EPAPER

Nani- suryah: వస్తారు.. హిట్ కొడతారు.. రిపీట్

Nani- suryah: వస్తారు.. హిట్ కొడతారు.. రిపీట్

Nani- suryah: ఇండస్ట్రీలో  హీరోలు ఎలాంటి కథలు తీసినా ప్రేక్షకులు చూస్తారు అనుకొనే రోజులు పోయాయి. కథలో బలం ఉంటే అది ఎలాంటి సినిమా అయినా కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇక ప్రేక్షకులను మెప్పించాలంటే ఎలాంటి కథలను ఎంచుకోవాలో తెలుసుకున్న హీరోలే ప్రస్తుతం ఇండస్ట్రీని ఏలుతున్నారు. అందులో ముందు ఉండే హీరో న్యాచురల్ స్టార్ నాని.


రెండేళ్లుగా నాని వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. దసరా, హాయ్ నాన్న.. ఇప్పుడు సరిపోదా శనివారం.  కథలో బలం ఉంటె ప్రేక్షకులు ఎలాగైనా హిట్ ఇస్తారని నమ్మిన హీరోల్లో నాని ఒకడు. అందుకు తగ్గట్టుగానే నాని.. వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన సరిపోదా శనివారం సినిమా నేడు రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.

వివేక్ – నాని కాంబోలో ఇప్పటికే అంటే సుందరానికీ అనే సినిమా వచ్చింది. అప్పుడు ఈ సినిమా ఎవరికి నచ్చలేదు. కానీ, ఇప్పుడు ఈ చిత్రం కల్ట్ క్లాసిక్ అని చెప్పుకొస్తున్నారు. వివేక్ టేకింగ్ మొదటినుంచి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఒక క్లాస్ డైరెక్టర్.. మాస్ సినిమా తీస్తే ఎలా ఉంటుంది అనేదానికి ఉదాహరణ సరిపోదా శనివారం. నానిని వివేక్ వాడుకున్న విధానం అదిరిపోయింది.


నిజం చెప్పాలంటే కథలో కొత్తదనం ఉన్నా లేకున్నా.. డైరెక్టర్ చూపించే విధానంలో  కొత్తదనం మిస్ అవ్వకూడదు. ఒక పాత లైన్ ను తీసుకొని.. కొత్త కోణంలో చూపించి హిట్ కొట్టిన డైరెక్టర్స్ ఎంతోమంది. వారం రోజుల కోపాన్ని ఒక్కరోజు చూపించే హీరో అనే లైన్ కొత్తది. కానీ, దాన్ని మూడు గంటల పాటు కన్విన్స్ గా చూపించడమనేది సాహసం. ఒక లాజిక్ లేకపోతేనే ఏం సినిమారా ఇది అని చెప్పే ప్రేక్షకులను మూడు గంటలు కన్విన్స్ గా వివేక్ కుర్చోపెట్టాడు అంటే నిజంగా అతను ఏ రేంజ్ లో కష్టపడ్డాడో అర్ధమవుతుంది.

ఇక హీరోను ఎలివేట్ చేయాలంటే హీరోకు తగ్గ విలన్ ను దింపాలి. ఆ విషయంలో వివేక్ నిజంగా సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఎస్సై దయానంద్ పాత్రలో ఎస్ జె సూర్యను తీసుకోవడం సినిమాకు ప్లస్ పాయింట్. కోలీవుడ్ లో స్టార్ హీరోలకు ధీటుగా విలనిజాన్ని పండించి.. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఎస్ జె సూర్య.. సరిపోదా శనివారం లాంటి సినిమాతో పర్ఫెక్ట్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయనే చెప్పాలి.

దయా పాత్రలో ఎస్ జె సూర్యను తప్ప వేరొకరిని ఊహించుకోలేం అని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. కోలీవుడ్ లో సూర్య ఉన్న ప్రతి సినిమా హిట్. ఆయన లక్ ఈ సినిమాకు కూడా కలిసి వచ్చింది. ఇక వీరిద్దరూ కూడా .. వస్తారు.. హిట్ కొడతారు.. రిపీట్. ప్రస్తుతం ఇదే ట్రెండ్ నడుస్తుంది. సినిమా అన్నాకా కొన్ని లోపాలు ఉంటాయి. అక్కడక్కడా లాజిక్స్ మిస్ అవుతాయి. కథను గ్రిప్పింగ్ గా చెప్తే.. అలాంటి చిన్న చిన్న లాజిక్స్ ను ప్రేక్షకులు పట్టించుకోరు. సరిపోదా శనివారం లో కూడా అదే జరిగింది. మిక్స్డ్ టాక్ లేకుండా పాజిటివ్ టాక్ అందుకున్న ఈ సినిమా మరి ఏ రేంజ్ కలక్షన్స్ అందుకుంటుందో చూడాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.

Related News

Ruksana Bano: ప్రముఖ సింగర్ మృతి.. షాకింగ్‌లో ఫ్యాన్స్.. విషం ఇచ్చి హత్య!

Bollywood Actress : ఇక బాలీవుడ్ ఖాళీ… టాలీవుడ్‌పై కన్నెసిన జాన్వీ బెస్ట్ ఫ్రెండ్..

Squid Game Season 2 Teaser: టీజర్ రిలీజ్ చేసిన నెట్ ఫ్లిక్స్.. ఈ భయంకరమైన ఆట చూడడానికి సిద్ధమా..?

Telugu Actress: ఎన్టీఆర్, ఏఎన్నార్ లనే ఢీ కొట్టిన నటి.. కానీ చనిపోతే మాత్రం.. !

Comedian Sapthagiri: ఇండస్ట్రీకి దూరమయ్యారా లేక దూరం పెట్టారా..?

Johnny Master: ఢీ 11 లో ఎలిమినేట్.. జానీ మాస్టర్ ఇంత కథ నడిపారా.?

Pushpa 2: వార్నర్ మామ ఇండస్ట్రీ ఎంట్రీ,రీల్స్ నుంచి రియల్ సినిమాలోకి

Big Stories

×