EPAPER

Paralympics: పారా ఒలింపిక్స్: రెండో రోజే పతకాల పంట

Paralympics: పారా ఒలింపిక్స్: రెండో రోజే పతకాల పంట

Day 2 Highlights of Paralympics : అందరూ ఊహించినట్టుగానే పారా ఒలింపిక్స్ లో పతకాల జోరు మొదలైంది. రెండోరోజు ఆటలో ముచ్చటగా మూడు పతకాలు వచ్చాయి. అందులో ఒక స్వర్ణం, రెండు కాంస్య పతకాలు ఉన్నాయి.


మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ స్టాండింగ్‌ ఎస్‌హెచ్‌-1 షూటింగ్‌ విభాగంలో 22ఏళ్ల రాజస్థానీ అమ్మాయి అవనీ లేఖరా స్వర్ణ పతకం సాధించింది. టోక్యో పారా ఒలింపిక్స్‌లో కూడా తను స్వర్ణం సాధించిన విషయం తెలిసిందే.

11 ఏళ్ల వయసులో కారు ప్రమాదానికి గురికావడంతో అవని రెండు కాళ్లు చచ్చుపడిపోయాయి. తర్వాత చదువుకుంటూ ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసింది. అనంతరం పారా ఒలింపిక్స్ లో అడుగు పెట్టింది. మొదట ఆర్చరీ కి వెళ్లి తర్వాత షూటింగుకి మళ్లింది. ఆ నిర్ణయమే తన కెరీర్ ను మలుపు తిప్పి, ఇప్పుడు పతకాల మోత మోగిస్తోంది.


Also Read: అరంగేట్రంలోనే అదరగొట్టిన ‘శీతల్’

ఇక మహిళల 100 మీటర్ల టీ 35 విభాగంలో ప్రీతి పాల్ కాంస్య పతకం సాధించింది. తను 14.21 సెకన్లలో రేసును ముగించింది. అంతేకాదు వ్యక్తిగతంగా మెరుగైన రికార్డు సాధించింది. అలా ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో భారత్ తొలి పతకం సాధించింది.

10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్ హెచ్ 1 ఈవెంట్ లోనే మోనా అగర్వాల్‌ కూడా కాంస్య పతకం గెలిచింది. ఒకే ఈ వెంట్ లో భారతీయులు ఇద్దరు రెండు పతకాలు అందుకున్నారు. భారత్ ఖాతాను మోనానే ఆరంభించింది. తన తర్వాత కాసేపటికీ అవని బంగారు పతకంతో మెరిసింది.

పారిస్ పారా ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించిన అవని లేఖరా ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ఈ మేరకు ఆయన X వేదికగా ట్వీట్ చేశారు. పారిస్ పారా ఒలింపిక్స్ లో భారత్ ఖాతా తెరిచిందని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. పారా ఒలింపిక్స్ లో మూడు స్వర్ణాలు సాధించిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించిందని, ఆమెకు ఉన్న పట్టుదల ఇలాగే కొనసాగాలని, మరిన్ని పతకాలు సాధించాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×