EPAPER

Bigg Boss 8 Telugu: ‘బిగ్‌బాస్ 8’ హూస్ట్ రేస్‌లో ఈ స్టార్ హీరోస్.. రెస్ట్ తీసుకోనున్న నాగార్జున..!

Bigg Boss 8 Telugu: ‘బిగ్‌బాస్ 8’ హూస్ట్ రేస్‌లో ఈ స్టార్ హీరోస్.. రెస్ట్ తీసుకోనున్న నాగార్జున..!

Bigg Boss 8 Telugu: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ రియాలిటీ షో ‘బిగ్ బాస్’. మొదటి సీజన్ నుంచి ఈ షోకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. సోషల్ మీడియా సహా సీరియల్స్, సినిమాలు, యూట్యూబ్, రీల్స్ ద్వారా బాగా పాపులర్ అయిన సెలబ్రిటీలను కంటెస్టెంట్లుగా తీసుకువచ్చి షోను మరింత పాపులర్ చేస్తున్నారు. ఇలా వరుసగా ఇప్పటికి ఏడు సీజన్లు దిగ్విజయంగా పూర్తయ్యాయి. మొదటి సీజన్‌కు ఎన్టీఆర్ హూస్ట్ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.


ఆ తర్వాత సెకండ్ సీజన్‌కి నేచురల్ స్టార్ నాని హూస్ట్‌గా చేశాడు. ఈ సీజన్‌ కూడా బుల్లితెర ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుట్టుకుంది. ఇక మూడో సీజన్‌ నుంచి అక్కినేని నాగార్జున హూస్ట్‌గా వ్యవహరించాడు. అప్పటి నుంచి ఈ షోకి మరింత హైప్ వచ్చింది. బిగ్ బాస్ మూడో సీజన్ నుంచి నాగర్జున తన భుజాలపై వేసుకుని నడిపించాడు. ఏకంగా ఏడు సీజన్ల వరకు తీసుకువచ్చాడు. అయితే దీనిపై ఎంతోమంది విమర్శలు చేశారు. అయినా ఈ షోకు రెస్పాన్స్ ఏ మాత్రం తగ్గలేదు.

ఇక ఇప్పుడు ఎనిమిదవ సీజన్‌కు రంగం సిద్ధం అయింది. త్వరలో అంటే సెప్టెంబర్ 1వ తేదీన సీజన్ 8 లాంచ్ కాబోతుంది. ఈ సీజన్‌కు నాగార్జునే హూస్ట్‌గా వ్యవహరించబోతున్నట్లు ఇప్పటికే అఫీషియల్‌గా ప్రకటించారు. అంతేకాకుండా ఈ సీజన్ 8కి సంబంధించి ప్రోమోలు రిలీజ్ చేసి అందరిలోనూ క్యూరియాసిటీ పెంచేశారు. అలా త్వరలో స్టార్ట్ కాబోతున్న ఈ సీజన్ 8కి సంబంధించి అందరిలోనూ ఉత్కంఠ మొదలైంది.


Also Read:  ‘బిగ్ బాస్’ 8 ట్విస్ట్.. ఏంటీ, ఈ కంటెస్టెంట్స్ హ్యాండిచ్చారా? మరి వెళ్తోంది ఎవరు?

ఎందుకంటే ఈ షోకి హూస్ట్‌గా నాగార్జున కాకుండా మరికొందరి పేర్లు బయటకు వస్తున్నాయి. అందుకూ ఓ కారణం ఉంది. అదేంటంటే.. ఇటీవల నాగార్జున ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా అధికారులు కూల్చివేశారు. అక్రమంగా కట్టారనే నేపథ్యంలో హైడ్రా అధికారులు కూల్చివేయడం జరిగింది. దీనిపై నాగార్జున కోర్టుకు వెళ్లడం.. అదే సమయంలో నాగ్ అక్రమ కట్టడంపై తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి. దీని కారణంగానే నాగార్జున పబ్లిక్ మీటింగ్‌లలో పాల్గొనేందుకు ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. సోషల్ మీడియాలో నాగార్జునపై ఓ రేంజ్‌లో ట్రోల్, విమర్శలు వస్తున్నాయి.

ఇప్పుడు దీని ప్రభావం బిగ్ బాస్ సీజన్ 8పై పడబోతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో నాగార్జున హూస్ట్ చేస్తాడా? లేదా? అనేది ఆయన అభిమానుల్లో ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు బాబు గోగినేని సైతం నాగార్జున బిగ్ బాస్ హూస్ట్‌కు పనికిరాడంటూ స్టేట్‌మెంట్ ఇచ్చేశాడు. ఈ తరుణంలో టాలీవుడ్ నుంచి కొందరి పేర్లు బయటకొస్తున్నాయి. ఇందులో భాగంగానే బిగ్ బాస్ నిర్వహిస్తున్న స్టార్ మా కూడా నాగార్జునని పక్కన పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందువల్లనే నాగార్జున ప్లేస్‌లో బిగ్ బాస్ 8కి న్యాయం చేయగల హూస్ట్‌ను వెతికే పనిలో పడినట్లు సమాచారం.

అందుకే స్టార్ మా టాలీవుడ్ నుంచి కొంతమంది హీరోలను సంప్రదిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అందులో బాలకృష్ణ, జగపతి బాబు, విజయ్ దేవరకొండ, నవీన్ పోలిశెట్టి, వెంకటేష్ సహా ఇతర నటుల్ని కలుస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో ఒకరిని బిగ్ బాస్ 8కి హూస్ట్‌గా సెలెక్ట్ చేయాలని చూస్తున్నట్లు సమాచారం. చూడాలి మరి నాగార్జునే ఉంటాడా? లేక మరెవరైనా హూస్ట్‌గా వస్తారా.

Related News

Bigg Boss 8 Telugu: సోనియా చేతిలో నిఖిల్ కీలుబొమ్మ.. అమ్మాయిలాగా ఏడుస్తున్నావంటూ మణికంఠపై పర్సనల్ అటాక్, ప్రేరణకు అన్యాయం

Bigg Boss Sonia : సోనియా లవర్ గురించి బయట పడ్డ నిజం.. ఆల్రెడీ పెళ్లి అయిపోయిందా?

Bigg Boss 8 Telugu Promo: మనిషి పుట్టుక పుట్టారా లేదా.. వారిపై అభయ్ సీరియస్, హౌస్‌మేట్స్ మధ్య మరోసారి గుడ్ల లొల్లి

Bigg Boss 8 Telugu: సిగ్గు.. సిగ్గు.. ఆ ముద్దులేంటీ? ఆ హగ్గులేంటీ? బిగ్ బాస్.. ఫ్యామిలీస్ చూస్తున్నారు

Bigg Boss 8 Day 18 Promo: హౌస్ లో పెద్ద డ్రామా నడుస్తోందే.. సోనియా కి ఝలక్ ఇచ్చిన నబీల్..!

Bigg Boss 8 Telugu: విష్ణుప్రియాతో ప్రేరణ ‘దోశ’ గొడవ.. మణికంఠ తలకు గాయం

Bigg Boss8 Day 17 Promo: కొట్టుకు చస్తున్న కంటెస్టెంట్స్.. ఇదెక్కడి గేమ్ రా బాబూ..!

Big Stories

×