EPAPER

Kalki 2898 Ad Ott Record Views: ప్రభాస్‌పై పగబట్టిన నేషనల్ మీడియా.. రికార్డు స్థాయి వ్యూస్‌తో సమాధానమిచ్చిన ‘కల్కి 2898 ఏడీ’

Kalki 2898 Ad Ott Record Views: ప్రభాస్‌పై పగబట్టిన నేషనల్ మీడియా.. రికార్డు స్థాయి వ్యూస్‌తో సమాధానమిచ్చిన ‘కల్కి 2898 ఏడీ’

Kalki 2898 AD On OTT: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘కల్కి 2898 ఏడీ’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీసును షేక్ చేసింది. కనీవినీ ఎరుగని రీతిలో దూసుకుపోయింది. ఎన్నో అంచనాల నడుమ జూలై 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాతో దర్శకుడు సినీ ప్రియుల్ని సరికొత్త ప్రపంచలోకి తీసుకెళ్లాడు. విజువల్ వండర్‌గా తెరకెక్కించి అదరగొట్టేశాడు. ఇందులోని యాక్షన్ సన్నివేశాలు అభిమానుల్ని ఉర్రూతలూగించాయి.


స్టార్ కాస్టింగ్ ఇందులో నటించడంతో సినిమాకు మరింత బజ్ ఏర్పడింది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశాపటానీ వంటి స్టార్ నటీ నటులు ఇందులో ప్రధాన పాత్రలో నటించి అదరగొట్టేశారు. అలాగే విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, దర్శకుడు రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, ఫరియా అబ్దుల్లా వంటి వారు గెస్ట్ రోల్‌లో కనిపించి సినిమా పై మరింత హైప్ క్రియేట్ చేశారు. ఇలా స్టార్లతో సినిమాను హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కించి దర్శకుడు సక్సెస్ అయ్యాడు.

తీసింది మూడో సినిమానే అయినా.. తన ప్రతిభను కనబరిచాడు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా కంటెంట్, విజువల్స్, క్యారెక్టర్స్ ఇలా ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకున్నాడు. దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద రూ.1200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి అబ్బురపరచింది. ఎన్నో రికార్డులను సైతం కొల్లగొట్టగా.. మరికొన్నింటిని క్రియేట్ చేసింది. ఇలా దాదాపు 50 రోజులకు పైగా ఈ సినిమా థియేటర్లలో రన్‌ను కొనసాగించి అలరించింది.


అయితే ఈ సినిమా ఇటీవలే ఓటీటీలోకి వచ్చింది. ఆగస్టు 22 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్‌ అమెజాన్‌ ప్రైమ్‌లో తెలుగుతో పాటు, దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్‌కి వచ్చింది. అదే సమయంలో కల్కి హిందీ వెర్షన్ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అయింది. అయితే తెలుగు వెర్షన్ కంటే హిందీ వెర్షన్‌ ఓటీటీలో దుమ్ము దులిపేస్తుంది. ఎవరూ ఊహించని విధంగా అదరగొడుతోంది. రికార్డ్ వ్యూస్‌తో పరుగులు పెడుతోంది.

Also Read: ఓటీటీలో కట్ అయిన కల్కి సీన్లు ఇవే..

గత వారం రోజుల్లో నాన్ ఇంగ్లీష్ లిస్టులో వరల్డ్ వైడ్‌గా టాప్ 10 జాబితాలో రెండవ ప్లేస్ సంపాదించుకుంది. కల్కి 2898 AD తన తొలి వారంలో 4.5 మిలియన్ల వీక్షకులతో మొత్తం 13.1 మిలియన్ వీక్షణ గంటలతో లిస్ట్‌లో 2వ స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. అయితే అతి తక్కువ సమయంలో ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ సినిమా ఇదే అని కూడా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీని బట్టి గ్లోబల్ వైడ్‌గా కల్కి ఓటీటీలో దూసుకుపోతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

అయితే ఈ సినిమాకు ఇంతలా ఓటీటీలో ఆదరణ లభించడానికి ముఖ్య కారణం కల్కి థియేటర్లలో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అందుకోవడమే. ఏకంగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ జవాన్ మూవీ, పఠాన్ మూవీల రికార్డులను సైతం బద్దలు కొట్టడంతో ఈ సినిమా రేంజ్ మరింత పెరిగిపోయింది. అయితే కల్కికి ఇంతటి రెస్పాన్స్ రావడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలోని కొందరు నిప్పులు కక్కుతున్నారు. ఒక టాలీవుడ్ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వస్తుండటంతో బాలీవుడ్‌లోని కొందరు నటులు సహించుకోలేకపోతున్నారు. ఇందులో భాగంగానే సినిమాపై, అలాగే ప్రభాస్ పై నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. అంతేకాకుండా నేషనల్ మీడియా సైతం ప్రభాస్ పై పగబట్టిందనే చెప్పాలి.

ఇటీవలే ఓ నటుడు ఈ సినిమాకి వస్తున్న ఆదరణ చూడలేక ప్రభాస్ కల్కి సినిమాలో జోకర్‌లా ఉన్నాడంటూ కామెంట్లు చేశాడు. దీనిబట్టి చూస్తే బాలీవుడ్‌లోని కొందరు ప్రభాస్ పై ఎలాంటి పగబట్టారో అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రభాస్ పై, అతడి సినిమాలపై నెగిటివ్ కామెంట్స్ చేయడం వారికి ఇది కొత్తేమి కాదు. ఇలా ప్రభాస్ సినిమా వచ్చిన ప్రతిసారి చేస్తూనే ఉంటారు. అయితే ఇటీవల నెగిటివ్ కామెంట్స్ చేసిన వారికి.. ఓటీటీ కల్కికి వచ్చిన వ్యూసే గట్టి సమాధానం ఇచ్చాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

Related News

Fear Teaser: సస్పెన్స్ థ్రిల్లర్ గా ఫియర్ టీజర్.. అద్భుతమైన పర్ఫామెన్స్ తో హైప్ పెంచేసిన వేదిక.!

Jani Master : లీగల్‌గా పోరాడుతా.. లైంగిక ఆరోపణలపై ఫస్ట్ టైమ్ స్పందించిన జానీ మాస్టర్

Jani Master : ‘మాస్టర్ అమాయకుడు’ రోజురోజుకు పెరుగుతున్న మద్దతు… ఎంత మంది సపొర్ట్ చేశారంటే..?

Bhanumathi: ఉన్నతంగా బ్రతికిన భానుమతి.. చరమాంకంలో దీనస్థితికి చేరుకోవడానికి కారణం..?

Samantha : ఫైనల్‌గా కెమెరా ముందుకు వచ్చిన సామ్… ‘కల…’ అంటూ ఎమోషనల్ పోస్ట్

Ruksana Bano: ప్రముఖ సింగర్ మృతి.. షాకింగ్‌లో ఫ్యాన్స్.. విషం ఇచ్చి హత్య!

Bollywood Actress : ఇక బాలీవుడ్ ఖాళీ… టాలీవుడ్‌పై కన్నెసిన జాన్వీ బెస్ట్ ఫ్రెండ్..

Big Stories

×