EPAPER

Husband Love: పండంటి కాపురాన్ని విడదీసిన విషజ్వరం.. భార్య ప్రేమకు గుర్తుగా..

Husband Love: పండంటి కాపురాన్ని విడదీసిన విషజ్వరం.. భార్య ప్రేమకు గుర్తుగా..

Husband Build the Grave for Wife చిన్న విషయానికే గొడవలు పడి.. విడాకులు తీసుకుని విడిపోతున్న ఈ రోజుల్లో కొందరు దంపతులు.. వైవాహిక జీవితానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. నూరేళ్లు కష్టసుఖాల్లో తోడుంటానని పెళ్లినాడు చేసుకున్న ప్రమాణాలకు కట్టుబడి ఉంటూ.. జీవితాన్ని పంచుకోవాలని వచ్చిన భాగస్వామి.. మధ్యలోనే వదిలి చితిమంటల్లోకి చేరితే.. వారిపై ఉన్న ప్రేమను వివిధరకాలుగా చూపుతున్నారు. భార్య చనిపోతేనో, భర్త చనిపోతేనో మరో పెళ్లి చేసుకుంటున్నారు కొందరు. అది తప్పు కాదు. కానీ ఈ భర్త.. చనిపోయిన భార్యపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు.


మూడు ముళ్ళు.. ఏడు అడుగుల బంధంతో ఒకటైన ఆ దంపతులపై విధి వింత నాటకమాడింది. కలకాలం కలిసి ఉండాలని ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్న ఆ దంపతుల పండంటి కాపురంలో విష జ్వరం చిచ్చు పెట్టి తన ఇల్లాలిని బలి తీసుకుంది. కలకాలం కలిసి బతకాల్సిన ఆ యువ జంట ఒంటరిగా మారడం ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదన్ని నింపింది.తన భార్యపై ఉన్న ప్రేమను చాటుకోవడానికి అప్పుడు షాజహాన్ తాజ్ మహల్ కట్టిస్తే.. ప్రాణంగా ప్రేమించిన తన ఇల్లాలి కోసం ఈ ప్రేమికుడు కళ్ళు చమర్చే విధంగా 8 అడుగుల ప్రేమ చిహ్నాన్ని ఆమె సమాధి వద్ద నిర్మించి ఆ జ్ఞాపకాలను పదిలం చేసుకున్నాడు.

Also Read: ఇంటి నుంచి పారిపోతున్న తల్లిని పట్టుకొని ఏడ్చిన చిన్నారి.. ఆ పాపని నిర్దాక్షిణ్యంగా..!


హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం వనమాల కనపర్తి గ్రామానికి చెందిన శివరాజ్ కు మానసతో 2018లో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కూతుర్లు శ్రీహిత (6), మేఘశ్రీత (4) ఉన్నారు. ఎంతో సంతోషంగా ఉంటున్న వారిపై విధికి కన్ను కుట్టినట్లుంది. మానసకు అంతుపట్టని విష జ్వరం రావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గతేడాది ఆగస్టు 8న మరణించింది. భార్య జ్ఞాపకాలు గుర్తుండిపోవాలనే ఆకాంక్షతో ఇలా సమాధిపై ప్రేమ చిహ్నాన్ని నిర్మించి నేటితరం భార్యాభర్తల అనుబంధానికి కొత్త నాంది పలికాడు శివరాజ్. తమ నుండి తన భార్య భౌతికంగా దూరమైనా ఆమె జ్ఞాపకాలు పదిలం చేసుకోవడం కోసం ఈ అద్భుతమైన నిర్మాణం చేపట్టినట్లు భర్త శివరాజ్ వివరించారు.

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×