EPAPER

Red Chili Powder: కూరల్లో రుచి కోసం కారం ఎక్కువగా తింటున్నారా.. ? ఎంత ప్రమాదమో తెలుసా

Red Chili Powder: కూరల్లో రుచి కోసం కారం ఎక్కువగా తింటున్నారా.. ? ఎంత ప్రమాదమో తెలుసా

Red Chili Powder: కూరల్లో అన్నీ ఉన్నా సరే ఒక్కటి లేకపోతే మాత్రం అసలు కూరకు రుచి అస్సలు రాదు. కూరల్లో కారం లేకుంటే అసలు దానికి రుచి రాదు అని ప్రతీ కూరలోను కారం వేయకుండా అస్సలు వండరు. అయితే కేవలం రుచి కోసం మాత్రమే కారం వాడినా కూడా కొంత మంది మాత్రం కారం ఎక్కువగా తింటుంటారు. కారం ఎక్కువగా లేకపోతే అసలు కూరలను తినడానికి కూడా ఇష్టపడరు. ముఖ్యంగా పచ్చి మిర్చి కారం కంటే ఎక్కువగా ఎర్రటి కారంను ఉపయోగించడం వల్ల కూరకు రుచి వస్తుంది. అయితే ఇలాంటి వంటకాలు తినడం వల్ల చాలా రకాల సమస్యలు ఎదురవుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.


ఎండు మిర్చి కారంను వంటల్లో ఎక్కువగా వాడుతుంటారు. ముఖ్యంగా మాంసాహారం వంటకాల్లో అయితే విపరీతంగా వాడేస్తుంటారు. అయితే ఎండు మిర్చి కారం ఎక్కువగా తినడం వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు కడుపు నొప్పి, అల్సర్, వాంతులు వంటి సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు.

ఎండు మిర్చికి బదులుగా మిరపకాయను వంటల్లో వాడడం వల్ల రుచితో పాటు ఆరోగ్యం కూడా దెబ్బ తినకుండా ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు ఎండు మిర్చి కారం ఎక్కువగా తింటే విరేచనాలు అయ్యే అవకాశం కూడా ఉంటుందట. మరోవైపు ఎండు మిర్చి కారం కారణంగా కడుపుపై తీవ్రమైన నొప్పి భారం పడుతుంది. అంతేకాదు ముక్కు కారటం వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి. ఇక కొందరికి అయితే జలుబు చేసి ముక్కు రంధ్రాలు మూసుకుపోయే అవకాశం ఉంటుంది.


ఆహారంలో ఎండు మిర్చి కారం ఎక్కువగా తీసుకుంటే అధిక రక్తపోటు సమస్యలు ఎదురవుతాయి. కారం ఎక్కువగా తింటే అడ్రినలిన్ స్థాయిలు కూడా పెరుగుతాయి. దీని కారణంగా రక్తపోటు సమస్య ఎదురవుతుంది. అంతేకాదు దీనిని అతిగా తింటే దద్దుర్లు కూడా అవుతాయట. అందువల్ల కారం ఎక్కువగా తినకుండా పచ్చిమిర్చి కారం తినడం మంచిది.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Honey For Face: తేనెతో ఈ ఫేస్‌ ప్యాక్‌ ట్రై చేశారంటే.. వారం రోజుల్లో ముడతలు మాయం

Big Stories

×