EPAPER

Shikhar Dhawan: అర్రెర్రె.. ధావన్ భయ్ ఎంత పనిచేశావ్? మళ్లీ క్రికెట్ ఆడతావా?

Shikhar Dhawan: అర్రెర్రె.. ధావన్ భయ్ ఎంత పనిచేశావ్? మళ్లీ క్రికెట్ ఆడతావా?

లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. తొలి సీజన్‌లో ఇండియా క్యాపిటల్స్ విజేతగా నిలిచింది. మళ్లీ ఈ లీగ్ లో ఆడనున్నట్టు ధావన్ తెలిపాడు. దీంతో కొందరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు .. గబ్బర్..ఎందుకిలా? చేస్తున్నాడని ప్రశ్నిస్తున్నారు.

38 సంవత్సరాలు వచ్చినా, ఇంకా భావోద్వేగాలను నియంత్రించుకోలేక పోవడంపై నెట్టింట పలు డిబేట్లు జరుగుతున్నాయి. తను ఇంతకుముందు కుమారుడి జన్మదినోత్సవానికి కూడా ఇలాగే పబ్లిగ్గా బాధపడ్డాడు. భార్యతో విడాకుల కారణంగా, తను కుమారుడికి దూరమయ్యాడు. అలా పబ్లిగ్గా తన మనోవేదన పంచుకున్నాడు. ఇప్పుడు కూడా రిటైర్మెంట్ అవుతున్నట్టు ప్రకటించి, మళ్లీ వెనుకడుగు వేశాడు.


నిజానికి చాలామంది తెలివైన క్రికెటర్లు.. ఒకొక్క ఫార్మాట్ నుంచి వైదొలుగుతూ ఉంటారు. మొన్న విరాట్, రోహిత్, రవీంద్ర జడేజా లాంటి వాళ్లు టీ 20కి వీడ్కోలు పలికారు. వన్డే, టెస్టు మ్యాచ్ లు ఆడుతున్నారు. రేపు 2027 వరల్డ్ కప్ తర్వాత.. ఆ ఫార్మాట్ కి వీడ్కోలు పలికేలా ఉన్నారు. తర్వాత మరో ఏడాది ఆడి, టెస్ట్ క్రికెట్ కి వీడ్కోలు చెబుతారు. ఆ తర్వాత ధోనీలా 42 లేదా 44 వచ్చేవరకు ఐపీఎల్ ఆడతారు. అప్పుడక్కడ వీడ్కోలు చెబుతారు.

మళ్లీ రెండు రోజులకే ధావన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో పాల్గొననున్నట్లు ప్రకటించాడు. తన జీవితం నుంచి ఆటను విడదీసి చూడలేమని అన్నాడు. ఇంకా తను క్రికెట్ ఆడగలనని అన్నాడు.  మైదానంలో తన స్నేహితులను తిరిగి కలుసుకుంటున్నాని, అభిమానులకు కొత్త జ్ఞాపకాలు అందించడానికి సిద్ధంగా ఉన్నానని ధావన్ పేర్కొన్నాడు.

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. గత ఐపీఎల్ సీజన్‌లో గాయం కారణంగా పంజాబ్ జట్టుకు దూరమయ్యాడు. మరిప్పుడు ఐపీఎల్ మెగా వేలానికి వెళతాడా? లేదా?అనేది చూడాలి.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×