EPAPER

Raj Tarun: రాజ్ తరుణ్ కు మ్యాటర్ లేదు.. అంతా దానికోసమా.. ఏం షాకిచ్చావయ్యా ?

Raj Tarun: రాజ్ తరుణ్ కు మ్యాటర్ లేదు.. అంతా దానికోసమా.. ఏం షాకిచ్చావయ్యా ?

Raj Tarun: యంగ్ హీరో రాజ్ తరుణ్ గురించి ఇప్పుడు  ఎవరికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ మధ్య రాజ్ తరుణ్ వివాదం ఏ రేంజ్ లో రచ్చ అయ్యిందో  అందరికి తెల్సిందే. రాజ్ తరుణ్ లవర్ లావణ్య చేసిన హంగామాను అంత త్వరగా ఎవరు మర్చిపోలేరు. రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకొని మోసం చేశాడని, ఎన్నోసార్లు అబార్షన్ చేయించాడని ఆరోపించింది.


మాల్వీ మల్హోత్రా అనే హీరోయిన్ తో రాజ్ తరుణ్ ఎఫైర్ పెట్టుకొని తనను టార్చర్ పెడుతున్నాడని చెప్పుకొచ్చింది. కేసులు, కోర్టులు అంటూ గత నెల  అంతా సోషల్ మీడియాను రాజ్ తరుణ్ – లావణ్య కబ్జా చేశారు. ఇంకోపక్క రాజ్ తరుణ్.. ఆమెతో రిలేషన్ లో ఉన్న మాట వాస్తవమే కానీ,  ఆ తరువాత మా మధ్య విభేదాలు తలెత్తడంతో విడిపోయామని చెప్పుకొచ్చాడు.  అలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, లావణ్య.. ఛానెల్స్ కు వెళ్లి  రాజ్ తరుణ్ ఫ్రెండ్ శేఖర్ భాషాను చెప్పుతో కొట్టడం.. ఇలా ఒకటని చెప్పలేం.

ఇక ఈ గొడవ తరువాత రాజ్ తరుణ్ రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆ సమయంలో ఇదంతా రాజ్ తరుణ్ ప్రమోషన్స్ కోసమే చేస్తున్నాడని కూడా అనుమానాలు వచ్చాయి. ఇక  ఏమైందో ఏమో తెలియదు కానీ, సడెన్  గా సైలెంట్ అయిపోయింది. ఆ తరువాత ఒక ముసుగు  వేసుకున్న అమ్మాయి.. రాజ్ తరుణ్ కు మ్యాటర్ లేదు అని ఒక వీడియో రిలీజ్ చేసింది. దీంతో ఆ అమ్మాయి, లావణ్య  ఫ్రెండ్ ఏమో అనుకున్నారు. కానీ, లావణ్యనే  ఆమె ఎవరో తనకు తెలియదు అని చెప్పడంతో అనుమానాలు మొదలయ్యాయి.


అసలు  విషయం ఏంటంటే..   ఆ ముసుగు వేసుకున్న అమ్మాయి వీడియో.. ప్రమోషన్ కోసం చేశారట. భలే ఉన్నాడే సినిమా డైరెక్టర్ .. ఇలాంటి ప్రమోషన్  చేయించాడట. దీంతో లావణ్య ఎపిసోడ్ కూడా ప్రమోషన్  అనే డౌట్ వచ్చింది. తాజాగా  ప్రెస్ మీట్ లో అదే విషయాన్నీ రిపోర్టర్స్ బయటపెట్టారు. ఇక దీనికి రాజ్ తరుణ్ మాట్లాడుతూ..  అలాంటి ప్రమోషన్స్ ఎవరైనా చేస్తారా.. ?  జీర్ణించుకోవడానికే  కష్టంగా ఉంది. తమ పర్సనల్ జీవితాలను రచ్చ చేసుకోవడం ఏ హీరోకు ఇష్టం ఉండదు అని చెప్పుకొచ్చాడు. మరి భలే ఉన్నాడే  సినిమాతో  రాజ్ తరుణ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్.. డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Hansika Motwani: అసభ్యకరంగా తాకాడు.. నొప్పి భరించలేకపోయా అంటూ హన్సిక ఎమోషనల్..!

Mokshagna: తొలి మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా.. ఆల్ టైం రికార్డ్ సృష్టించబోతున్న బాలయ్య..!

Devara : దేవరను భయపెడుతున్న ఆ సెంటిమెంట్.. ఆ ఒక్కటే ఎన్టీఆర్ కు మైనస్..

Deepika Padukone: గారాల పట్టికి దీపికా ఫస్ట్ గిఫ్ట్… ఏం కొనిపెట్టిందో తెలుసా?

Mad First Single: ఆ “లచ్చి” ప్లేస్ లో “లడ్డు” పెట్టి అదే పాటను మార్చి ఇచ్చేసాడు

Big Stories

×