చెబుతున్నారు.

సెప్టెంబర్ మూడో వారం నుంచి అండర్ -19 సిరీస్ మొదలుకానుంది. ఈ క్రమంలో సెలక్టర్ల నుంచి సమిత్‌కు పిలుపు వచ్చింది. వన్డే సిరీస్‌తోపాటు నాలుగు రోజుల మ్యాచ్ జరగనుంది. జట్టుకు మహమ్మద్ అమన్ కెప్టెన్. నాలుగు రోజుల మ్యాచ్‌కు సోహమ్ సారధ్యం వహించనున్నాడు.

సమిత్ ఎంపికపై రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. రాహుల్ ద్రావిడ్ టీమిండియాకు మాజీ కోచ్ కావడం వల్లే పిలుపు వచ్చిందని అంటున్నారు. ఈ వాదనను తోసి పుచ్చుతున్నవారు లేకపోలేదు. ఆటల్లో రాణించాలన్నది కేవలం వ్యక్తి గత టాలెంట్ మాత్రమేనని, టాలెంట్ లేకుంటే జట్టులోకి మరికొందరు వస్తారని అంటున్నారు. ఇలాంటి విషయాల్లో ద్రావిడ్ చాలా సీరియస్‌గా ఉంటారని కొందరు మాజీలు చెబుతున్నమాట.

ఈ లెక్కన వచ్చే ఐపీఎల్ నాటికి సమిత్ ఏదో ఒక జట్టులోకి రావడం ఖాయమన్నమాట. అన్నట్లు ఇప్పటికే మాస్టర్ బ్లాస్టర్ సచిన కొడుకు అర్జున్ ఐపీఎల్‌లో ఆడుతున్నాడు. లీగ్‌ల్లో తన ఆటతీరు మెరుగు పరుచుకునే పనిలోపడ్డాడు. వచ్చే ఐపీఎల్ నాటిని  ఒకవైపు అర్జున్ మరోవైపు సమిత్‌ను మైదానంలో చూసే అవకాశం క్రికెట్ అభిమానులకు లభించనుంది.

Related News

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

IND vs BAN: ఇది గంభీర్ కు పరీక్ష.. రేపటి నుంచి బంగ్లాతో తొలిటెస్టు

Big Stories

×