EPAPER

CM Revanth Reddy: పదేళ్ల పాలనలో ఎందుకు మరిచారు .. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు భూమిపూజలో సీఎం రేవంత్

CM Revanth Reddy: పదేళ్ల పాలనలో ఎందుకు మరిచారు .. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు భూమిపూజలో సీఎం రేవంత్

CM Revanth Reddy Bhumi Puja To set up Telangana Mother Statue: తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. హైదరాబాద్‌లోని సెక్రటేరియట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఉదయం 11 గంటలకు మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ చేశారు.


తెలంగాణ ఏర్పాటు ప్ర‌క్రియ ప్రారంభ‌మైంద‌ని 2009, డిసెంబ‌రు 9న మ‌న్మోహ‌న్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింద‌ని, అదే రోజు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ జ‌న్మ‌దినం కావ‌డంతో తెలంగాణ త‌ల్లి విగ్ర‌హాన్ని డిసెంబర్ 9న ఆవిష్కరిస్తామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రజలకు డిసెంబర్ 9 ఒక పండగ రోజు అని ముఖ్య‌మంత్రి అన్నారు. విగ్ర‌హావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మాన్ని ఘ‌నంగా నిర్వ‌హిస్తామ‌ని ముఖ్య‌మంత్రి ప్ర‌క‌టించారు. ఇది అరుదైన అవకాశం.. ఇటువంటి అరుదైన అవ‌కాశం అంద‌రికీ రాద‌ని, ఈ కార్యక్రమంలో పాల్గొనే అదృష్టం త‌న‌కు ద‌క్కింద‌ని ముఖ్య‌మంత్రి అన్నారు.

పదేళ్లుగా నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి వచ్చిన అందరికీ అభినందనలు తెలిపారు. తెలంగాణ తల్లి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని నిర్ణయించుకున్నామని, అయితే దసరా వరకు ముహూర్తాలు లేవని, ప్రసిద్ధ పండితుల సూచన మేరకు నేడు భూమిపూజ చేసినట్లు చెప్పారు. అందుకే ఈ కార్యక్రమానికి కొంతమంది మంత్రులు హాజరుకాలేకపోయారన్నారు.


Also Read: లొకేషన్స్ నచ్చినట్టు మార్చారు.. ఘోష్ కమిషన్ ఫైర్

పదేళ్ల పరిపాలనలో గత పాలకులు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు నిర్మించలేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. పదేళ్లు అధికారంలో ఉన్న వారు ఎన్నో కట్టడాలు నిర్మించారని గొప్పలు చెప్పుకుంటారని, మరి తెలంగాణ తల్లిని మరిచారన్నారు. తెలంగాణకు మేమే సర్వం.. నేనే తెలంగాణ అనేలా గతపాలకులు వ్యవహరించారన్నారు.

కాంగ్రెస్‌ను ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమని, పాత విధానాలకు వ్యతిరేకంగా ప్రగతి భవన్‌ను ప్రజాపాలనగా మార్చిందన్నారు. ప్రగతి భవన్ పేరు మీద పెద్ద గడీలను నిర్మిచుకొని చుట్టూ ముళ్లకంచెలు ఏర్పాటు చేసుకున్నారన్నారు. ప్రజలు స్వయంగా లోపలికి వెళ్లి తమ సమస్యలను ప్రజాప్రతినిధులకు వివరించవచ్చన్నారు. ఈ విధంగా దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు.

సంకల్పం, పట్టుదల ఉంటే సాధ్యం కానిది లేద‌ని తెలంగాణ ఉద్యమకారులు నిరూపించార‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. క‌రీంన‌గ‌ర్‌లో ఇచ్చిన మాట మేర‌కు సోనియా గాంధీ 60 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష‌ను నెర‌వేర్చార‌ని ముఖ్య‌మంత్రి కొనియాడారు. 2014లో తెలంగాణ ఏర్పాటు కావ‌డం సువ‌ర్ణాక్ష‌రాల‌తో లిఖించ‌ద‌గిన అంశ‌మ‌న్నారు. 2014 నుంచి 2024 వ‌ర‌కు ప‌దేళ్లు తెలంగాణ‌ను పాలించిన వారు ఎన్నెన్నో నిర్మించామ‌ని, ప్ర‌పంచానికి ఆద‌ర్శంగా నిలిచామ‌ని గొప్ప‌లు చెప్ప‌కున్నార‌ని, కానీ తెలంగాణ తల్లిని తెరమరుగు చేసే ప్ర‌య‌త్నం చేశార‌ని ముఖ్య‌మంత్రి మండిప‌డ్డారు. తామే తెలంగాణ‌కు స‌ర్వ‌స్వ‌మ‌ని భావించార‌ని, తానే తెలంగాణ.. తెలంగాణే తాను అనే విధంగా విధంగా గత పాలకులు వ్యవహరించార‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విమ‌ర్శించారు.

Also Read: ఢిల్లీ డీల్స్..! కవిత బెయిల్ చుట్టూ పొలిటికల్ జగడం

కాంగ్రెస్ నేతృత్వంలోని ప్ర‌జా ప్ర‌భుత్వం అలాంటి విధానాల‌కు విరుద్ధ‌మ‌న్నారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్ పేరిట గ‌డీ నిర్మించుకొని, భారీ కంచెలు ఏర్పాటు చేసుకొని వందలాది మంది పోలీసు ప‌హారా పెట్టుకొని తెలంగాణ ప్ర‌జ‌ల‌ను అందులోకి రాకుండా నిషేధించార‌ని, తాము అధికారంలో వ‌చ్చాక ప్ర‌గ‌తి భ‌వ‌న్ పేరును ప్ర‌జా భ‌వ‌న్‌గా మార్చామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. గ‌డీగా మారిన ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ను ప్ర‌జా భ‌వ‌న్‌గా మార్చి దేశానికి ఆద‌ర్శంగా నిలిచామ‌ని, ఇప్పుడు ఎవ‌రైనా ప్ర‌జా భ‌వ‌న్‌లో స్వేచ్ఛ‌గా వెళ్ల‌వ‌చ్చ‌ని ముఖ్య‌మంత్రి అన్నారు.

తెలంగాణ పరిపాలనకు సచివాలయం గుండెకాయ అని సీఎం అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరడంతోపాటు తెలంగాణ అభివృద్ధికి సచివాలయం నుంచే విధాన పరమైన నిర్ణయాలు జరుగుతాయన్నారు. మంత్రులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. గత పాలకులు ఎవరూ ప్రజలకు అందుబాటులో లేకపోవడం బాధకరమన్నారు.

దాదాపు ఇరవైరెండున్నర లక్షల కోట్లను అప్పటి ప్రభుత్వం ఖర్చు పెట్టిందని, తెలంగాణ విగ్రహ ఏర్పాటుకు రూ.కోటి ఖర్చు అయ్యేదన్నారు. కానీ ఆనాటి ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు ముందుకురాలేదన్నారు.

Also Read: సంచలన నిర్ణయం.. హైడ్రా పేరిట కొత్త చట్టం

ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరుకాలేకపోయారన్నారు. ప్రస్తుతం విక్రమార్క కేరళలో పర్యటనలో ఉన్నారన్నారు. అలాగే కొంతమంది మంత్రులు కూడా ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల్లో పాల్గొంటున్నారన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన రాజీవ్ గాంధీ విగ్రహం లేక పోవడం లోటుగా భావించమని, మేధావుల సూచనల మేరకు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడానికి నిర్ణయించుకున్నామన్నారు. కొంతమంది తమ కోసం సెక్రటేరియట్ ముందు స్థలం ఏర్పాటు పెట్టుకున్నారని విమర్శించారు.

జూన్ 2న సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పామన్నారు. అందుకే తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారో.. అలాగే తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని నారో జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్‌కు తెలంగాణ తల్లి విగ్రహం రూపొందించే బాధ్యత ఇచ్చామన్నారు. డిసెంబర్ 9న తెలంగాణ ప్రజలకు పండుగ రోజు అని, ఇదే రోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలైందని, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ జన్మదినోత్సవమన్నారు. ఈ అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు సీఎం చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల మంత్రులతోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు.

 

Related News

Johnny Master: ఢీ 11 లో ఎలిమినేట్.. జానీ మాస్టర్ ఇంత కథ నడిపారా.?

Prabhas – Hanu : గప్ చుప్ గా షూటింగ్… ఇంత సీక్రెట్ గా ఎందుకో..?

Hansika Motwani: అసభ్యకరంగా తాకాడు.. నొప్పి భరించలేకపోయా అంటూ హన్సిక ఎమోషనల్..!

Mokshagna: తొలి మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా.. ఆల్ టైం రికార్డ్ సృష్టించబోతున్న బాలయ్య..!

Nagabubu: నాగబాబు సెటైరికల్ పోస్ట్.. జానీ మాస్టర్ కేనా..?

Jani Master : కేసులో మరో ట్విస్ట్.. కూపీ లాగనున్న మహిళా కొరియోగ్రాఫర్..!

Bigg Boss 8 Day 18 Promo: హౌస్ లో పెద్ద డ్రామా నడుస్తోందే.. సోనియా కి ఝలక్ ఇచ్చిన నబీల్..!

Big Stories

×