EPAPER

Curry Leaves Benefits: డయాబెటీస్ ఉన్న వారు ఖాళీ కడుపుతో ఈ ఆకులు తింటే ఎన్ని లాభాలో తెలుసా

Curry Leaves Benefits: డయాబెటీస్ ఉన్న వారు ఖాళీ కడుపుతో ఈ ఆకులు తింటే ఎన్ని లాభాలో తెలుసా

Curry Leaves Benefits: ప్రతీ రోజూ వంటలో వాడే దినుసులు, కూరగాయలు, ఆకుకూరలు వంటి అన్నింటితోను ఆరోగ్యానికి ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు వంటి వాటితో ఎన్నో రకాల అనారోగ్య సమస్యల బారి నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అయితే కొన్ని ఆకుకూరలను కేవలం ప్రత్యేకంగా వండుకుని మాత్రమే తినగలుగుతాం. కానీ కరివేపాకు, కొత్తిమీర, ఉల్లికాడలు, పూదీనా, మెంతి వంటి వాటినీ ప్రతీ వంటకాల్లో ఉపయోగిస్తుంటాం. వీటితో కూరల రుచి అమోగంగా ఉంటుంది. అంతేకాదు వీటితో ఆరోగ్యానికి కూడా పుష్కలమైన ప్రయోజనాలు ఉంటాయి. అయితే ప్రతీ వంటలో ఉపయోగించే కరివేపాకుతో మాత్రం ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అవేంటో తెలుసుకుందాం.


పప్పు నుంచి మొదలుకుని దేవుడికి సమర్పించే పులిహోర, కరివేపాకు రసం, కరివేపాకు పొడి అంటూ ఎన్నో రకాలుగా ఉపయోగిస్తుంటాం. ప్రతీ వంటకాల్లోను కరివేపాకును వాడడం వల్ల దాని రుచి మరింత పెరుగుతుంది. ముఖ్యంగా కూరల్లో వేసే పోపులో కరివేపాకుతోనే అద్భుతమైన రుచి ఉంటుంది. కరివేపాకుతో కేవలం ఆరోగ్యానికే కాదు చర్మ సౌందర్యానికి కూడా ప్రయోజనాలు ఉంటాయి. కరివేపాకులో ఉండే విటమిన్లు, ప్రోటీన్లు, పోషకాలు, ఖనిజాలు ఆరోగ్యాన్ని మెరుగుపరచేందుకు తోడ్పడతాయి. ముఖ్యంగా రక్తంలోని హిమోగ్లోబీన్ స్థాయిలను పెంచడం మాత్రమే కాకుండా చర్మాన్ని కాంతివంతంగా కూడా మారుస్తుంది.

తరచూ పచ్చి కరివేపాకు ఆకులను ఓ నాలుగింటిని ఖాళీ కడుపుతో తింటే ఆరోగ్యానికి పుష్కలమైన ప్రయోజనాలు ఉంటాయి. ప్రతీరోజూ నాలుగేసి ఆకులను నమిలి తినాలి. ఇలా చేయడం వల్ల కరివేపాకులో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, డైజెస్టివ్ ఎంజైములు, యాంటీ డయాబెటిక్, విటమిన్లు సీ,బీ,ఏ వంటి వాటితో పాటు ఫాస్పరస్, కాల్షియం వంటి పోషకాలు కూడా ఆరోగ్యానికి పుష్కలంగా అందుతాయి. కరివేపాకులో ఉండే పొటాషియం వంటివి రక్తపోటును తగ్గించి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.


క్రమం తప్పకుండా కరివేపాకును తరచూ ఖాళీ కడుపుతో తినడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలను కూడా తగ్గించుకోవచ్చు. కరివేపాకుతో కొలస్ట్రాల్ వంటి సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. గుండె ఆరోగ్యానికి కూడా కరివేపాకు అద్భుతంగా పనిచేస్తుంది. కరివేపాకులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మ సమస్యలను నయం చేసేందుకు సహకరిస్తాయి. ఇందులో ఉండే ఐరన్ కంటెంట్ కారణంగా ఖాళీ కడుపుతో తీసుకుంటే రక్తహీనతను కూడా తగ్గించుకోవచ్చు.

అధిక బరువు వంటి సమస్యలతో బాధపడేవారు తరచూ కరివేపాకు తింటే మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఖాళీ కడుపుతో కరివేపాకు తింటే జుట్టు రాలడం వంటి సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. కరివేపాకులో ఉండే బీటా కెరోటీన్ జుట్టు సమస్యను తగ్గిస్తుంది. అంతేకాదు కంటి చూపు వంటి సమస్యలను కూడా కరివేపాకు తగ్గిస్తుంది. నోటి దుర్వాసనతో బాధపడేవారు కూడా కరివేపాకును తీసుకుంటే బ్యాక్టీరియా తొలగిపోయి మంచి ఫలితాన్ని ఇస్తుంది. కీళ్ల నొప్పులు వంటి సమస్యలు ఉన్న వారికి కూడా కరివేపాకు తింటే ఇందులో ఉండే కాల్షియం కారణంగా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Multani Mitti Face Pack:ముల్తానీ మిట్టితో స్మూత్, గ్లోయింగ్ స్కిన్..

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Big Stories

×