EPAPER

Hair Care Tips: ఈ టిప్స్‌తో మీ జుట్టు పెరగడం ఖాయం !

Hair Care Tips: ఈ టిప్స్‌తో మీ జుట్టు పెరగడం ఖాయం !

Hair Care Tips: పట్టుకుచ్చుల్లాంటి పొడవైన జుట్టు కావాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. ముఖ్యంగా అమ్మాయిలు పొడవైన జుట్టు కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు రకరకాల షాంపూలు, హెయిర్ ఆయిల్స్ వాడితే మరికొందరు హోం రెమెడీస్ ఫాలో అవుతుంటారు. ఏదీ ఏమైనా ప్రస్తుతం మారుతున్న జీవనశైలితో పాటు కాలుష్యం, హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ వల్ల విపరీతంగా జుట్టు రాలుతోంది. ఈ సమస్యతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారు ఈ చిన్న టిప్స్ ఫాలో అవ్వడం వల్ల జుట్టు రాలే సమస్యే ఉండదు. అంతే కాకుండా జుట్టు బాగా పెరుగుతుంది కూడా. జుట్టు పెరగడానికి పాటించాల్సి టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


ముఖ్యంగా జుట్టు రాలకుండా ఉండాలి అంటే తల శుభ్రంగా ఉండటం చాలా అవసరం. తలస్నానం చేసినప్పుడు జుట్టు రాలడం అనేది అందరికే ఓ పెద్ద టాస్క్ . అందుకే జుట్టు త్వరగా ఆరాలనే ఉద్ధేశ్యంతో చాలా మంది హెయిర్ డ్రయర్‌లను వాడుతూ ఉంటారు. ఇవి జుట్టు పెరుగుదలను అడ్డుకుంటాయి. అంతే కాకుండా హెయిర్‌ను చాలా వరకు డ్యామేజ్ చేస్తాయి. కేవలం స్టైలింగ్, స్ట్రెయిట్‌నింగ్ లే.. కాకుండా ఎండలో అతిగా తిరగడంతో పాటు జడను గట్టిగా అల్లడం వల్ల కూడా జుట్టు రాలుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చాలా మంది తలస్నానం చేసిన తర్వాత జుట్టు తడి పోవాలని తువాలుతో కొట్టడం వంటివి చేస్తుంటారు. ఇలాంటివి కూడా జుట్టుకు హాని కలిగిస్తాయి.

  • హెయిర్ డ్రయ్యర్లు, స్ట్రెయిట్నర్లు, జుట్టు కుదుళ్లకు కెరాటిన్ నష్టాన్ని కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. కెరాటిన్ దెబ్బతినడం వల్ల జుట్టు బలహీనపడుతుంది. తద్వారా జుట్టు రాలడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి.
  • తలస్నానం చేసిన తర్వాత కండిషనర్ అప్లై చేసే అలవాటు చాలా మందికి ఉంటుంది. అలాంటి వారు జుట్టుకు కండీషనర్ అప్లై చేసిన తర్వాత దువ్వెనతో దువ్వుతారు. కానీ ఇది సరైన పద్దతి కాదు. జుట్టు తడిగా ఉన్నప్పుడు దువ్వడం వల్ల జుట్టు కుదుళ్లు బలహీనపడతాయి. ఫలితంగా జుట్టు రాలే సమస్య బాగా పెరగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితిలోనూ తడి జుట్టును దువ్వెనతో దువ్వకుండా ఉండాలి. జుట్టు పూర్తిగా ఆరిన తర్వాతే దువ్వాలని నిపుణులు చెబుతున్నారు.
  •  జుట్టు రాలుతోందని కొంతమంది ఇంటర్నెట్‌లో ఏ టిప్స్ చెబితే ఆ టిప్స్ ఫాలో అవుతూ ఉంటారు. ఈ టిప్స్ జుట్టుకు మేలు చేయకపోయినా హాని కలిగించే అవకాశాలు మాత్రం ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి నిపుణుల సలహా మేరకు చిట్కాలు పాటించడం మంచిది.
  • మరికొందరు జుట్టు కట్ చేస్తే పెరగదని అనుకుంటారు. కానీ రెండు నెలలకోసారైనా చివర్లు కట్ చేయాలని నిపుణులు చెబుతున్నారు. చివర్లు చిట్టిన హెయిర్ కట్ చేసినప్పుడు తొలగించడం వల్ల జుట్టు బాగా పెరగుతుంది.

Also Read: జుట్టు రాలుతోందా ? ఈ హెయిర్ ప్యాక్ ఒక్క సారి ట్రై చేసి చూడండి


  • జుట్టుకు ఆయిల్ పెట్టకుంటే జిడ్డుగా ఉంటుందని, లేదా సమయం లేదనే కారణంతో చాలా మంది జుట్టుకు ఆయిల్ పెట్టుకోరు. కానీ జుట్టు ఆయిల్ పెట్టుకోకపోవడం వల్ల జుట్టు చాలా వరకు దెబ్బతింటుంది. జుట్టు బాగా పెరగాలంటే వారినికి కనీసం రెండు సార్లయినా గోరువెచ్చటి నూనెతో అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల తలకు రక్తప్రసరణ బాగా అవుతుంది. ఇది వెంట్రుకలను రక్షిస్తుంది.
  • ఇదిలా ఉంటే మనం రోజు ఉపయోగించే దిండ్లు కూడా జుట్టు రాలడానికి కారణం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే మనం వాడే దిండ్లు శుభ్రంగా ఉంచుకోవడం ఎంతైనా అవసరం.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Honey For Face: తేనెతో ఈ ఫేస్‌ ప్యాక్‌ ట్రై చేశారంటే.. వారం రోజుల్లో ముడతలు మాయం

Big Stories

×