అరటి ఆకుల్లో భోజనం చేయడం మన సంప్రదాయం

అరిటాకులో భోజనం చేస్తే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని, ఆరోగ్యానికి వరమని చెబుతుంటారు.

అరటి ఆకులో మరిన్ని ఔషధ గుణాలున్నాయి. దానిని డైరెక్ట్ గా తినడం ఇంకా మంచిది.

ఎసెన్షియల్ ఫైటో న్యూట్రియెంట్స్, సెలీనియం, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, డైటరీ ఫైబర్ వంటి పోషకాలున్నాయి.

యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు అనేక వ్యాధులకు దూరంగా ఉంచుతాయి.

రోగనిరోధకశక్త పెరుగుతుంది. వైరల్ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.

చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. అలర్జీలు, దద్దుర్లు తగ్గి చర్మ ఆరోగ్యం బాగుంటుంది.

అరటిఆకుల రసం తాగితే రక్తహీనత తగ్గుతుంది. ఇందులో ఐరన్ పుష్కలం.

ఇందులో పీచు పదార్థం అధికం. ఈ జ్యూస్ తాగితే బరువు తగ్గొచ్చు.

విటమిన్ B6, పొటాషియం రక్తపోటును నియంత్రిస్తాయి.

అరిటాకుల్ని నీటిలో మరిగించి.. వడకట్టి ఆ రసాన్ని తాగవచ్చు.