EPAPER

Mangal Gochar 2024: 3 గ్రహాల కలయిక.. వీరు జాక్ పాట్ కొట్టినట్లే !

Mangal Gochar 2024: 3 గ్రహాల కలయిక.. వీరు జాక్ పాట్ కొట్టినట్లే !

Mangal Gochar 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కలయిక, రాశుల మార్పు 12 రాశులపై ప్రభావాన్ని చూపుతుంది. గ్రహాల సంచారం కొన్ని రాశులకు శుభ ఫలితాలు ఇస్తే మరికొన్ని రాశులకు ప్రతికూల ప్రభావాలను ఇస్తుంది. అన్ని రాశులు తమ రాశి చక్రాలను నిర్ణీత వ్యవధిలో మార్చుకుంటాయి. ఫలితంగా గ్రహాల సంయోగం కూడా జరుగుతుంది. ఆగస్టు 26న గ్రహాల అధిపతిగా చెప్పబడే అంగారకుడు తన రాశిని మార్చుకున్నాడు.


కుజుడు మిథున రాశిలోకి ప్రవేశించి వృషభ రాశిలో తన ప్రయాణాన్ని ముగించాడు. ప్రస్తుతం సూర్యుడు తన సొంత రాశి అయిన సింహ రాశిలో ఉన్నాడు. అంతే కాకుండా బృహస్పతి శుక్రుడి రాశి అయిన వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 15 వరకు బృహస్పతి, సూర్యుడు అంగారక గ్రహాల అద్భుత కలయిక ఏర్పడనుంది. ఇదే కాకుండా అంగారకుడు , బృహస్పతి రెండూ వారి స్వంత నక్షత్ర రాశిలోనే సంచరిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో , సూర్యుడు , అంగారకుడు , బృహస్పతి యొక్క సంచారం వల్ల ఏ రాశుల వారికి అదృష్టం కలసివస్తుందో తెలుసుకుందాం.

మేష రాశి: కుజుడి సంచారం వల్ల ఈ రాశి వారికి శుభ ప్రదంగా ఉంటుంది. మీ రాశి ఐదవ ఇంట్లో సూర్యుడు సంచరిస్తున్నాడు. ఫలితంగా సూర్యుడి పూర్తి దృష్టి శనిపై పడుతోంది. బృహస్పతి , సూర్యుడు , అంగారక గ్రహాల సంచారం వల్లమ మీరు మంచి ప్రయోజనాలు పొందుతారు. మీరు మీ ఆఫీసుల్లో చేసే పనుల్లో విజయాలు సాధిస్తారు. మీ ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల ఉంటుంది. అసంపూర్తిగా ఉన్న పనులు కూడా ఈ సమయంలో పూర్తి చేస్తారు. మీరు వృత్తి , వ్యాపారాల్లో లాభాలను గడిస్తారు. ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.


మకర రాశి: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు, గురు, కుజుల కలయిక మకర రాశి వారికి ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఈ సమయంలో మంచి విజయాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంది. ఉద్యోగస్తులకు ఇది మంచి సమయం. కుటుంబ సభ్యుల నుంచి మద్దుతు పొందుతారు. చదువులో కూడా మంచి విజయాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విదేశాలకు వెళ్లాలని అనుకునే వారు మంచి అవకాశాలు పెరుగుతాయి. ఆఫీసుల్లో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. నూతన భాద్యతలు మీకు అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Also Read: సెప్టెంబర్‌లో ఈ రాశుల వారు అనుకున్నవన్నీ జరుగుతాయ్ !

తులా రాశి:  కుజుడు, సూర్యుడు , బృహస్పతి కలయిక తులా రాశి వారికి చాలా ప్రయోజనంగా ఉంటుంది.  వారికి కుజుడు అదృష్ట గృహంలో అంటే తులా రాశి వారి జాతకంలో 9వ ఇంట్లో , సూర్యుడు 11వ ఇంట్లో ఉన్నాడు. దీని కారణంగా తులా రాశి వారికి ధన లాభం కలుగుతుంది. వైవాహిక జీవితంలో ఎదుర్కుంటున్న సమస్యలు కూడా తగ్గుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి లభిస్తోంది. ఈ సమయంలో మీరు మంచి విజయాలను అందుకుంటారు. సమాజంలో మీకు ఎంతో గౌరవం పెరుగుతుంది. చదువులో కూడా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విదేశాలకు వెళ్లాలని అనుకునే వారికి అవకాశాలు బాగా పెరుగుతాయి. బంధు మిత్రలతో సాన్నిహిత్యం పెరుగుతంది. అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు. వైవాహిక జీవితం ఆనందంగా కొనసాగుతుంది.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Lucky Rashi from Durga Sasthi 2024: దుర్గా షష్ఠి నుండి ఈ రాశులకు వరుసగా 119 రోజులు లక్ష్మీ అనుగ్రహం

Mahalaya Surya Grahan 2024: మహాలయలో సూర్యగ్రహణం, ఈ 3 రాశుల వారి జీవితంలో అన్నీ అద్భుతాలే

Surya Grahan 2024: త్వరలో సూర్య గ్రహణం.. ఈ రోజు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి

Vriddhi Yog Horoscope: ఈ రాశుల వారిపై ప్రత్యేక యోగం వల్ల కోటీశ్వరులు కాబోతున్నారు

Guru Vakri 2024 : మరో 20 రోజుల్లో బృహస్పతి తిరోగమనం కారణంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందబోతున్నారు

Budh Shani Yuti Horoscope: బుధ-శని సంయోగంతో ఈ 3 రాశుల వారు సంపదను పొందబోతున్నారు

Horoscope 19 September 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని ధనలాభం!

Big Stories

×