EPAPER

Kambadari jitwani: జైత్వానీ కేసులో మరో అప్డేట్.. నేడు హైదరాబాద్‌కు రానున్న..

Kambadari jitwani: జైత్వానీ కేసులో మరో అప్డేట్.. నేడు హైదరాబాద్‌కు రానున్న..

Kambadari jitwani: ఏపీలో రోజుకొక వ్యవహారం బయటపడుతూ హాట్ హాట్ చర్చలు జరుగుతున్న క్రమంలో తాజాగా మరో అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ముంబై హీరోయిన్ జైత్వానీ ఓ మీడియా ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ సంచలన విషయాలను వెల్లడించింది. తనను 45 రోజులపాటు బంధించి బట్టలేకుండా ఫొటోలు తీసి పలువురు నేతలు హింసించారంటూ వాపోయింది. అంతేకాదు.. పలువురు తనకు న్యూడ్ కాల్స్ చేసి, ఒంటరి యువతినైనా తనను చిత్రహింసలకు గురిచేశారంటూ ఆవేదనను వ్యక్తం చేసింది. తన తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత తనదేనని, అయితే, తమకు ఎవరూ లేరని కాపాడాలంటూ బోరున విలపించింది. తనకు జరిగిన అన్యాయం మరెవ్వరికి జరగకూడదని.. తనను వేధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆ ఇంటర్వ్యూలో విన్నవించింది. ఇటు ఏపీతోపాటు దేశ వ్యాప్తంగా రక్షణ కల్పించాలని కోరింది. ప్రస్తుతం ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నది. పోలీసులు ప్రత్యేక దృష్టిని సారించారు. ఈ క్రమంలో మరో కీలక అప్ డేట్ వెలుగులోకి వచ్చింది. అదేమంటే.. ?


కాదంబరి జెత్వానీ నేడు రాత్రికి ముంబై నుంచి హైదరాబాద్ కు రానున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ కు చేరుకున్న అనంతరం ఆమెను ఏపీ పోలీసుల రక్షణతో విజయవాడకు తీసుకువెళ్లనున్నారని తెలుస్తోంది. అక్కడికి వెళ్లిన తరువాత.. నేతల వేధింపుల వ్యవహారానికి సంబంధించి ఆమె స్టేట్ మెంట్ ను రికార్డు చేయాలని ఏపీ పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే జెత్వానీని ఏపీకి తీసుకువస్తున్నారని సమాచారం. అయితే, జెత్వానీని హైదరాబాద్ కు తీసుకు వచ్చి అక్కడి నుంచి నేరుగా ఆమెతో మాట్లాడిన తరువాత విజయవాడకు తరలించే అంశానికి సంబంధించి పరిశీలిస్తున్నామని, జెత్వానీ తరఫు న్యాయవాదులు, ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నామని సంబంధిత అధికారులు చెబుతున్నట్లు సమాచారం.

Also Read: ఆ వివరాలను త్వరలోనే వెల్లడిస్తా: మంత్రి లోకేశ్


ఇంతకు ఏం జరిగిందంటే..?

అయితే, ముంబైకి చెందిన జెత్వానీని ఏపీకి చెందిన పలువురు నేతలు, ఇతరులు చిత్రహింసలకు గురిచేశారనే వార్త కలకలం రేపుతున్నది. జిత్వానీని ప్రేమ పేరుతో కృష్ణా జిల్లాకు చెందిన ఓ నేత ప్రేమ పేరుతో లొంగదీసుకున్నారని, ఆ తరువాత ఆమెను పెళ్లి చేసుకోకుండా మోసగించినట్లు చర్చ నడుస్తున్నది. ఈ వ్యవహారమంతా బయటకు పొక్కకుండా సదరు నేత మరికొంతమంది నేతల సాయం తీసుకున్నారని, అందుకు పలువురు అధికారులు కూడా సపోర్ట్ చేశారని టాక్ వినిపిస్తున్నది. వారిలో పలువురు ప్రముఖులే ఉన్నట్లు ఏపీ ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు.

ఇందుకు సంబంధించి విజయవాడ పోలీసులు కూడా స్పందించిన విషయం తెలిసిందే. ఈ కేసులో పలువురు ఉన్నతాధికారుల పాత్ర కూడా ఉందంటూ వార్తా కథనాలు వస్తున్నాయని, అదేవిధంగా ఇందుకు సంబంధించి ఇప్పటికే నమోదైనటువంటి కేసు వివరాలను కూడా  తాము పరిశీలిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర డీజీపీ ఈ కేసు వివరాలపై ఆరా తీస్తున్నారని వెల్లడించారు. అదేవిధంగా మహిళా ఉన్నతాధికారిని ఈ కేసు విచారణ కోసం ప్రత్యేకంగా నియమించినట్లు చెప్పుకొచ్చారు. బాధితురాలితో మాట్లాడి అన్ని వివరాలను తీసుకుంటామన్నారు. వీలైనంత తొందరలోనే విచారణను పూర్తి చేసి, నివేదికను డీజీపీకి అందజేస్తామన్నారు. ఈ కేసులో అధికారుల పాత్ర ఉన్నట్లు తేలితే వారిపై డీజీపీ చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు.

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×