EPAPER

Kadambari: ముంబై నటి కేసులో న్యూ ట్విస్ట్.. ముందు ముగ్గురు.. నాలుగు గంటలపాటు..

Kadambari: ముంబై నటి కేసులో న్యూ ట్విస్ట్.. ముందు ముగ్గురు.. నాలుగు గంటలపాటు..

Kadambari: ఏపీలో సంచలనం రేపుతోంది ముంబై నటి కాదంబరి జెత్వానీ వేధింపుల కేసు. ఈ వ్యవహారంలో గత వైసీపీ పాలకుల చుట్టూ ఉచ్చు బిగిసుకుంటోంది. తెర ముందు ముగ్గురు ఐపీఎస్ అధికారులుండగా, తెరవెనుక ఎంతమంది ఉన్నారన్నది తేలాల్చివుంది. కాకపోతే ఈ కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి రావడంతో ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందోనన్న చర్చ మొదలైపోయింది.


ముంబై నటి కేసులో గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం రాత్రి వరకు అసలేం జరిగింది? గురువారం సాయంత్రం ముంబై నుంచి బయలుదేరిన నటి కాదంబరి, రాత్రి తొమ్మిదిన్నరకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగింది. రాత్రికి హైదరాబాద్‌లో బస చేసిన ఆమె, ఏపీ పోలీసుల సాయంతో శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లింది.

పేరెంట్స్‌తో కలిసి నోవోటెల్ హోటల్‌కు చేరుకుంది నటి. అక్కడ తన న్యాయవాదులతో కలిసి చర్చించింది. ముఖ్యంగా విచారణ అధికారికి వాంగ్మూలం ఇచ్చేందుకు ఆధారాలపై మంతనాలు జరిపింది. శుక్రవారం సాయంత్రం విజయవాడ సీపీ కార్యాలయానికి పేరెంట్స్‌తో కలిసి వెళ్లింది. తనకు జరిగిన అన్యాయం గురించి అధికారులకు వెల్లడించింది. తన కుటుంబానికి న్యాయం చేయాలని విన్నవించింది.


ALSO READ:  వైఎస్ జగన్‌ మెడకు.. రాజుగారి ఉచ్చు బిగుసుకోబోతుందా?

ఆ తర్వాత విచారణ అధికారి స్రవంతిరాయ్‌ని కలిసి మొదటి నుంచి ఏమి జరిగిందన్న దానిపై డీటేల్స్ (డాక్యుమెంట్స్ ఆధారాలు, ఆడియో, వీడియోలు ఫోటోలను) అందజేసింది. శుక్రవారం సాయంత్రం ఆరుగంటలకు మొదలైన విచారణ రాత్రి 10 గంటలకు వరకు సాగింది. అంటే దాదాపు నాలుగు గంటలపాటు జరిగిందన్నమాట. ఆమె వాంగ్మూలాన్ని మొత్తం వీడియో రూపంలో అధికారులు భద్రపరిచారు.

చివరకు మీడియా ముందుకు వచ్చిన కాదంబరి, ఏపీ పోలీసులు తనపై తప్పుడు కేసు పెట్టారని మీడియా ముందు కన్నీరు పెట్టుకుంది. వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని తెలిపింది. ముఖ్యంగా ముంబై కేసుకు ఏపీలో నమోదైన కేసుకు లింక్ ఉందని తాను భావిస్తున్నట్లు మనసులోని మాట బయటపెట్టింది. ఇందులో అధికారం, డబ్బు కీలక పాత్ర పోషించాయి. నిజం బయటకు వస్తుందని అప్పటి సీపీ కాంతిరానా తనపై అక్రమ కేసులు బనాయించారు.

తనను 10 నుంచి 15 మంది పోలీసులు కిడ్నాప్ చేశారని, వారు తక్కువ స్థాయి అధికారులు ఉంటారని తాను భావిస్తున్నట్లు చెప్పుకొచ్చింది నటి. ఇందులో రాజకీయ నాయకులకు సంబంధం ఉందా లేదా అన్నది తేలాల్చి ఉందన్నారు. సాగర్‌తో మ్యారేజ్ ప్రతిపాదన తొమ్మిదేళ్ల కిందట వచ్చిందని, దాన్ని తిరస్కరించానని, ఈ నేపథ్యంలో తనపై కసి పెంచుకుని ఇదంతా చేశారన్నది ముంబై నటి వెర్షన్.

ఈ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారుల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఆంజనేయులు, కాంతిరానా, విశాల్‌గున్నీ బయటకు రాగా, తెర వెనుక మరో ఇద్దరు అధికారులున్నారని తెలుస్తోంది. వీరి కాకుండా మరో 25 మంది ఖాకీలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ ఎపిసోడ్ మొత్తానికి ఆనాటి రాజకీయ పెద్దల అండదండలు పుష్కలంగా వున్నాయని కనిపిస్తోంది. ముగ్గురు ఐపీఎస్‌లను విచారిస్తే.. ఈ కేసు లోగుట్టు బయటపడుతుందని కాదంబరి కుటుంబ సభ్యుల మాట. ఈ కేసుపై పూర్తి నివేదిక నాలుగురోజుల్లో ఇవ్వాలని భావించినప్పటికీ, మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరో విషయం ఏంటంటే.. జెత్వానీపై కేసు నమోదు ముందు ఏపీలో పోలీసులు ముంబై రెక్కీ నిర్వహించినట్టు వార్తలు వస్తున్నాయి. ముంబైలో రెక్కీ నిర్వహించిన సమయంలో ఎస్ఐ స్థాయి అధికారుల టీమ్ ఒకటి ఢిల్లీ వెళ్లింది. అక్కడికి పోలీసుల టీమ్ ఎందుకు వెళ్లింది? సేకరించిన వివరాలేంటి? అనే దానిపై విచారణ టీమ్ ఫోకస్ చేసింది.

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×