EPAPER

lake missing: చెరువు మిస్సింగ్.. వెతకండి సారూ అంటూ, పోలీసులకు బీజేపీ నేతల విన్నపం..

lake missing: చెరువు మిస్సింగ్.. వెతకండి సారూ అంటూ, పోలీసులకు బీజేపీ నేతల విన్నపం..

lake missing: చెరువులు, లేక్‌లు కాపాడేందుకు రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన వ్యవస్థ హైడ్రా. దీని పని తీరుపై తొలుత అనేక అనుమానాలు. హైడ్రా మాత్రం తన పని తాను చేసుకుపోతోంది. దీని దూకుడు గమనించిన ప్రజలు మా జిల్లాలకు విస్తారించాలంటూ ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు.


కబ్జాకు గురైన చెరువులు, లేక్‌లపై ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చెరువు కనిపించలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు. ఇంతకీ ఆ చెరువు ఎక్కడ? అన్న డీటేల్స్‌లోకి ఒక్కసారి వెళ్లొద్దాం.

హైదరాబాద్‌ను లేక్ సిటీగా తీర్చిదిద్దాలని రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో హైడ్రా వ్యవస్థను తీసుకొచ్చింది. ఇప్పటికే హైదరాబాద్‌లో చెరువులను కబ్జా చేసి చేపట్టిన నిర్మాణాలపై కొరడా ఝలిపించింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 166 నిర్మాణాలపై ఉక్కుపాదం మోపింది.


ALSO READ: కేటీఆర్ తెలుసుకో..నేనేం చెరువు ఆక్రమించలేదు.. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఫైర్

18 చోట్ల చెరువులు, పార్కు ప్రాంతాల్లోని చేపట్టిన ఆక్రమణలను నేలమట్టం చేసింది. దీనికి సంబంధించి దాదాపు 44 ఎకరాలను సొంతం చేసుకుంది. అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిలో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలున్నారు.

హైడ్రా రంగంలోకి దిగిన నుంచి ప్రజల నుంచి మాంచి రెస్పాన్స్ వస్తోంది. సిటీ వ్యాప్తంగా చెరువులు, లేక్ లను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై ప్రజలు, ప్రజా సంఘాల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

అంతేకాదు వాటికి సంబంధించి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసి వాటికి కూల్చాలని హైడ్రాను కోరుతున్నారు. అక్రమ నిర్మాణాల్లో చాలావరకు రాజకీయ నేతలకు సంబంధించినవి ఉన్నట్లు వార్తలు లేకపోలేదు.

సోమవారం ఈ వ్యవహారంపై మంత్రి పొన్నం ప్రభాకర్ రియాక్ట్ అయ్యారు. హైడ్రా కూల్చివేతల్లో ఎలాంటి రాజకీయం లేదన్నారు. హైదరాబాద్ ను లేక్ సిటీగా తీర్చిదిద్దాలన్నదే తమ ధ్యేయంగా చెప్పు కొచ్చారు. చెరువులకు సంబంధించిన ఆక్రమణలు ఎక్కడున్నాయో వాటికి సంబంధించిన సమాచారాన్ని అధికారులకు అందించాలని కోరారు.

తాజాగా మహేశ్వరం నియోజకవర్గంలోకి తుక్కుగూడ మున్సిపాల్టీ పరిధిలో ఎనిమిది ఎకరాల్లో ఉండే తుమ్మల చెరువు కనిపించలేదు. దీనిపై గ్రామస్థులతో కలిసి బీజేపీ నేతలు పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మీర్ పేట్ మున్సిపాల్టీ పరిధిలో వివిధ పేర్లతో ఉండే చెరువు భూములను కబ్జాలు చేశారని అన్నారు. ఆయా భూములను నోటరీలు చేసి అమ్ముకుంటున్నారని ఆరోపించారు. అలాంటి వారిపై చర్యలు చేపట్టాలని పోలీసులకు అందించిన వినతి పత్రంలో పేర్కొన్నారు.

గతంలో దీనిపై ఇరిగేషన్ డిపార్టుమెంటుకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు బీజేపీ నేత అందెల శ్రీరాములు. తుమ్మల చెరువు రాత్రికి రాత్రే మాయమైపోయింద న్నారు. హైడ్రాను కేవలం హైదరాబాద్ సిటీకి మాత్రమే పరిమితం చేయకుండా మిగతా జిల్లాలకు విస్తరించాలని కోరుతున్నారు.

ప్రస్తుతం చెరువులు మాయం చూస్తుంటే టాలీవుడ్ లో వచ్చిన ‘రాజుగారి చేపల చెరువు’ సినిమా గుర్తుకొస్తుంది. అందులో రాజకీయ వ్యవస్థలో ఉన్న సమస్యలను కళ్లకు కట్టినట్టు చూపించారు మేకర్స్. ప్రస్తుతం తెలంగాణలోనూ అలాంటి సీన్ రిపీట్ అవుతున్నట్లు కనిపిస్తోంది.  కేవలం చెరువులు, లేక్‌ల మాయం హైదరాబాద్‌కి పరిమితం కాలేదు.. మిగతా జిల్లాలకు హైడ్రా వ్యవస్థను విస్తరించాలని భావిస్తోంది. రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన హైడ్రాపై మిగతా రాష్ట్రాలు ఫోకస్ పెట్టాయి.

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×