EPAPER

Heeramandi: ఓటీటీలో మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతున్న హీరామండి

Heeramandi: ఓటీటీలో మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతున్న హీరామండి

Heeramandi nominated for Best OTT Original at Busan Film: సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన హీరామండి ఈ ఏడాది మేలో ఓటీటీలో రిలీజయింది. సంజయ్ లీలా భన్సాలీ గతంలో భారీ తరహా చారిత్రాత్మక చిత్రాలకు దర్శకత్వం వహించారు. బాజీరావ్ మస్తానీ, పద్మావత్ వంటి సినిమాలన్నీ అద్భుతమైన కళాఖండాలే. అయితే ఆయన తొలిసారి రూపొందించిన వెబ్ సిరీస్ హీరామండి. మనీషా కోయిరాలా, సోనాక్షి సిన్హా, అతిదిరావు హైదరీ, రిచా చద్దా వంటి అగ్ర నటీమణులు నటించిన ఈ చిత్రం ఈ సంవత్సరం నెట్ ఫ్లిక్స్ లో ఓటీటీగా విడుదలై సంచలనాలు క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే 4.5 మిలియన్లతో దూసుకుపోతోంది. దాదాపు 43 దేశాలలో టాప్ టెన్ ట్రెండింగ్ చార్ట్ లో నెంబర్ వన్ గా నిలిచి చరిత్ర సృష్టిస్తోంది.


స్వతంత్ర భారత్ కు ముందు..

భారత్ లో 1947 కు ముందు అప్పటి అవిభాజ్య పాకిస్తాన్ ప్రాంతంలో జరిగిన సంఘటనల సమాహారమే హీరామండి. అదొక వేశ్యా వాటిక ఉండే ప్రాంతం. ఈ వెబ్ సిరీస్ లో ఒక పక్క వేశ్యల కథాంశాన్ని.. మరో పక్క బ్రిటీషర్లపై ఎదురుతిరిగే గూఢచారి వేశ్య పాత్రను చాలా చక్కగా తెరకెక్కించిన విధానం వ్యూయర్స్ ని బాగా ఆకట్టుకుంది. హీరామండి మూవీలో ప్రతి పాత్రకూ ప్రాధాన్యత ఉంటుంది. ఆ పాత్రలను పరిచయం చేసిన విధానం..నడిపించిన కథాంశం..ఇలా అడుగడుగునా సంజయ్ లీలా భన్సాలీ పనితనం కనిపిస్తుంది. ముఖ్యంగా చివరి రెండు సిరీస్ ఆపై వచ్చే క్లైమాక్స్ ఈ మూవీలో భావోద్వేగంతో సాగుతాయి. సెట్టింగులు, ఫొటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ కూడా ఒకదానితో ఒకటి పోటీపడతాయి. ఈ సిరీస్ తెలుగు తో సహా 14 భాషలలో ఓటీటీ లో రిలీజయింది. క్లాసికల్ డ్రామాగా, విజువల్ ఫీస్ట్ గా రూపొందిన హీరామండి అత్యధిక వ్యూయర్స్ చూసిన వెబ్ సిరీస్ గా రికార్డులు క్రియేట్ చేస్తోంది.


గ్లోబల్ అవార్డులు..

హీరామండి ఉత్తమ ఓటీటీ ఒరిజినల్ గా, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ప్రతిష్టాత్మక బూసాన్ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ గ్లోబల్ అవార్డుకు ఎంపికయింది. ఈ వెబ్ సిరీస్ నే కొద్దిగా కుదించి రెండు పార్టులుగా సినిమా విడుదల చేసివుంటే బాగుండేది అని చాలా మంది సినీ పండితులు భావిస్తున్నారు. సంజయ్ లీలా భన్సాలీ అంటే ఆ మాత్రం గ్రాండియర్ షో గా ఉండాలి. అయితే బుల్లితెరపై భారీ సెట్టింగులు, సౌండ్ ఎఫెక్టులు , విజువల్ వండర్స్ ఎంజాయ్ చేయలేకపోయామని..అదే థియేటర్లలో చూస్తే మంచిగా ఎంజాయ్ చేసేవారమని అంటున్నారంతా. అయితే హీరామండికి బెస్ట్ ఓటీటీ ఒరిజినల్ కు నామినేట్ అయినందుకు తన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు సంజయ్ లీలా భన్సాలీ.

ఇన్ స్టా లో స్పందన

ఈ సందర్భంగా తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు సంజయ్ లీలా భన్సాలీ. ఇదంతా గొప్పగా నటించిన అగ్రతారాగణం వలనే సాధ్యమయిందని..అంతా కలిసి ఓ టీమ్ వర్క్ గా ఈ కళాఖండాన్ని రూపొందించడం జరిగిందని అన్నారు. తన ప్రధమ ప్రయత్నంగా అందించిన వెబ్ సిరీస్కి ఇంతటి ఆదరణ లభిస్తుందని అనుకోలేదని..ఊహించినదాని కన్నా ఎక్కువ రెస్పాన్స్ వచ్చిందని..ఇప్సటికీ వీక్షకులు హీరామండిని ఓటీటీలో ఆదరిస్తూనే ఉన్నారని ఈ సందర్భంగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు సంజయ్ లీలా భన్సాలీ.

Related News

OTT Movie : మైండ్ డిస్టర్బింగ్ టీనేజర్స్ మూవీ.. స్టూడెంట్స్ మస్ట్ వాచ్

OTT Movie : ఓటీటీలోకి వచ్చేసిన అచ్చ తెలంగాణ ఫీల్ గుడ్ మూవీ… చిన్నప్పటి రోజుల్లోకి వెళ్ళాల్సిందే

OTT Movie : అమ్మాయి కోసం ప్రాణాలు పణంగా పెట్టే మగాళ్లు… భయపెడుతూనే నవ్వించే ఈ మూవీని ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోందంటే?

Horror Thriller OTT : ఊహకందని ట్విస్టులతో హార్రర్ థ్రిల్లర్ మూవీ.. మళ్లీ మళ్లీ చూడాలంపించే సీన్స్..

Best OTT Movies: ఒక షాపింగ్ మాల్.. ఒక మాస్క్ మ్యాన్.. దారుణ హత్యలు, ఇంట్రెస్టింగ్‌గా సాగిపోయే సిరియల్ కిల్లర్ మూవీ ఇది

OTT Bold Movie: టెంప్ట్ అయ్యే సీన్స్ తో అబ్బాయిల రొమాన్స్.. మరి ఇంత బో**..

Raghu Thatha On OTT: ఓటీటీలో రికార్డు సృష్టించిన ‘రఘు తాత’ మూవీ.. 24 గంటల్లో 50 మిలియన్ వ్యూస్

Big Stories

×