EPAPER

CM Revanth Reddy: కవిత బెయిల్‌పై వ్యాఖ్యలు.. సుప్రీంకోర్టుపై సీఎం రేవంత్ సంచలన ట్వీట్

CM Revanth Reddy: కవిత బెయిల్‌పై వ్యాఖ్యలు.. సుప్రీంకోర్టుపై సీఎం రేవంత్ సంచలన ట్వీట్

CM Revanth Reddy Said Respect for the Indian Judiciary: భారత ఉన్నత న్యాయస్థానంపై అత్యంత గౌరవం ఉందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. న్యాయవ్యవస్థపై తనకు అపారమైన నమ్మకం ఉందని, దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పును తప్పు బట్టే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. కావాలనే తన వ్యాఖ్యలను తప్పుగా వక్రీకరించి ప్రచారం చేయడంపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్‌పై నేను మాట్లాడిన మాటలను సోషల్ మీడియా సంస్థలు తప్పుదోవ పట్టించేలా ప్రసారం చేయించారన్నారు. అలాగే కొన్ని మీడియాలో వచ్చిన వార్తలకు విచారం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు.


‘2024 ఆగస్టు 29న కొన్ని వ్యాఖ్యలు నేను చేసినట్లు పలు మీడియా సంస్థల్లో వచ్చాయని, అందులో నేను కోర్టును ప్రశ్నిస్తన్నట్లు అర్థంలో ధ్వనించాయి. నేను చేసిన వ్యాఖ్యలు తప్పుదోవ పట్టించేలా వార్తలు, కథనాలు కూడా వచ్చాయి. ఇలాంటి వార్తలు ప్రముఖ మీడియా సంస్థలో రావడంపై విచారం వ్యక్తం చేస్తున్నా. న్యాయవ్యవస్థ, దాని స్వతంత్రతపై నాకు అపార గౌరవం, విశ్వాసం ఉంది. రాజ్యాంగం, దాని విలువను విశ్వసించే నేను..ఎప్పటికీ రాజ్యాంగం, న్యాయవ్యవస్థను అత్యున్నతమైనదిగా భావిస్తూనే ఉంటాను.’ అని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

ఇదిలా ఉండగా, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత బెయిల్ ఇవ్వడంపై రేవంత్ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు స్పందించింది. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి చేయాల్సిన వ్యాఖ్యలు కాదని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఆయన న్యాయస్థానానికి ఉద్దేశాలను ఆపాదించినట్లు వ్యాఖ్యానించారని చెప్పింది.


ఓటుకు నోటు కేసును బదిలీ చేయాలని కోరుతూ బీఆర్ఎస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్లపై వాదనల తర్వాత ఈ వ్యాఖ్యలు చేసింది. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ విజయం కోసం బీఆర్ఎస్ పనిచేసిందని, బీఆర్ఎస్, బీజేపీల మధ్య కుదిరిన ఈ ఒప్పందంతో కవితకు బెయిల్ వచ్చిందని సీఎం కామెంట్స్ చేసినట్లు పలు మీడియా సంస్థల్లో కథనాలు వచ్చాయి. ఈ వ్యాఖ్యలపై కవిత తరఫున న్యాయవాదులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఈ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

జస్టిస్ బీఆర్ గవాయి స్పందించారు. సీఎం స్థాయి హోదాల్లో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని, ఈ వ్యాఖ్యలు భయాలు పెంపొందించే అవకాశం ఉన్నట్లు చెప్పారు. రాజకీయాలకునుగుణంగా తీర్పులు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయమూర్తులుగా మేము ప్రమాణం చేస్తామని, మనస్సాక్షిగా మా విధులను సక్రమంగా నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు.

Also Read: హైదరాబాద్.. అక్రమ కట్టడాలను కూల్చివేసిన హైడ్రా, ఎక్కడ?

అనంతరం జస్టిస్ కేవీ విశ్వనాథన్ మాట్లాడారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి చేయాల్సిన వ్యాఖ్యలు కాదన్నారు. సంస్థలనపై గౌరవం ఉండాలని చెప్పాడు. చివరగా జస్టిస్ గవాయి మాట్లాడుతూ..చట్టసభలు, కార్యనిర్వాహక వ్యవస్థ కార్యక్రమాల్లో తాము జోక్యం చేసుకోమని, రాజకీయ నాయకుల నుంచి సైతం అలాగే ఉండాలని ఆశిస్తామన్నారు.

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×