EPAPER

HYDRA: తప్పు నాగార్జునదేనా?.. తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు

HYDRA: తప్పు నాగార్జునదేనా?.. తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు

Thammareddy Bharadwaja: రాష్ట్రవ్యాప్తంగా హైడ్రా కూల్చివేతలు సెన్సేషనల్‌గా మారాయి. అక్రమ కట్టడాలన్నింటినీ వరుసగా కూల్చివేస్తూ వస్తున్నది. ఈ పరిణామంపై ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కబ్జారాయుళ్ల భరతం పడుతున్న సీఎం అంటూ సంబురపడిపోతున్నారు. చెరువులు, కుంటలను పరిరక్షించే లక్ష్యంలో భాగంగా హైడ్రా అధికారులు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లలో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. ఇటీవలే సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై చాలా మంది తమకు తోచిన అభిప్రాయాలను వ్యక్తపరిచారు. కొందరు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు సరైనవేనని సమర్థించగా.. మరికొందరు వ్యతిరేకించారు. ఇంకొందరు నాగార్జునకు మద్దతుగా నిలబడ్డారు.


ఈ నేపథ్యంలోనే ప్రముఖ సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత గురించి మాట్లాడారు. ఇందులో ఎవరిది తప్పంటారు? అని అడగ్గా.. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లలో చాలా మంది నిర్మాణాలు చేపట్టారని, అలాగే, నాగార్జున కూడా ఎన్ కన్వెన్షన్ నిర్మించారని వివరించారు. జనరలైజ్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఈ స్టేట్‌మెంట్‌ను ఇంకొంత వివరిస్తూ.. ఎంత మంది దగ్గర పర్మిషన్లు ఉన్నాయి? ఎంత మంది దగ్గర తప్పుడు పర్మిషన్లు ఉన్నాయి? అధికారులను ప్రభావితం చేసి అక్రమంగా పర్మిషన్లు సంపాదించినవారు ఎంతమంది? అంటూ ఎదురు ప్రశ్నలు వేశారు. ఇలా ఏదో రకంగా పర్మిషన్లు సంపాదించి నిర్మాణాలు చేపట్టారన్నట్టుగా మాట్లాడారు. అక్రమంగా అనుమతులు ఇచ్చిన అధికారుల తప్పును ఎత్తిచూపారు.

ఇటీవలే తాను నాగార్జునకు చెందిన ఓ ఇంటర్వ్యూ చూశానని, తనకు ఇష్టం లేకున్నా లంచాలు ఇచ్చి పనులు చేయించుకోవాల్సి వచ్చిందని నాగార్జున్ చెప్పాడని తెలిపారు. బహుశా అవి ఈ నిర్మాణం కోసమే ఇచ్చారేమో ఎవరికి తెలుసు? అంటూ తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు. ఇక్కడ అధికారుల అధికార దుర్వినియోగాన్ని ఆయన ప్రశ్నించారు. మాధాపూర్‌లో గతంలో తనకు ఓ సైట్ ఉండేదని, చుట్టుపక్కల ఉన్న అందరికీ పర్మిషన్లు వచ్చాయని, కానీ, తాను పర్మిషన్ కోసం వెళ్లితే అది ఎఫ్‌టీఎల్‌లో ఉన్నదని అనుమతి తిరస్కరించారని గుర్తు చేశారు. ఒక వేళ తాను లంచాలు ఇస్తే పర్మిషన్లు ఇచ్చేవారేమో తనకు తెలియదని, కానీ, తాను అక్రమ మార్గంలో పోదలుచుకోలేదని చెప్పారు. అప్పుడు ఆఫీసర్లు ఇష్టమొచ్చినట్టుగా నడుచుకున్నారని పేర్కొన్నారు.


Also Read: Anna Canteen Issue: గలీజ్ వాటర్ లో ప్లేట్లు కడగింది నిజమేనా? బిగ్ టీవీ ఫ్యాక్ట్ చెక్‌లో బ‌య‌ట‌ప‌డ్డ నిజాలు

అసలు ఇందులో ప్రధాన నిందితులు అధికారులు అవుతారు కదా? అని అడగ్గా.. వంద శాతం వాళ్లది తప్పు అని తమ్మారెడ్డి భరద్వాజ అభిప్రాయపడ్డారు. ఇదే సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. సీఎం డేరింగ్ స్టెప్ తీసుకున్నారని, ఆయన నిర్ణయం సాహసోపేతం అని, మంచి నిర్ణయమని తెలిపారు. అంతటి డేరింగ్ సీఎం.. అక్రమ నిర్మాణాలకు పర్మిషన్లు ఇచ్చిన అధికారులపైనా యాక్షన్ తీసుకోవచ్చని పేర్కొన్నారు. ఏం జరుగుతుందో వేచి చూడాలన్నారు.

నగరంలో నాలాలను ఆక్రమించారని, అందుకే వర్షం పడగానే వరదలు పోటెత్తుతున్నాయని భరద్వాజ వివరించారు. అయితే, గత ప్రభుత్వాలు కూడా తప్పు చేశాయని, మూసీ నది పూడ్చేసి ఎంజీబీఎస్ నిర్మించారని పేర్కొన్నారు. ఏది

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×