EPAPER

Heart Health: గుండె ఆరోగ్యానికి సులువైన మార్గం ఇదే !

Heart Health: గుండె ఆరోగ్యానికి సులువైన మార్గం ఇదే !

Heart Health: ప్రపంచ వ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న అనారోగ్య సమస్యల్లో గుండె జబ్బులు కూడా ఒకటి. ప్రస్తుతం యువత కూడా గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్ల వల్ల హార్ట్ ఎటాక్స్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే సరైన ఆహారం తీసుకోవడంతో పాటు వ్యాయామం కూడా అవసరం. ఇది కాకుండా గుండె సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడే,  తప్పకుండా పాటించాల్సిన చర్యలు ఉన్నాయి.


నవ్వడం: జపాన్ లోని యమగటా యూనివర్సిటీ పరిశోధకులు నవ్వడం ద్వారా గుండె జబ్బులు దూరం అవుతాయా ? అనే అంశంపై పరిశోధన నిర్వహించారు. ఇందులో ముఖ్యంగా 40 నుంచి 17 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న 17,152 మంది పాల్గొన్నారు. ఈ పరిశోధనలో పాల్గొన్న వారి నవ్వు తీరును ట్రాక్ చేశారు. అనేక పరిమితుల తర్వాత నిర్వహించిన ఈ అధ్యయనం యొక్క నివేదికలో నవ్వే అలవాటు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుందని కనుగొన్నారు.

ప్రివెంటివ్ మెడిసన్ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యాయనం ప్రకారం నవ్వు యొక్క ఫ్రీక్వేన్సీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది అన్ని వయస్సుల వారికీ వర్తిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అనేక దేశాల్లో చాలా మంది కలిసి ఒకే సారి నవ్వుకునే లాఫ్టర్ క్లబ్‌ల సంఖ్య పెరగడానికి ఇది ముఖ్య కారణం


ఇదిలా ఉంటే ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో సైకాలజీ ప్రొఫెసర్ అయిన రాబిన్ డన్ బార్ నవ్వు.. శారీరక, మానసిక ప్రభావాలను సంవత్సరాలుగా అధ్యయనం చేశారు. నవ్వడం వల్ల మానసిక పరిస్థితి మెరగుపడుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కడుపుబ్బా నవ్వినప్పుడు ప్రక్కటెముకలోని టెన్షన్ ఎండార్ఫిన్ విడుదల చేయడంలో సహాయపడుతుంది. ఇది నొప్పిని తగ్గించడానికి మనల్ని సంతోషపెట్టడానికి ఉపయోగపడుతుంది. అంతే కాకుండా గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. నవ్వు ఒత్తడిని తగ్గిస్తుంది. మీరు నవ్వినప్పుడు శరీరం ఎండార్ఫిన్ అనే హార్మోన్ విడుదల చేస్తుంది. ఈ హర్మోన్లు మీకు మంచి అనుభూతిని కలిగిస్తాయి. ఇది ప్రతికూల భావోద్వేగాలను నిరోధిస్తుంది.

రక్తపోటును తగ్గిస్తుంది: నవ్వు గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే ఇది సిస్టోలిక్ రక్తపోటును తగ్గిస్తుంది. తగ్గిన రక్తపోటు గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారిస్తుంది. ఫలితంగా గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

రోగ నిరోధక శక్తి: క్రమం తప్పకుండా నవ్వడానికి ఇష్టపడే వ్యక్తుల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇది శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది.

Also Read: ఈజీగా బరువు తగ్గించే డ్రింక్స్ ఇవే !

ఎక్కువ కాలం జీవించడం: సైకో సోమాటిక్ మెడిసిన్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం బిగ్గరగా నవ్వడం వల్ల మహిళలు అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఎక్కువ కాలం జీవిస్తారని వెల్లడైంది. నవ్వు ఒత్తిడి, ఆందోళనను దూరంగా ఉంచుతుంది.

జీవక్రియ రేటు: నవ్వు కార్టిసాల్ అని పిలిచే ఒత్తిడి హార్మోన్ స్థాయి తగ్గిస్తుంది. అంతే కాకుండా జీవక్రియ రేటును కూడా నివారిస్తుంది. నవ్వు కొవ్వు నిల్వ చేయడాన్ని తగ్గిస్తుంది. నవ్వు సహజంగా జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Big Stories

×