EPAPER

Vishal: ఆమెపై వేసే జోకులు తెలుసు, ఆమె ఎవరో తెలీదు.. శ్రీరెడ్డిపై విశాల్ షాకింగ్ కామెంట్స్

Vishal: ఆమెపై వేసే జోకులు తెలుసు, ఆమె ఎవరో తెలీదు.. శ్రీరెడ్డిపై విశాల్ షాకింగ్ కామెంట్స్

Vishal: మలయాళ సినీ ఇండస్ట్రీలో ‘హేమ కమిటీ’ ప్రకంపనలు సృష్టిస్తోంది. మహిళా నటీమణుల వేధింపులపై ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు యావత్ దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తాజాగా మలయాళ సినీ పరిశ్రమలో జస్టిస్ హేమ కమిటీ సమర్పించిన రిపోర్ట్‌లో క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అయితే ఈ హేమ కమిటీ అంటని.. ఇది ఎప్పుడు మొదలైంది.. దీని నేపథ్యం ఏంటని అనుకుంటున్నారా?. దీని గురించి పూర్తి విషయానికొస్తే.. 2017లో హీరోయిన్ భావనపై ఓ కారు దాడి జరిగింది. దీంతో అప్పటి ప్రభుత్వం మలయాళ సినీ పరిశ్రలో నటీమణులు వేధింపులకు సంబంధించిన రిపోర్ట్ సమర్పించాలని ‘హేమా కమిటీని’ ఏర్పాటు చేశారు.


అయితే కమిటీ 2019లో రంగంలోకి దిగింది. ఈ కమిటీ ద్వారా సినీ పరిశ్రమలో మహిళలు ఎలాంటి లైంగిక వేధింపులు ఎదుర్కుంటున్నారు.. వారిని ఎలా వేధిస్తున్నారు. ఎలాంటి బ్లాక్ మెయిల్స్ చేస్తున్నారు అనే దాని మీద ఒక నివేదికను హేమ కమిటీ రూపొందించి కేరళ ప్రభుత్వానికి అందించింది. దీంతో ఈ రిపోర్ట్ చూసి అంతా షాక్ అవుతున్నారు. మహిళా నటీమణులను ఇప్పటికి ఎంతమంది వేధించారు. ఎంతమంది అసభ్యకరంగా ఇబ్బందులు పెట్టారో అని చెప్తుంటే ఆశ్చర్యపోతున్నారు.

దీంతో ఇప్పుడు ఒక్కొక్క నటి బయటకొచ్చి తమ గోడును విలపించుకుంటున్నారు. ఒకప్పుడు లైంగికంగా వేధించినా సైలెంట్‌గా ఉంటేవారు. ఒకవేళ ఎవరికైనా చెబితే అవకాశాలు రావేమో.. లేకుంటే ఇంకేమైనా చేస్తారేమో అని అంతా బిక్కు బిక్కుమనుకొని ఉండేవారు. అయితే ఇప్పుడు అన్నింటిని తెంగించేశారు. ఏం చేస్తారో చేసుకోండంటూ ముందుకు వస్తున్నారు. వరుసగా తమకు జరిగిన ఇబ్బందులు, సమస్యలను సోషల్ మీడియా ద్వారా చెప్పుకొస్తున్నారు. తమను ఎవరెవరు లైంగికంగా వేధించారు.. ఎవరెవరు ఇబ్బందులు పెట్టారో వారి పేర్లు కూడా పబ్లిక్‌గా చెప్పడానికి వెనుకాడటం లేదు.


Also Read: హేమ కమిటీ నివేదికపై సమంత స్పందన ఇదే..

ఒకరు కాదు ఇద్దరు కాదు ఎంతోమంది నటీమణులు నోరువిప్పుతున్నారు. అయితే ఇది ఒక్క మలయాళ ఇండస్ట్రీలోనే కాదు.. అన్ని భాషల ఇండస్ట్రీలోనూ జరుగుతుందని కొందరు చెప్పుకొస్తున్నారు. కానీ ప్రస్తుతం మలయాళం హేమ కమిటీ రిపోర్ట్స్ వలన ఇది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఇండస్ట్రీలో ‘అమ్మ’లో మలయాళీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్న స్టార్ అండ్ సీనియర్ యాక్టర్ సిద్థిఖీ తనను లైంగికంగా ఎంతో వేధించాడంటూ నటి రేవతి సంపత్ తీవ్ర ఆరోపణలు చేసింది. అలాగే సీనియర్ నటి మిను మున్నీరు కూడా దీనిపై స్పందించి తనను నలుగురు వ్యక్తులు లైంగికంగా వేధించారని ఇటీవల తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

గతంలో శ్రీరెడ్డి vs విశాల్

దీనిపై తాజాగా కోలీవుడ్ హీరో విశాల్ స్పందించాడు. ఈ విషయంపైనే కాకుండా అతడు నటి శ్రీ రెడ్డిపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శ్రీరెడ్డి తనకు తెలీదని చెప్పాడు. అయితే వీరిద్దరి మధ్య వివాదం ఇప్పటిది కాదు. గతంలో కూడా వీరిద్దరూ తీవ్ర విమర్శలు చేసుకున్నారు. గతంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఎక్కవయ్యాయని చెప్తూ.. నటుడు విశాల్‌పై శ్రీరెడ్డి తీవ్ర ఆరోపణలు చేసింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో సభ్యత్వం తనకు అంత ఈజీగా లభించలేదని చెప్పుకొచ్చింది. టాలీవుడ్ అనంతరం కోలీవుడ్ పై కూడా విరుచుకుపడింది. గతంలో కోలీవుడ్‌లో నడిగర్ సంఘం ఎన్నికలు జరుగుతున్న క్రమంలో విశాల్‌పై విమర్శలు చేసినట్లు వార్తలు వచ్చాయి.

విశాల్‌కు ఓటు వేసే ముందుకు అతడు ఎలాంటి వాడో ఒకసారి తెలుసుకోవాలని.. అతడు అమ్మాయిలను వాడుకొని వదిలేసే క్యారెక్టర్ గలవాడని అప్పట్లో శ్రీరెడ్డి విమర్శించినట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. అందుకు సంబంధించిన ఆధారాలు సైతం తనవద్ద ఉన్నట్లు చెప్పినట్లు సమాచారం. అయితే ఆమె గతంలో నేచురల్ స్టార్ నానిపై ఇలాంటి ఆరోపణలే చేసినపుడు విశాల్ అండగా నిలబడ్డాడు. అప్పుడే విశాల్.. ఇవాళ నాని అండగా నిలవడంతో రేపు తనపై కూడా అలాంటి ఆరోపణలే చేస్తుందని అప్పట్లోనే విశాల్ చెప్పుకొచ్చాడు.

Also Read: టాలీవుడ్ లో కూడా హేమ కమిటీ.. ?

ప్రస్తుతం శ్రీరెడ్డిపై విశాల్ వ్యాఖ్యలు

ఇప్పడంతా హేమ కమిటీ చర్చే జరుగుతుండటంతో ప్రతి ఒక్కరూ దీనిపై స్పందిస్తున్నారు. నటి కుష్బూ రీసెంట్‌గా స్పందించింది. ఈ కమిటీ పై ప్రశంసలు కురిపించింది. అలాగే నటి సమంత కూడా స్పందించి కమిటీని మెచ్చుకుంది. ఇప్పుడు విశాల్ తన బర్త్ డే సందర్భంగా తాజాగా స్పందించాడు. ఇండస్ట్రీలో ఎవడో ఒకడు పిచ్చిపట్టి ఆడవాళ్లను వేధిస్తుంటారు. అలాంటప్పుడు భయపడకుండా వారిని చెప్పుతో కొట్టాలని అన్నాడు. తమిళ ఇండస్ట్రీలో కూడా అలాంటి వారు ఉంటారని.. అందువల్ల భాదింపపడడ్డ వారు ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేయాలని కోరాడు. హేమ కమిటీ లాగానే తమిళంలో ఓ కమిటీని ఏర్పాటు చేస్తామన్నాడు. అయితే ఆపై శ్రీ రెడ్డి గురించి మాట్లాడుతూ.. శ్రీరెడ్డి ఎవరో తనకు తెలీదని అన్నాడు. అయితే ఆమెపై వేసే జోకులు మాత్రం తాను విన్నట్లు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అతడి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Related News

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్.. డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Hansika Motwani: అసభ్యకరంగా తాకాడు.. నొప్పి భరించలేకపోయా అంటూ హన్సిక ఎమోషనల్..!

Mokshagna: తొలి మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా.. ఆల్ టైం రికార్డ్ సృష్టించబోతున్న బాలయ్య..!

Devara : దేవరను భయపెడుతున్న ఆ సెంటిమెంట్.. ఆ ఒక్కటే ఎన్టీఆర్ కు మైనస్..

Deepika Padukone: గారాల పట్టికి దీపికా ఫస్ట్ గిఫ్ట్… ఏం కొనిపెట్టిందో తెలుసా?

Mad First Single: ఆ “లచ్చి” ప్లేస్ లో “లడ్డు” పెట్టి అదే పాటను మార్చి ఇచ్చేసాడు

Big Stories

×