EPAPER

Nandamuri Balakrishna: బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవం..నోవాటెల్ హైటెక్స్ సిద్ధం

Nandamuri Balakrishna: బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవం..నోవాటెల్ హైటెక్స్ సిద్ధం

Cine celebrities atten Nandamuri Balakrishna 50 Years Celebrations on September 1st: అటు రాజకీయాలలో..ఇటు సినిమారంగంలో అపూర్వ హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకుని రెండు రంగాలలో విజయభావుటా ఎగురవేస్తున్నారు నందమూరి నట సింహం బాలకృష్ణ. బాలనటుడిగా తెరంగేట్రం చేసిన బాలయ్య కెరీర్ పరంగా 50 సంవత్సరాలు పూర్తిచేసుకున్నారు. ఈ సందర్భంగా సినీ అతిరథుల సమక్షంలో సెప్టెంబర్ 1న హెచ్ ఐసీసీ వేదికగా భారీ ఎత్తున వేడుకలు నిర్వహిస్తున్నారు. సరిగ్గా 50 సంవత్సరాల క్రితం 1974 ఆగస్టు 30న తాతమ్మ కల విడుదలయింది. ఆ మూవీలో బాలనటుడిగా తండ్రి ఎన్టీఆర్, భానుమతి లాంటి దిగ్గజాల సరసన నటించారు బాలకృష్ణ. అయితే బాలకృష్ణ గురించి కొన్ని తెలియని విషయాలు చాలానే ఉన్నాయి. క్రమశిక్షణ పాటించడంలో తండ్రి ఎన్ టీఆర్ నే ఆదర్శంగా తీసుకుంటారు. ఆయనలాగానే తెల్లవారుజామున మూడు గంటలకే నిద్రలేస్తారు. సూర్యోదయం అవ్వకుండానే తన నిత్య పూజ కూడా పూర్తిచేస్తారు. ఈ మధ్యలో గంటపాటు శారీరక వ్యాయామం చేస్తారు. సినిమాల పరంగా, రాజకీయ పరంగా ఎంతటి బిజీగా ఉన్నా తప్పకుండా తన కుటుంబ సభ్యుల కోసం సమయం కేటాయిస్తుంటారు.


కుటుంబ సభ్యుల కోసం..

ఉన్న కొద్దిసేపూ ఫ్యామిలీ మెంబర్స్ తో ఉల్లాసంగా గడిపేందుకు ఉత్సాహపడుతుంటారు. అలాగే పండుగల సందర్భంలో కూడా పూర్తిగా ఇంటికే పరిమితం అవుతుంటారు. దాదాపు తన బిజీ షెడ్యూల్స్ ను ఆ సమయంలో వాయిదా వేసుకుంటారు. నిత్యం న్యూస్ పేపర్లు ఫాలో అవుతుంటారు. రాజకీయాల కన్నా సినిమా వార్తలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంటారు.
బాలయ్య చిన్నపిల్లలతో ఉన్నప్పుడు చిన్నవాడిగా మారిపోతారు. అలాగే పెద్ద వారితో మాట్లాడేటప్పుడు ఎంతో హుందాగా ఉంటారు. ప్రతి రోజూ రాత్రి సమయంలో పడుకునే ముందర తండ్రి సీనియర్ ఎన్టీఆర్ నటించిన పాత సినిమాను చూసి పడుకుంటారు. మరీ నిద్ర వస్తే కనీసం కొన్ని సన్నివేశాలు అయినా చూసిన తర్వాతే విశ్రమిస్తారట. మనసుకు ఏది నచ్చితే అది చేసేస్తారు. ఎవరి కోసమో తన అలవాట్లు మానుకోరు. అలాగే తిండి విషయంలో తనకు ఏది ఇష్టమో అదే తింటారు. సీనియర్ ఎన్టీఆర్ రాముడి పాత్ర వేయాల్సి వచ్చినప్పుడు ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసేవారు. అందుకు తగినట్లుగానే సాత్విక ఆహారం తినేవారట. సినిమా షూటింగ్ పూర్తయ్యేదాకా నాన్ వెజ్ కూడా ముట్టేవారు కాదట. అలాగే భీముడు పాత్ర చేయవలసి వచ్చినప్పుడు మాత్రం మామూలు ఆహారం కన్నా కొంచెం ఎక్కువగానే తినేవారట.


విజయాల వెనుక భార్య

దేహదారుఢ్యంగా కనిపించడానికి నేచురల్ ట్రిక్స్ పాటించేవారు. కానీ ఇప్పుడొస్తున్న హీరోలు కేవలం రెండు లేక మూడు వారాలలో బాడీ బిల్డప్ కనిపించడానికి మార్కెట్లో దొరికే కొన్ని మందులు వాడుతున్నారు. దాని వలన భవిష్యత్తులో చాలా ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే బాలకృష్ణ కూడా ఈ విషయంలో తన తండ్రినే ఫాలో అవుతారు. శ్రీరామరాజ్యం షూటింగ్ జరిగినంత కాలం నాన్ వెజ్ కు దూరంగా ఉన్నారట. ఇలా పాత్రల కోసం ప్రాణం పెట్టే ఫ్యామిలీని నందమూరి కుటుంబంలోనే చూస్తుంటాం. బాలకృష్ణ తన విజయాల వెనుక తన భార్య వసుంధర పాత్ర ఎంతైనా ఉందని చాలా సందర్భాలలో చెప్పారు. తాను సినిమా షూటింగుల్లో బిజీగా ఉన్నప్పుడు వసుంధర తన కుమారుడు, ఇద్దరు కూతుళ్ల ను కంటికి రెప్పలా చూసుకునేవారట. ఆమె తన విజయాలకు మూల కారణం అంటారు గర్వం లేకుండా బాలకృష్ణ.

సింహా సెంటిమెంట్

లక్ష్మీనరసింహ స్వామి భక్తుడైన బాలయ్య తన సినిమాల టైటిల్స్ విషయంలో ఎక్కువగా సింహ అని వచ్చేలా చూసుకుంటారు. అలా సింహా టైటిల్ తో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. తెలుగు భాష ప్రియుడైన బాలకృష్ణకు సంస్స్కృతంలోనూ మంచి పట్టు ఉంది. అలవోకగా కొన్ని సంస్కృత పద్యాలు కూడా చెప్పగలరు. ఇక తల్లి బసవతారకం పేరిట రెండు తెలుగు రాష్ట్రాలలో క్యాన్సర్ రోగులకు ఉచిత సేవలు అందిస్తున్నారు.

Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×