EPAPER

Ice Water For Skin: ఐస్ వాటర్‌తో మొటిమలకు చెక్ !

Ice Water For Skin: ఐస్ వాటర్‌తో మొటిమలకు చెక్ !

Ice Water For Skin: ముఖం‌పై మొటిమలు, మచ్చలు లేకుండా ఉండాలని అందరూ అనుకుంటారు. మారిన జీవన శైలితో పాటు అనారోగ్య కారణాల వల్ల ముఖంపై మొటిమలు, మచ్చలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటి నివారణకు ఎన్నీ క్రీములు వాడినా ఒక్కోసారి ఫలితం ఉంటదు. అంతే కాకుండా సైడ్ ఎఫెక్ట్ వల్ల మొటిమలు మరింత పెరుగుతాయి. రసాయనాలతో తయారు చేసిన రకరకాల క్రీములు వాడకూడదని నిపుణులు చెబుతున్నారు. సింపుల్ స్కిన్ కేర్ టిప్స్ వల్ల వీటిని తగ్గించుకోవచ్చని అంటున్నారు. ఇంట్లో ఉండే కొన్ని రకాల పదార్థాలతో ముఖాన్ని మెరిసేలా చేసుకోవచ్చు. ముఖంపై ఉన్న మొటిమలు తగ్గి, కాంతివంతమైన చర్మం కావాలని అనుకునే వారు ఐస్ వాటర్ ఫేషియల్ ట్రై చేయాల్సిందే. మరి ఈ ఫేషియల్ ఎలా ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసకుందాం.


ఐస్ వాటర్ ఫేషియల్..

ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకోవాలి. అందులో సగానికి పైగా నీరు నింపుకోవాలి. ఆ తర్వాత అందులో 5-6 ఐస్ ముక్కలను వేసుకోవాలి. ఐస్ ముక్కలు కాస్త కరిగిన తర్వాత అందులో మీ ముఖం పెట్టి 5 సెకన్ల తర్వాత తీసేయండి. ఇలా కనీసం 4-5 సార్లు చేయాలి. ఇలా చేయడం వల్ల చాలా లాభాలు ఉంటాయి. ముఖంపై ఉన్న జిడ్డు తొలగిపోతుంది. అంతే కాకుండా ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.


మేకప్ : ఐస్ వాటర్‌ను ఫేషియల్ కోసం వాడటం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఐస్ వాటర్ ఫేషియల్ చేసిన తర్వాత మేకప్ వేసుకుంటే కనక ఎక్కువ సేపు ఉంటుంది. కొరియన్ల చర్మ సౌందర్యానికి ఐస్ ఫేషియల్ కూడా ఓ కారణం. ముఖాన్ని 3 నుంచి 4 నిమిషాల పాటు ఐస్ వాటర్‌లో ఉంచి మెత్తటి వాటర్ తుడుచుకోవాలి. కాసేపు ఆగిన తర్వాత మేకప్ వేసుకుంటే చాలా సేపు మేకప్ అలాగే ఉంటుంది.

ఎరుపు తగ్గుతుంది: కొందరి ముఖంపై తరుచుగా ఎరుపు రంగులో చిన్న చిన్న మొటిమలు వస్తుంటాయి. ఐస్ వాటర్ ఫేషియల్ వల్ల ఈ సమస్య తగ్గుతుంది. అంతే కాకుండా ఈ ఫేషియల్ ద్వారా రక్త ప్రవాహం తగ్గడం వల్ల కళ్ల ఉబ్బరంతో పాటు కళ్ల క్రింద నల్లటి వలయాలు తగ్గుతాయి. ముఖం అదనపు మెరుపును సంతరించుకుంటుంది.

జిడ్డు తొలగిపోతుంది: ముఖంపై జిడ్డు కారణంగా మొటిమలు, మచ్చల వంటివి వస్తుంటాయి. చర్మంపై వచ్చే మొటిమల వల్ల ఇబ్బందిగా ఉంటుంది. ఈ ఐస్ వాటర్ ఫేషియల్ వల్ల రక్త నాళాలు సంకోచిస్తాయి. ఫలితంగా చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి. ముఖంపై ఉండే జిడ్డు తొలగిపోవడం వల్ల ముఖంపై మొటిమలు రాకుండా ఉంటయి.

చర్మ రంధ్రాలు బిగుతుగా మారతాయి: ఐస్ వాటర్ ఫేషియల్ వల్ల చర్మంపై ఉన్న రంధ్రాలు బిగుతుగా మారతాయి. చర్మం నునుపుగా మారుతుంది. ఆయిల్ స్కిన్ ఉన్న వారికి మొఖంపై నూనెలు పేరుకుపోతాయి. అలాంటి వారికి ఈ ఫేషియల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా ముఖంలో గ్లో పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

Also Read:  ఈ ఫేషియల్‌తో.. మెరిసే చర్మం మీ సొంతం !

గ్లోయింగ్ స్కిన్: ఐస్ వాటర్ ఫేషియల్ వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ఐస్ వాటర్ ముఖంపై శోషణ సామర్థాన్ని పెంచుతుంది. ఫలితంగా సీరమ్‌లతో పాటు మాయిశ్చరైజర్లను చర్మం ఈజీగా గ్రహిస్తుంది. దీని వల్ల చర్మ సంరక్షణ ఉత్పత్తులు కూడా ప్రభావవంతంగా పని చేసే అవకాశం ఉంటుంది. ఇది చర్మంలో ఆక్సిజన్ స్థాయిలను పెంచుతుంది. అందుకే చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. సున్నితమైన చర్మం ఉన్న వారు ఈ ఫేషియల్ వాడే ముందు ఒక్కసారి వైద్యులను సంప్రదించడం మంచిది.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Big Stories

×