Allu Arjun: నందమూరి నట సింహం నందమూరి బాలకృష్ణ.. ఇండస్ట్రీకి వచ్చి 50 వసంతాలు పూర్తిచేసుకున్న విషయం తెల్సిందే. దీంతో తెలుగు సినీ పరిశ్రమ.. బాలకృష్ణకు ఘనంగా సత్కరించాలని నిర్ణయించుకుంది. బాలకృష్ణ 50 ఇయర్స్ సెలబ్రేషన్స్ వేడుకలను ఒక పండగలా నిర్వహించడానికి ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. సెప్టెంబర్ 1న హైదరాబాద్ హైటెక్స్ నోవోటెల్ హోటల్లో ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి.
సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు కదిలిరానున్నారు. కేవలం తెలుగు మాత్రమే కాదు.. అన్ని ఇండస్ట్రీల నుంచి అతిరధమహారథులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఇక ఈ వేడుకలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరుకానున్నట్లు సమాచారం. ఇక సినీ ప్రముఖులకు తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ మెంబర్స్.. ఆహ్వాన పత్రికలను అందజేయడం మొదలుపెట్టారు.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుని సినీ ఇండస్ట్రీ తరఫున ఆహ్వానించారు. తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హానరబుల్ సెక్రటరీ టి. ప్రసన్నకుమార్ , తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ హానరబుల్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్ , నిర్మాత కె. ఎల్. నారాయణ , నిర్మాత జెమినీ కిరణ్ , నిర్మాత , డిస్ట్రిబ్యూటర్ కొమ్మినేని వెంకటేశ్వరరావు, సీఎం చంద్రబాబును కలిసి వేడుకకు రావాలని ఆహ్వానించారు.
ఇక తాజాగా అల్లు అర్జున్ కు సైతం.. బాలకృష్ణ 50 ఇయర్స్ సెలబ్రేషన్స్ ఇన్విటేషన్ అందింది. తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ పెద్దలు.. అల్లు అర్జున్ ను కలిసి ఇన్విటేషన్ అందించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ ఈవెంట్ కు అల్లు అర్జున్ వస్తాను అని చెప్పినట్లు సమాచారం. ఇదే కనుక నిజమైతే.. ఒకే స్టేజిపై పవన్ కళ్యాణ్, అర్జున్ కలవనున్నారు.
ప్రస్తుతం అల్లు – మెగా కుటుంబాల మధ్య విభేదాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బన్నీని మెగా ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ను అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆడేసుకుంటున్నారు. వీరిద్దరూ కలిసి ఒకే వేదికపై కనిపిస్తే.. ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందా.. ? లేక ఇంకా వివాదం ఎక్కువ అవుతుందా.. ? అనేది చూడాలి. అసలు ఈ ఈవెంట్ కు బన్నీ వస్తాడా.. ? రాడా.. ? అనేది తెలియాలంటే మరో వారం ఓపిక పట్టాల్సిందే.
Icon star #AlluArjun to grace #NBK50 celebrations on Sep 1st! pic.twitter.com/7SHLXALuZn
— Censor Talk (@TheCensorTalk) August 28, 2024