EPAPER

Amazon Employee High Salary:’నేను ఏ పనిచేయడం లేదు.. అయినా కంపెనీ కోట్ల జీతం ఇస్తోంది’.. సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్!

Amazon Employee High Salary:’నేను ఏ పనిచేయడం లేదు.. అయినా కంపెనీ కోట్ల జీతం ఇస్తోంది’.. సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్!

Amazon Employee High Salary| అమెజాన్ కంపెనీలో పనిచేసే ఓ ఉద్యోగి ఇటీవల సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ బాగా వైరల్ అవుతోంది. ఆ పోస్టు చదివిన వారంతా నిజాయితీగా పనిచేసేవారికి తగిన ఫలితం దక్కదు అని విమర్శలు చేస్తున్నారు. ఆ పోస్టు చేసిన ఉద్యోగి తాను ఒక కంపెనీలో గత ఒకటిన్నర సంవత్సర కాలంగా పనిచేస్తున్నాని.. అయితే గడిచిన ఈ కాలంలో తాను కంపెనీకి పెద్దగా ఉపయోగపడే ఏ పనిచేయలేదని రాశాడు. పైగా తాను కేవలం రోజంతా ఆఫీసులో కూర్చొని వారితో, వీరితో మీటింగ్ కేవలం మీటింగ్ చేసినందుకు కంపెనీ తనకు దాదాపు రూ.3 కోట్లు వేతనం చెల్లించిందని రాశాడు.


వివరాల్లోకి వెళితే.. సోషల్ మీడియాలోని బ్లైండ్ అనే ఫోరమ్ లో ఒక పోస్ట్ బాగా వైరల్ అవుతోంది. ఆ పోస్ట్ చేసిన వ్యక్తి తాను అమెజాన్ కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తున్నట్లు రాశాడు. అంతకుముందు తాను గూగుల్ కంపెనీలో పనిచేశానని.. అయితే గూగుల్ కాస్ట్ కట్టింగ్ ప్రక్రియలో భాగంగా తాను ఉద్యోగం కోల్పోయానని చెప్పాడు. అయితే తనకు కొంత సమయం తరువాత అమెజాన్ నుంచి కాల్ వచ్చిందని.. అమెజాన్ లో తాను సీనియర్ టెక్నికల్ మేనేజర్ పొజిషన్ లో ఉద్యోగం పొందినట్లు రాశాడు

Also Read: డిగ్రీ చదవకుండానే సంవత్సరానికి రూ.5 కోట్లు సంపాదిస్తున్న యువతి.. ఎలాగంటే?..


అయితే తనకు లభించిన పెద్ద ఉద్యోగంలో గత ఒకటిన్నర సంవత్సరానికి గాను 3,70,000 డాలర్లు (భారత కరెన్సీ రూ.3 కోట్లకు పైగా) సంపాదించానని వెల్లడించాడు. కానీ వేతనం భారీగా తీసుకున్నా.. దానికి తగ్గట్లు పనిమాత్రం చేయలేదని స్వయంగా అంగీకరించాడు. ”ఒకటిన్నర సంవత్సరం క్రితం గూగుల్ లో లే ఆఫ్ చేసే క్రమంలో నేను ఉద్యోగం కోల్పోయాను.. అదే సమయంలో నాకు అమెజాన్ లో జాబ్ దొరికింది. కానీ నేను ఈ జాబ్ లో ఏ మాత్రం కష్టపడ పనిచేయలేదు. వారంలో 8 గంటలు మీటింగ్ లు చేసేవాడిని. అమెజాన్ గోల్ ప్రాసెస్ లో నేను జీరో గోల్స్ సాధించాను. కేవలం నామమాత్రంగా ఏడు టికెట్లు పరిష్కరించాను. ఒకే ఒక డ్యాష్ బోర్డ్ తయారు చేసి ఇచ్చాను అది కూడా చాట్ జీపిటీ ఉపయోగించి కేవలం 3 రోజుల తయారు చేశాను. కానీ కంపెనీలో మాత్రం డ్యాష్ బోర్డ్ తయారు చేయడానికి 3 నెలల సమయం పట్టిందని చెప్పాను.” అని ఏ దాపరికాలు లేకుండా నిజమంతా బయటపెట్టాడు.

సోషల్ మీడియాలో బ్లైండ్ అనే ప్లాట్ ఫార్మ్ ఉంది. ఇందులో కేవలం వెరిఫైడ్ ప్రొఫెషనల్స్ మాత్రమే తమ పనికి సంబంధించిన విషయాలు షేర్ చేసుకుంటారు. అయితే ఈ పేరు వెల్లడించని అమెజాన్ ఉద్యోగి మాత్రం చాలా ఇన్ పార్మల్ గా పోస్ట్ చేశాడు. అయితే తాను ఇంక ఎంతకాలం ఈ ఉద్యోగంలో కొనసాగుతానో తనకే తెలీదనీ రాశాడు.

Also Read: 69 మందిని ఆత్మహత్యలు చేసుకోకుండా కాపాడిన హీరో ఇతనే.. ఇదంతా ఎలా చేశాడంటే..

ఆ ఉద్యోగి చేసిన పోస్ట్ పై చాలా మంది నెటిజెన్లు కామెంట్లు చేశారు. ”ఇలాంటి జాబ్ కావాలని నేను చాలాకాలంగా కలలు కంటున్నాను. ఇదే నా డ్రీమ్ జాబ్ ” అని ఒక యూజర్ రాశాడు. ఇంకొకరైతే.. ”ఇలాంటి ఉద్యోగులు.. నిజాయితీగా పనిచేసే వారికి సమస్యలు తెచ్చిపెడతారు. వీరి వల్ల రోజంతా కష్టపడి పనిచేసేవారికి విలువ లేకుండా పోతోంది.” అని కామెంట్ చేశాడు.

మరొకరైతే.. ”ఒక వ్యక్తి రోజులో ఆఫీసు కోసం 2 గంటలు మాత్రమే పనిచేసి.. ఇంటి గురించి ఆలోచిస్తూ.. ఫ్యామిలీ కోసం జీవిస్తాడో అలాంటి వ్యక్తి జీవితంలో సక్సెస్ సాధిస్తున్నట్లేగా?…” అని రాశాడు.

Also Read: లారీ డ్రైవర్ నెల ఆదాయం రూ.10 లక్షలు.. ఎలా సంపాదిస్తున్నాడో తెలుసా?

Related News

Viral Video: డాక్టర్‌పై చెప్పులతో దాడి.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..

Shocking Video: సన్యాసిగా మారిన పిల్లిని ఎప్పుడైనా చూశారా..! ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు

Mystery: చావు రహస్యం తేలిపోనుంది.. మరణం తర్వాత మూడో దశ!.. కన్ఫమ్ చేసిన సైంటిస్టులు

Flipkart: స్మార్ట్‌ఫోన్ పై 99 శాతం డిస్కౌంట్.. ఇదెక్కడి మోసమంటూ ఫ్లిప్‌కార్ట్‌పై కస్టమర్ల ఆగ్రహం

Viral Video: నూడుల్స్‌ని ఇష్టంగా లాగించేస్తున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు

Amazon Delivery After 2 Years: రెండేళ్ల క్రితం అమెజాన్ ఆర్డర్ క్యాన్సిల్.. రీఫండ్ పూర్తి.. ఇప్పుడు డెలివరీ!

Viral Video: మీరేంట్రా ఇలా ఉన్నారు.. రూ. 10 జిలేబీ కోసం కొట్టుకుంటారా..

Big Stories

×