EPAPER

Mayawati Re-Elected: రాజకీయాల నుంచి వైదొలుగుతలేనంటూ పేర్కొన్న మాయావతి.. మరునాడే భారీ ప్రకటన చేసిన పార్టీ వర్గాలు

Mayawati Re-Elected: రాజకీయాల నుంచి వైదొలుగుతలేనంటూ పేర్కొన్న మాయావతి.. మరునాడే భారీ ప్రకటన చేసిన పార్టీ వర్గాలు

Mayawati re elected as BSP Chief: బీఎస్పీ పార్టీ చీఫ్‌గా మాయావతి మరోసారి ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని మంగళవారం పార్టీ వర్గాలు మీడియాతో స్పష్టం చేశాయి. అయితే, యాక్టీవ్ పాలిటిక్స్ నుంచి తాను తప్పించుకోవడంలేదంటూ ఆమె పేర్కొన్నారు. అదేవిధంగా తనకు వ్యతిరేకంగా కొంతమంది ఫేక్ న్యూస్ ను ప్రచారం చేస్తున్నారన్నారు. అలాంటి ఆలోచనే తాను ఇప్పటివరకు ఆలోచించలేదన్నారు. తాను ఉన్నంతవరకు పార్టీ బలోపేతం కోసం, బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసం పోరాడుతానన్నారు. ఒకవేళ అనారోగ్య కారణాలు లేదా ఇతర కారణాల వల్ల తాను లీవులో ఉంటే తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ ఆ పదవీ బాధ్యతలను చేపడుతారన్నారు.


Also Read: త్వరలో ప్రత్యేక మెడికల్ స్టోర్స్ ప్రారంభిస్తాం..కేంద్ర మంత్రి

పలు మీడియా ఛానెల్స్ మాత్రమే ఆ విధంగా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆకాశ్ ఆనంద్ ను ముందుకు తెచ్చినప్పటి నుంచి ఇలాంటి ఫేక్ ప్రచారం కొనసాగుతున్నదన్నారు. ఇప్పుడే కాదు.. గతంలో కూడా తనని ఇండియా ప్రెసిడెంట్ ను చేస్తున్నారంటూ కూడా వార్తలు వచ్చాయన్నారు. అవన్నీ పట్టించుకోవొద్దంటూ పార్టీ వర్గాలకు, అనుచరులకు ఆమె తెలియజేశారు. ఈ విధంగా ఆమె ప్రకటించిన మరునాడే బీఎస్పీ చీఫ్ గా మాయావతి మరోసారి ఎన్నికైనట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఈ అంశంపై కొంత ఆసక్తి సంతరించుకున్నది.


Also Read: మావోలకు దెబ్బ మీద దెబ్బ.. 25 మంది లొంగుబాటు, బలహీనపడుతున్న మావోలు

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం 68 ఏళ్ల వయసు ఉన్న మాయావతి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పలు దఫాలుగా పనిచేశారు. ఆ సమయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జాతీయ రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేశారు. పలు సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వానికి గట్టి పోటీ ఇచ్చిన విషయం తెలిసిందే.

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×