దానిమ్మ పండ్లలో శరీరానికి అవసరమైన పోషకాలను  పుష్కలంగా ఉంటాయి.

దానిమ్మ గింజల్లో  విటమిన్ బి, సి,కెతో పాటు యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.

అంతే కాకుండా పొటాషియం, క్యాల్షియం వంటి పలు రకాల మినరల్స్ కూడా వీటిలో ఉంటాయి.

దృఢమైన పళ్ళు: దానిమ్మ గింజలు చిగుళ్ళను బలపర్చి, వదులుగా మారిన పళ్ళను గట్టిపరుస్తాయి.

జీర్ణశక్తి: వీటిలో బి కాంప్లెక్స్ విటమిన్లు జీర్ణ వ్యవస్థను మెరుగ్గా పనిచేసేలా చేస్తాయి.

శరీరంలోని కొవ్వులు, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లను శక్తిగా మార్చటానికి దానిమ్మ దోహదం చేస్తుంది.

బరువు తగ్గడం: బరువు తగ్గాలనుకునే  వారికి దానిమ్మ గింజలు ఎంతగానో సహాయపడతాయి.

దానిమ్మలో ఉండే పీచుపదార్థం చాలా సేపు వరకు  కడుపు నిండుగా వున్న ఫీలింగ్ కలిగిస్తుంది.

దానిమ్మ గింజలు స్థూలకాయాన్ని కూడా నివారించి, కొవ్వును కరిగించటంలో సాయపడతాయి.

రోగనిరోధక వ్యవస్థ: దానిమ్మ గింజలలో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి.

ఈ గింజలలోని కొన్ని ప్రత్యేక లక్షణాలు మీ రోగనిరోధక వ్యవస్థను బలహీనపర్చే బ్యాక్టీరియా, వైరస్‌లతో అద్భుతంగా పోరాడతాయి.