Israel and Gaza agrees to pauses in fighting for polio vaccine drive by UNO: ఇజ్రాయెల్..హమాస్ మధ్య పది నెలలుగా భీకర యుద్ధం కొనసాగుతోంది. కాల్పుల విరమణ, యుద్ధ ఖైదీల విడుదల వంటి అంశాలపై చర్చలు జరిగినా ఆ చర్చలు విఫలం కావడంతో యుద్ధం కొనసాగుతునే ఉంది. అయితే ఇజ్రాయెల్..హమాస్ మధ్యవర్తులుగా ఖతార్, అమెరికా ,ఈజిప్ట్ బృందాలు ఉన్నాయి. ఇరు దేశాల మధ్య సామరస్య పూర్వక వాతావరణ ఉండేందుకు ఈ దేశాలు కృషి చేస్తున్నాయి. అయితే అనూహ్య పరిణామాల మధ్య ఈ ఇరుదేశాలు యుద్ధానికి తాత్కాలిక బ్రేక్ ఇచ్చాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ పుణ్యమా అని ఇరు దేశాలూ దాడులు, యుధ్దానికి బ్రేక్ ఇచ్చాయి. గత పదినెలలుగా రసాయనాలతో కూడిన ఆయుధాలతో జరుపుతున్న దాడులకు మళ్లీ గాజాలో పోలియో మహమ్మారి విజృంభిస్తోంది. ముఖ్యంగా నెలలు నిండని చిన్నారులపై ఈ దుష్ప్రభావం కనిపిస్తోంది. దీనితో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇరు దేశాల నేతలతో చర్చించింది.
ఇరు దేశాల హామీ
పోలియో వ్యాక్సినేషన్ కు సహకరించాల్సిందిగా కోరింది. అయితే పోలియో వ్యాక్సినేషన్ నిర్వహిస్తున్న ప్రాంతాలలో యుద్ధాన్ని ఆపేస్తామని ఇరు దేశాలు ప్రపంచ ఆరోగ్య సంస్థకు హామీ ని ఇచ్చాయి. వ్యాక్సినేషన్ ఏ ఏ ప్రాంతాలలో వేస్తున్నారో అందుకు సంబంధించిన మ్యాప్ వివరాలు ఇవ్వాల్సిందిగా ఇరు దేశాలు ప్రపంచ ఆరోగ్య సంస్థను కోరాయి. దాదాపు గాజా దేశం మొత్తంగా విడతల వారీగా పోలియో వ్యాక్సినేషన్ కింద టీకాలు సమకూరుస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ.