EPAPER

Kaleshwaram: లొకేషన్స్ నచ్చినట్టు మార్చారు.. ఘోష్ కమిషన్ ఫైర్

Kaleshwaram: లొకేషన్స్ నచ్చినట్టు మార్చారు.. ఘోష్ కమిషన్ ఫైర్

– కొనసాగుతున్న ఘోష్ కమిషన్ ఎంక్వైరీ
– ఐదుగురు తాజా, మాజీ ఈఈల హాజరు
– డిజైన్స్‌లో లోపాలు లేవన్న ఇంజనీర్లు
– సుందిళ్ల, అన్నారం లొకేషన్స్ మార్చారని వెల్లడి
– ఎదురు ప్రశ్నలు వేసిన వారిపై కమిషన్ ఆగ్రహం


PC Ghose Commission: కాళేశ్వరం ప్రాజెక్టు అవకతకలపై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఓపెన్ కోర్టు విచారణ కొనసాగుతోంది. మంగళవారం ఓపెన్ కోర్టు విచారణకు ఐదుగురు తాజా, మాజీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు హాజరయ్యారు. ఈ విచారణ సందర్భంగా మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల డిజైన్లలో మార్పులు చేర్పులు, లొకేషన్ల విషయంలో జరిగిన మార్పులు చేర్పుల మీద నాటి ఇంజనీర్లను కమిషన్ పలు కోణాల్లో ప్రశ్నించింది.

డిజైన్స్ ఓకే.. కానీ
మేడిగడ్డ బ్యారేజీ డిజైన్లు ఒకసారి ఆమోదం పొందిన తర్వాత వాటిని మళ్లీ మార్చారా? నిబంధనలకు అనుగుణంగానే డిజైన్లను ఆమోదించారా? హైపర్ కమిటీ రూల్స్ పాలో అయ్యారా? వంటి అంశాల మీద కమిషన్ నేడు ప్రధానంగా నాటి సీడీఓ ఇంజనీర్లను ప్రశ్నించింది. అయితే.. అనుకున్న ప్రదేశంలోనే మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం జరిగిందని, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల లొకేషన్ మారినట్లు కమిషన్‌కు అధికారులు చెప్పారు. దానికై సీడీవో, ఎల్ అండ్ టీ సంస్థ వేరువేరుగా డిజైన్లు తయారుచేసినా.. అదే లొకేషన్ ఫైనల్ చేశాయని ఇంజినీర్లు కమిషన్‌కు తెలిపారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి డిజైన్లలో ఎలాంటి సమస్య లేదని, అవన్నీ నిబంధనల ప్రకారమే డిజైన్లు ఉన్నాయని ఇంజనీర్లు వెల్లడించారు.


కమిషన్ ఆగ్రహం
నాటి హై పవర్‌ కమిటీలో సీడీఓ అధికారులు సభ్యులుగా ఉన్నారని కూడా నేటి విచారణలో ఇంజనీర్లు కమిషన్ ముందు ఒప్పుకున్నారు. డిజైన్లు రూపొందించటానికి మందు ఖచ్చితంగా సదరు సైట్‌‌ను విజిట్ చేయాలనే నిబంధనలేమీ లేవని వారు కమిషన్‌‌కు తెలియజేశారు. . మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటుకు కారణం రాఫ్ట్ కింద పలు సమస్యల వల్ల జరిగిందని ఇంజనీర్లు చెప్పగా, సిఖెండ్ ఫైల్స్, అలాట్మెంట్ డివియేషన్ వల్ల సమస్య వచ్చిందని ఇంజనీర్ సత్యనారాయణ రెడ్డి తెలిపారు. అయితే, ఇంజనీర్ దయాకర్ రెడ్డి మాత్రం కమిషన్ అడిగిన ప్రశ్నలకు పొంతన లేని జవాబులు చెప్పటంతో బాటు కమిషన్ అడిగిన ప్రశ్నలకు ఎదురు ప్రశ్నలు వేయటంతో జస్టిస్ ఘోష్ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

Also Read: HYDRA: ఒవైసీ, పల్లా, మల్లారెడ్డిలకు హైడ్రా ఊరట.. కీలక నిర్ణయం

అవన్నీ అసత్యాలే..
మరోవైపు మాజీ జల వనరుల అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మెన్ వి ప్రకాష్ మంగళవారం కమిషన్ ముందు హాజరయ్యారు. అనంతరం ఆయన బీఆర్‌కే భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. 37 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిందన్నారు. రఘు, శ్రీరామ్ వెదిరె.. సీడబ్ల్యూసీ అంశాలను వక్రీకరించారని పేర్కొన్నారు. తాను స్వయంగా కమిషన్ ముందు అఫిడవిట్ దాఖలు చేశాననన్నారు. తుమ్మిడిహట్టి వద్ద నిర్మాణం సాధ్యం కాదు గనకే దానిని మేడిగడ్డకు మార్చాలివచ్చందని తెలిపారు. తుమ్మడిహెట్టిపై కాగ్ అభ్యంతరాలను తాను కమిషన్‌ దృష్టికి తెచ్చినట్లు వెల్లడించారు. తన అఫిడవిట్ పరిశీలన తరువాత మరోసారి పిలుస్తామని కమిషన్ చెప్పినట్లు తెలిపారు. కాళేశ్వరం విషయంలో అక్రమాలకు పాల్పడిన వారెంతటి వారైనా శిక్ష పడాల్సిందేనని ప్రకాష్ స్పష్టం చేశారు.

Related News

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Harish Rao Letter: రాహుల్ గాంధీకి లేఖ రాసిన హరీశ్‌రావు.. పార్టీ మారుతున్నారా..?

Bandi Sanjay: ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి వదిలేస్తున్నా.. ఇంకోసారి వచ్చినప్పుడు కూడా ఇలానే ఉంటే ఊరుకోను: బండి సంజయ్

Kavitha: కవిత మౌనమేల.. దూరం పెట్టారా.. ఉంచారా..?

Telangana Graduate MLC Election: ఎమ్మెల్సీ‌ ఎన్నిక బీజేపీని జీవన్‌రెడ్డి ఢీ కొడతాడా?

Bhadradri Temple chief priest: భద్రాచలం ప్రధాన అర్చకుడిపై వేటు.. లైంగిక వేధింపులు.. లాగితే విస్తుపోయే నిజాలు!

Hyderabad Metro: ప్రయాణికులు జాగ్రత్త.. మెట్రో ఎక్స్‌ అకౌంట్‌ హ్యాక్‌..క్లిక్ చేస్తే అంతే!

Big Stories

×