Rubbing Tiger’s Belly: సాధారణంగా వన్య ప్రాణులు, అంటే కౄర మృగాలు ఎప్పుడూ అడవుల్లోనే నివసిస్తుంటాయి. పెంపుడు జంతువులు మాత్రం జనవాసాల్లో నివసిస్తూ వారితో పాటు జీవిస్తుంటాయి. మనుషుల చూపించే ప్రేమతో జంతువులు కూడా వారితో పాటు ప్రేమగా జీవిస్తుంటాయి. అయితే సాధారణంగా మన దేశంలో అయితే కుక్కలు, పిల్లులు, కోళ్లు, మేకలు, గొర్రెలు, పందులు, గుర్రాలు, ఇలా కొన్ని జంతువులను పెంపుడు జంతువులుగా ఇళ్లలో ఎంతో ఇష్టంగా పెంచుకుంటూ ఉంటారు. అయితే అడవిలో నివసించే జంతువులను పెంచుకోవాలంటే మాత్రం అది కేవలం సర్కస్ లో పనిచేసే వారితో మాత్రమే సాధ్యమవుతుంది. జంతువులను మచ్చిక చేసుకుని వాటికి ట్రైనింగ్ ఇస్తూ వాటితో విన్యాసాలు చేస్తుంటారు. ఇలా ప్రతీ నగరంలో సర్కస్ వంటివి నిర్వహిస్తూ డబ్బులు సంపాదిస్తుంటారు.
పాశ్చాత్య దేశాల్లో మాత్రం పులులు, సింహాలు వంటి వాటినే పెంపుడు జంతువులుగా ఇంట్లో పెంచుకుంటారు. అంతేకాదు పెద్ద పెద్ద విషపూరితమైన పాములను కూడా వారితో పాటు ఎంతో ఇష్టంగా చూసుకుంటారు. అయితే తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి ఎంతో ఇష్టంగా పులిని పెంచుకుంటున్నాడు. అయితే ఆ పులిని ఎంత ఇష్టంగా పెంచుకుంటున్నాడో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను చూస్తేనే తెలిసిపోతుంది. వీడియోలో పులి బెల్లీపై నెమరుతూ దానితో ఆటలు ఆడాడు.
పులికి బెల్లీ మసాజ్ చేస్తూ అది ఆస్వాదిస్తుంటే దానిని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అయితే ఇలా బెల్లీ మసాజ్ చేయడం వల్ల నరాల ఒత్తిడి, ఎండార్పిన్లు వంటి ఇతర హార్మోన్లు విడుదల అవుతాయి. అందువల్ల జంతువులతో ఎంతో ఆప్యాయంగా వ్యవహరిస్తే అవి విశ్రాంతి తీసుకుని ఎంతో ప్రేమగా వ్యవహరిస్తాయి. పులి పొత్తి కడుపుపై నెమరుతూ దానికి ఎటువంటి స్ట్రోక్లు రాకుండా ఉండేలా దానికి బెల్లీ మసాజ్ చేశాడు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఏకంగా 2 లక్షల వ్యూస్ వచ్చాయి. దీనిపై నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. పులితో ఇలా స్నేహపూర్వకంగా ఉండడం అనేది ఓ పెద్ద సాహసమే అని అంటున్నారు.
Belly Rubs 🐯💛 pic.twitter.com/R4ZBaZkXTu
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) August 27, 2024
Belly Rubs 🐯💛 pic.twitter.com/R4ZBaZkXTu
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) August 27, 2024