EPAPER

Hydra Key Decision: హైడ్రా సంచలన నిర్ణయం.. ఆ అధికారులపై కేసు నమోదు!

Hydra Key Decision: హైడ్రా సంచలన నిర్ణయం.. ఆ అధికారులపై కేసు నమోదు!

Hydra Key Decision: రాష్ట్రంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ సంచలనం రేపుతున్న హైడ్రా తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నది. ఎఫ్టీఎల్ లో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించి మొత్తం ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ సైబరాబాద్ కమిషనర్ కు హైడ్రా సిఫార్సులు చేసింది. అదేవిధంగా హెచ్ఎండీలో అక్రమంగా అనుమతులు ఇచ్చిన అధికారుల జాబితాను కూడా హైడ్రా సిద్ధం చేసింది.


Also Read: హైడ్రా నోటీసుల పేరుతో డబ్బులు వసూలు.. సీరియసైన సీఎం రేవంత్ రెడ్డి

అయితే, అక్రమ నిర్మాణదారులకే ఇప్పటివరకు హైడ్రా సెగ తగిలింది. ఇప్పుడు నిబంధనలకు నీళ్లొదిలిన అధికారులకు సైతం హైడ్రా సెగ తగులుతున్నది. కాగా, నగరంలో చెరువులను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను హైడ్రా కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. అయితే, కూల్చివేతలు చేపట్టిన ప్రాంతాల్లో హైడ్రా ప్రారంభం నుంచి విధులు నిర్వహించిన సంబంధిత అధికారుల వివరాలను సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. హైడ్రా ఇప్పటివరకు 18 ప్రాంతాల్లో చిన్నా పెద్దవి కలిపి 150కి పైగా నిర్మాణాలను కూల్చివేసినట్లు అధికారుల సమాచారం. ఈ అక్రమ నిర్మాణాలను కూల్చివేసి 50 ఎకరాల వరకు ప్రభుత్వ, చెరువుల భూములను పరిరక్షించినట్లు హైడ్రా అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లో హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారుల పాత్రపై కూడా అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.


Also Read: తెలంగాణ బీజేపీలో విభేదాలు.. రాష్ట్ర అధ్యక్ష పదవికి.. కొత్త నేతలకు అర్హత లేదా..?

కాగా, నగరంలోని పలుచోట్ల చాలామంది చెరువులను ఆక్రమించి నిర్మాణాలను చేపట్టారు. దీనిపై విచారణ చేసేందుకు ప్రభుత్వం పర్యవేక్షణ అధికారులను నియమించిన విషయం తెలిసిందే. ఆ పర్యవేక్షణ అధికారులు తమకు కేటాయించిన ప్రాంతాల్లో చేపడుతున్న నిర్మాణాలు నిబంధనల మేరకు జరుగుతున్నాయా..? లేదా ? తనిఖీ చేయాల్సిన బాధ్యత వారిపై ఉంది. ఒకవేళ వారు అనుమతులు తీసుకోని యెడల వాటిని కూల్చి వేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో పర్యవేక్షణ అధికారులే కాదు.. అటు ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు కూడా నిర్మాణాలపై ఫోకస్ పెట్టాల్సిన బాధ్యత ఉంది పలు ప్రాంతాల్లో సర్వే నెంబర్లు వేరుగా వేసి నిర్మాణ అనుమతులు తీసుకున్నట్లుగా కూడా హైడ్రా అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. నిర్మాణాలకు అనుమతులు జారీ చేసేదాని కంటే ముందుగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాల్సి ఉంటుంది. అలా చేస్తే సర్వే నెంబర్ సరైనదా? కాదా ? అనేది అధికారులకు స్పష్టం తెలిసిపోతుంది. అయితే, ఈ మేరకు అక్రమ నిర్మాణాలకు సంబందించి, ఆయా ప్రాంతాల్లో విధులు నిర్వర్తించిన అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వహించడంలో నిబంధనలకు తిలోదకాలు ఇచ్చారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఈ క్రమంలోనే హైడ్రా వారిపై దృష్టి సారించింది.

Related News

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు కీలక పరిణామం.. వారికి రెడ్‌ కార్నర్‌ నోటీసులు!

Cabinet Meeting: నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

Cash for Vote Scam: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

BRS Mlc Kavitha: రంగంలోకి కవిత.. రీఎంట్రీకి ముహూర్తం ఫిక్స్!

New Ration Card: ప్రజలకు శుభవార్త.. అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులకు అర్జీలు.. అర్హతలు ఇవే!

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Big Stories

×