EPAPER

Haryana BJP Gets Poll Body Notice : బీజేపీకి షాక్ ఇచ్చిన హర్యానా ఎన్నికల సంఘం..

Haryana BJP Gets Poll Body Notice : బీజేపీకి షాక్ ఇచ్చిన హర్యానా ఎన్నికల సంఘం..

Haryana BJP Gets Poll Body Notice For Featuring Child In Campaign Video: ఈ సంవత్సరం అక్టోబర్ నెలలో హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీనితో ఇప్పటికే అక్కడ రాజకీయ వేడి రాజుకుంది. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీజేపీ. ఢిల్లీకి పొరుగునే ఉన్న హర్యానా రాష్ట్రంలో జరిగే ఎన్నికల కోసం ఢిల్లీ బీజేపీ ఎంపీలు ప్రచార బాధ్యతలు తీసుకున్నారు. అక్కడ వాల్మీకులు, గుర్జర్లు, జాట్ కులస్తుల ఓట్లు ఎక్కువ. అందుకే వారిని బీజేపీ వైపు తిప్పుకునేలా బీజేపీ అధిష్టానం వ్యూహాలు రచిస్తోంది. అయితే హర్యానా ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో బీజేపీ తన ప్రచార వ్యూహాలకు పదును పెట్టింది. అన్ని పార్టీలకన్నా ముందుగానే ప్రచారంలో దూసుకుపోతోంది. అయితే హర్యానాలో బీజేపీకి అక్కడి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. అక్కడి బీజేపీ నేతలకు షోకాజ్ నోటీసు పంపింది.


మైనర్ బాలుడితో ప్రచారమా?

బీజేపీ లాంటి జాతీయ పార్టీ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ మైనర్ బాలుడిని ఉపయోగించుకోవడం హర్యానా ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. హర్యానా బీజేపీ తీరును తప్పుపడుతూ అక్కడి నేతలకు బుధవారం షోకాజ్ నోటీసు ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో చిన్నారులను ఉపయోగించుకోవడం తప్పని తెలియదా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై నేటి సాయంత్రం ఆరు గంలలలోగా వివరణ ఇవ్వాలని ఎన్నికల నిర్వహణ అధికారి హర్యానా బీజేపీ నేతలను ఆదేశించారు.


హట్ టాపిక్
హర్యానా రాజకీయాలలో ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారిపోయింది. అయినా ఇంకెవరూ దొరకనట్లు చిన్నారులను ఎన్నికల ప్రచారంలో చీఫ్ గా ఉపయోగించుకోవడమేమిటని ప్రతిపక్షాలు బీజేపీపై విరుచుకుపడుతున్నారు. ఈ విషయంలో ఢిల్లీ బీజేపీ అగ్రనాయకత్వం కూడా హర్యానా బీజేపీ నేతలపై సీరియస్ గా ఉంది. ఎలాంటి సంప్రదింపులు లేకుండా ఇలాంటి పనుల వలన పార్టీ ప్రతిష్టకు అప్రదిష్ట తెచ్చినవారవుతారని హర్యానా నేతలపై బీజేపీ అధిష్టానం సీరియస్ గా ఉంది.

https://twitter.com/BJP4Haryana/status/1828379342080229768

Related News

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Bank Holidays: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లో భారీగా సెలవులు..ఎన్ని రోజులంటే?

Jammu Kashmir: ఓటెత్తిన కశ్మీరం.. 58.19 శాతం పోలింగ్ నమోదు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Big Stories

×