ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ తన ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై అదిరిపోయే డిస్కౌంట్లు ప్రకటించింది.

OnePlus 11 5G ఫోన్‌పై దాదాపు రూ. 23,000 తగ్గింపు అందుబాటులో ఉంది.

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌లో OnePlus 11 5Gపై ఈ తగ్గింపు లభిస్తుంది.

ఈ ఫోన్ అసలు ధర రూ. 61,999 అయినప్పటికీ.. ఇప్పుడు 37 శాతం తగ్గింపుతో దీనిని రూ.38,999లకే కొనుక్కోవచ్చు.

అంటే ఏకంగా రూ. 23,000 తగ్గింపు లభిస్తుందన్నమాట. ఈ ఫోన్ కొత్త ధరతో అమెజాన్‌లో అందుబాటులో ఉంది.

ఈ ధర దాని 16GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌లో లభిస్తుంది. దీనితో పాటు నో కాస్ట్ EMI కూడా ఉంది.

అలాగే భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. దీనిపై రూ.35,400 వరకు భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందొచ్చు.

ఈ ఫోన్ 6.7 అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 3216 x 1440 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది.

4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్‌పై నిర్మించిన Qualcomm Snapdragon 8 Gen 2 ఆక్టా-కోర్ చిప్‌సెట్‌ను కలిగి ఉంది.

50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 48 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, 32 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.