EPAPER

Nizam Sagar Bridge: రూ.25 కోట్లు ఖర్చుపెట్టారు.. సంవత్సరం తిరగకుండానే కుంగిపోయిన బ్రిడ్జి

Nizam Sagar Bridge: రూ.25 కోట్లు ఖర్చుపెట్టారు.. సంవత్సరం తిరగకుండానే కుంగిపోయిన బ్రిడ్జి

Nizam Sagar Bridge built on Manjeera river sagged in Kamareddy district: ఒకప్పుడు బ్రిడ్జిల నిర్మానం ఎంతో పటిష్టవంతంగా ఉండేది. నూరేళ్లయినా అవి ఉపయోగంలోనే ఉండేవి. అయితే ప్రస్తుత ఇంజనీర్లు కట్టించే బ్రిడ్జీలు సంవత్సరం తిరగకుండానే కుంగిపోతున్నాయి. కొన్ని చోట్ల కూలిపోతున్నాయి. కొద్ది పాటి వరద ప్రవాహానికే తట్టుకోలేక పోతున్నాయి. ఎక్కడైనా రోడ్డు రవాణాన వ్యవస్థ బాగుంటేనే అక్కడ అభివృద్ధి జరుగుతుంది. ఇన్నాళ్లుగా సరైన బ్రిడ్జీలు లేక, రవాణా సదుపాయాలు లేక చాలా వరకూ గ్రామాలు కుగ్రామాలుగా మిగిలిపోయాయి. అయితే ఎప్పుడో నిజాం ప్రభువుల కాలంలో నిర్మించిన నిజాం సాగర్ వంతెన పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో నిజాంసాగర్ మంజీరా నదిపై నిజాం సాగర్ మండల కేంద్రంలో ఓ బ్రిడ్జి నూతనంగా నిర్మించారు. 2025 సంవత్సరంలో అప్పటి బీఆర్ఎస్ ఎంతో వ్యవప్రయాసల కూర్చి రూ.25 కోట్లు ఈ ప్రాజెక్ట పై వెచ్చించింది. ఈ వంతెన నిర్మాణం మొదలుపెట్టి 8 సంవత్సరాలయింది.


కేటీఆర్ ప్రారంభించిన బ్రిడ్జి

2023 సంవత్సరంలో అప్పటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదగా ఈ వంతెనను ప్రారంభించారు. అయితే నాణ్యతా ప్రమాణాలను గాలికి వదిలేసిన ఇంజనీర్లు అప్పటి అధికార్లతో కుమ్మక్కై నాసిరకంగా బ్రిడ్జి నిర్మించారు. మొన్న మార్చి నాటికి సంవత్సరం పూర్తిచేసుకుంది నిజాంసాగర్ బ్రిడ్జి. సంవత్సర కాలానికే బ్రిడ్జి పై గుంతలు ఏర్పడ్డాయి. మధ్య మధ్యలో పగుళ్లు కూడా కనిపిస్తున్నాయి. దానితో అధికారులు స్పందించి సదరు కాంట్రాక్టర్లకు నోటీసులు కూడా జారీ చేశారు. ఏదో పైపై పనులు పూర్తి చేసి చేతులు దులుపుకున్నాడు కాంట్రాక్టర్. అయినా వంతెన కుంగిపోయినట్లుగా కనిపించడంతో దానిపై రాకపోకలు సాగించేందుకు వాహనదారులు భయపడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షం తాకిడికి వంతెన అడుగున రెండు నుంచి మూడు ఇంచులు ఒక్కసారిగా కుంగిపోయింది. ఇకపై వర్షాలుకురిస్తే బ్రిడ్జి మరింతగా కుంగిపోయే ప్రమాదం ఉందని.. ఇప్పటికైనా బ్రిడ్జికి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టాలని ప్రజలు ఆర్ అండ్ బీ అధికారులకు విన్నవించుకుంటున్నారు.


Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×