EPAPER

IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్ లో ఈ టిప్స్ పాటించండి.. టికెట్ కన్మఫర్మ్ చేసుకోండి!

IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్ లో ఈ టిప్స్ పాటించండి.. టికెట్ కన్మఫర్మ్ చేసుకోండి!

IRCTC Tatkal Ticket Booking: దూర ప్రయాణాల కోసం రైలు టికెట్ బుక్ చేసుకునేవారు ఎక్కువగా తత్కాల్ పద్ధతిలో టికెట్ బుక్ చేసుకుంటుంటారు. అయితే తత్కాల్ టికెట్ బుకింగ్ కోసం క్షణాల్లో వేగంగా పోటీపడాల్సి వస్తుంది. టికెట్ బుకింగ్ స్లాట్ సమయం ప్రారంభమవగానే కేవలం అయిదు నిమిషాల్లో మరి కొన్ని సమయాల్లో అయితే రెండు లేదా మూడు నిమిషాల్లో టికెట్లు అయిపోతాయి. దీంతో ప్రయాణం చేయాలనుకున్న వారికి సీట్లు లభించవు. ఇంకో సమస్య ఏంటంటే టికెట్ బుకింగ్ సమయంలో ప్యాసెంజర్ వివరాలు నింపడంలో ఆలస్యం కావడం… అది పూర్తైనా పేమెంట్ పూర్తయ్యే సమయంలో ఆన్ లైన్ సిస్టమ్ లేదా స్లో ఇంటర్నెట్ వల్ల హ్యాంగ్ కావడంతో ఆలస్యం మవుతుంది. చివరికి టికెట్లు లభించవు. ఈ సమస్యలు టికెట్ బుకింగ్ సమయంలో నిత్యం రైల్వే ప్యాసెంజర్లు ఎదుర్కొంటూనే ఉంటారు.


దీనికి ప్రధాన కారణం ఐఆర్‌సిటిసి వెబ్ సైట్, లేదా యాప్ లో తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో ఎక్కువ ట్రాఫిక్ ఉండడం. చాలా సార్లు ఈ సమస్య వల్ల చివరి నిమిషం వరకు టికెట్ బుకింగ్ ప్రక్రియ మొత్తం పూర్తిచేసినా.. వెయిటింగ్ టైమ్ చాలా ఎక్కువ సేపు తీసుకుంటుంది. దీనివల్ల ప్రయాణం రద్దు చేసుకున్న ప్రయాణీకులు ఎంతో మంది ఉన్నారు. ఏదైనా ఎమర్జెన్సీ సమయంలో ఇలాంటి సమస్య ఎదురైతే.. చిరాకు వస్తుంది. అందుకే తత్కాల్ బుకింగ్ సమయంలో మీకు పక్కాగా టికెట్ లభించాలంటే కొన్ని టిప్స్ పాటించండి.

సాధరణంగా బుకింగ్ సమయంలో ఐఆర్‌సిటిసి వెబ్ సైట్ హ్యాంగ్ అవుతూ ఉంటుంది. దీంతో ఈ సమస్యకు పరిష్కారం ఏంటని చాలా మంది అడుగుతూ ఉంటారు. ఏ టైమ్ లో లాగిన్ చేస్తే తత్కాల్ టికెట్ పొందవచ్చు అని ఆలోచిస్తూ ఉంటారు. దీనికి సమాధానం ఉంది. మీరు ఒక ఐడియల్ టైమ్ లో ఐఆర్‌సిటిసి వెబ్ సైట్ లాగిన్ అయి.. అందరూ చేసే తప్పులు చేయకుండా ఒక మాస్టర్ లిస్ట్ తయారు చేసుకుంటే మీరు తత్కాల్ టికెట్ సులువుగా లభించే అవకాశం ఉంది.


ఐఆర్‌సిటిసి తత్కాల్ టికెట్ బుకింగ్ గైడ్
తత్కాల్ టికెట్ బుకింగ్ చేసుకునేందుకు ఐఆర్‌సిటిసి వెబ్ సైట్ ఒక ఫిక్సిడ్ షెడ్యూల్ పాటిస్తుంది. ఏసీ క్లాస్ టికెట్లు కావాలంటే తత్కాల్ బుకింగ్ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. అదే స్లీపర్ క్లాస్ కోసమైతే 11 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే ప్రయాణం చేయాలనుకునేవారు సరైన ప్లానింగ్ ప్రకారం టికెట్లు బుక్ చేసుకుంటేనే టికెట్లు లభిస్తాయి.

లాగిన్ టైమ్ కీలకం
టికెట్లు తత్కాల్ బుకింగ్ లో కన్ఫర్మ్ అవ్వవాలంటే మీరు తత్కాల్ షెడ్యూట్ కంటే సరిగ్గా 3 నుంచి 5 నిమిషాల ముందు మాత్రమే లాగిన్ చేయండి. దీని వల్ల మీకు బఫర్ టైమ్, లాగ్ ఇన్ టైమ్ ఆదా అవుతుంది. చాలా మంది షెడ్యూల్ టైమ్ ప్రారంభం అయిన తరువాత లాగిన్ చేస్తారు. ఇలా చేయడంతో టికెట్ లభించడం కష్టమవుతుంది. 3 నుంచి 5 నిమిషాలు ముందు లాగిన్ అయితే మీకు త్వరగా టికెట్లు లభించే అవకాశం ఉంటుంది.

Also Read: ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. ఈపీఎఫ్ పరిమితి పెంపు యోచనలో కేంద్రం!

అందరూ చేసే సాధారణ తప్పులు ఇవే..
చాలా మంది టికెట్ బుకింగ్ చేసుకోవాలనే వారు.. త్వరగా టికెట్ సాధించాలనే ఆత్రుతలో షెడ్యూల్ కంటే 10 నుంచి 15 నిమిషాల ముందే లాగిన్ అవుతారు. దీని వల్ల సెషన్ ఎక్స్ పైర్ సమస్య వస్తుంది. లేదా సిస్టమ్ ఆటో లాగ్ అవుట్ అయిపోతుంది. ఈ సమస్య వచ్చాక మళ్లీ లాగిన్ చేసుకోవాల్సి వస్తుంది. దీంతో బుకింగ్ అంతా ఆలస్యమైపోతుంది. అప్పటికి వెబ్ సైట్ ఫుల్ ట్రాఫిక్ తో బిజీ అయిపోయి.. టికెట్ లభించడం కష్టమైపోతుంది. అలాగని షెడ్యూల్ కంటే కేవలం 1 లేదా 2 నిమిషాలు మాత్రమే లాగిన్ కావడం కూడా తప్పే అవుతుంది. దీని వల్ల లాగిన్ ఫెయిల్ అని కూడా చూపిస్తుంది.

మాస్టర్ లిస్ట్ ముందుగా తయారు చేసుకోండి
ఐఆర్‌సిటిసి వెబ్ సైట్ లో టికెట్ బుకింగ్ కోసం మాస్టర్ లిస్ట్ ముందుగా తయారు చేసుకునే ఫెసిలిటీ ఉంది. దీని వల్ల ప్యాసింజర్ వివరాలు ముందుగానే వెబ్ సైట్ లో పొందుపరచవచ్చు. పైగా వివరాలు నింపే సమయం కూడా ఆదా అవుతుంది. ఫలితంగా తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో ప్యాసింజర్ వివరాలు నింపాల్సిన అవసరం ఉండదు. టికెట్ బుకింగ్ ప్రక్రియ వేగం అవుతుంది. మీకు టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు కూడా పెరుగుతాయి.

Also Read: మీ IRCTC అకౌంట్ ద్వారా ఫ్రెండ్స్, ఫ్యామిలీకి టికెట్స్ బుక్ చేస్తే జైలుకు వెళ్తారా? నిజం ఏమిటి?

 

Related News

BMW XM: అరె బాబు.. ఇదేం కారు, దీని ధరతో హైదరాబాద్‌లో ఒక విల్లా కొనేయొచ్చు.. ఒక్కటే పీస్ అంట!

Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి యోజనలో కీలక మార్పులు.. కేంద్ర ప్రభుత్వం ప్రకటన

NAMX HUV: ఒక్క హైడ్రోజన్ క్యాఫ్సుల్‌లో 800 కి.మీ ప్రయాణం.. ప్రపంచంలోనే ఈ కారు వెరీ వెరీ స్పెషల్ గురూ!

IRCTC Tourism Package: టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఇదే సరైన సమయం, తక్కువ ధరలో అదిరిపోయే స్పెషల్ ప్యాకేజ్!

Jio AirFiber Free For 1 Year: ఏడాది పాటు జియా ఎయిర్ ఫైబర్ ఫ్రీ.. దీపావళి స్పెషల్ ఆఫర్!

Donkey Milk: గాడిద పాలతో లక్షల్లో లాభాలు.. ఇంతకీ ఆ పాలు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

Petrol vs Electric Cars: బాబోయ్.. పెట్రోల్ కారుతో పోల్చితే ఎలక్ట్రిక్ కారు ఇంత బెస్టా? ఏడాదికి అంత డబ్బు ఆదా చేసుకోవచ్చా?

Big Stories

×