EPAPER

Jay Shah: ఐసీసీ ఛైర్మన్..పేరు గొప్ప.. ఊరు దిబ్బ ?

Jay Shah: ఐసీసీ ఛైర్మన్..పేరు గొప్ప.. ఊరు దిబ్బ ?

Jay Shah Earning Revealed as the new ICC Chairman: అందరూ అనుకుంటూ ఉంటారు. మన జై షా ఐసీసీ ఛైర్మన్ అయిపోయాడు.. నెల నెలా జీతం కింద లక్షల రూపాయలు వస్తాయి. పేరుకు పేరు, డబ్బుకు డబ్బు, హోదాకి హోదా.. వారెవ్వా అనుకుంటారు. అయితే అక్కడంత సీన్ లేదు.. ఎందుకంటే నెల నెలా ఉద్యోగులకు ఇచ్చినట్టు జీతాలు ఇవ్వరు. క్రికెట్ కు సంబంధించి ఏదైనా సమావేశాలకు వెళితే మాత్రం టీఏ, డీఏలు, ఉండేందుకు లగ్జరీ హోటల్స్, బిజినెస్ ఫ్లయిట్ టిక్కెట్లు ఏర్పాటు చేస్తారు. ఇదేంటి అనుకుంటున్నారా? నిజమేనండీ బాబు.


మరి బీసీసీఐ సెక్రటరీగా జై షా కి ఎంత జీతమని అనుకుంటున్నారు. ఇక్కడ కూడా జీతం గీతం ఉండదు. ఎందుకంటే బీసీసీఐలో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ట్రెజరర్, సెక్రటరీ పోస్టులు అత్యంత గౌరవప్రదమైనవి. వీరు బీసీసీఐ బోర్డులో ఉన్నతాధికారులుగా లెక్క. వీరెవరికి జీతాలు ఉండవు.. అంతా ఫ్రీ సర్వీసు కిందే లెక్క.

కాకపోతే బీసీసీఐ నుంచి వీళ్లకు అలవెన్సులు, కాంపెన్సేషన్, రియంబర్స్మెంట్ రూపంలో కొంత వరకు ఇస్తారు. అది కూడా టీమ్ ఇండియాకు సంబంధించి సమావేశాలు జరిగినప్పుడు ఇస్తారు. విదేశాల్లో వెళితే రోజుకు 1000 డాలర్ల చొప్పున ఇస్తారు. అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.84 వేలు అన్నమాట. ఇక భారతదేశంలో ఎక్కడైనా సమావేశాలకు వెళితే రోజుకి రూ.40 వేలు మాత్రమే చెల్లిస్తారు.


Also Read: అవన్నీ తర్వాత.. షకీబ్ క్రికెట్ ఆడతాడు: బీసీబీ

సమావేశాలతో సంబంధం లేకుండా టీమ్ ఇండియాతో కలిసి మ్యాచ్ లు జరిగే ప్రాంతాలకు వెళితే మాత్రం రోజుకి రూ.30 వేలు చొప్పున ఇస్తారు. కేవలం కీర్తి కండూతి తప్ప ఇంకేమీ ఉండదని అంటున్నారు. కాకపోతే బీసీసీఐ కార్యదర్శి అన్నా, ఐసీసీ ఛైర్మన్ అన్నా.. వాటిల్లో ఒక వైబ్రేషన్ ఉంటుంది. అందుకోసం తప్ప సంపాదించుకోడానికేమీ ఉండదని అంటున్నారు. అయితే ఇన్ డైరక్టుగా మాత్రం కోట్ల రూపాయల ఆదాయం ఉంటుందని మరికొందరు అంటున్నారు. లేకపోతే ఊరికినే ఎవడు చేస్తాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×