EPAPER

Novak Djokovic: యూఎస్ ఓపెన్ 2024, జకోవిచ్ శుభారంభం..

Novak Djokovic: యూఎస్ ఓపెన్ 2024, జకోవిచ్ శుభారంభం..

Novak Djokovic: యూఎస్ ఓపెన్ ఆసక్తికరంగా సాగుతోంది. ప్రపంచ నెంబర్ టూ, సెర్బియా ప్లేయర్ నవోక్ జకోవిచ్ శుభారంభం చేశాడు. తొలి రౌండ్‌లో మోల్డోవాకు చెందిన రూడ్ ఆల్బోట్‌ను వరుస సెట్లలో ఓడించి తర్వాత రౌండ్‌కు అర్హత సాధించాడు.


భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం ఆరుగంటలకు డిఫెండింగ్ ఛాంపియన్ జకోవిచ్ – ఆల్బోట్‌ మ్యాచ్ జరిగింది. ఆర్థర్ ఆషే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌కు దాదాపు 30 వేల మంది ప్రేక్షకులు హాజరయ్యారు. ఆది నుంచి నువ్వానేనా అన్నరీతిలో ఇద్దరు ఆటగాళ్లు తలపడ్డారు.

ప్రపంచంలో 138వ ర్యాంక్‌లో ఉన్న ఆల్బోట్, నెంబర్ టూ ఆటగాడితో ఢీ కొన్నాడు. ఇరువురు మధ్య మ్యాచ్ దాదాపు రెండు గంటల సేపు జరిగింది. కానీ ప్రత్యర్థికి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వలేదు జకోవిచ్. తొలి సెట్ నుంచి జకోవిచ్ అదే దూకుడు కొనసాగించాడు.


ALSO READ:  వినేశ్ కి గోల్డ్ మెడల్.. వచ్చింది!

మూడు సెట్లను 6-2, 6-2, 6-4 తేడాతో ఓడించి తర్వాత రౌండ్‌కు అర్హత సాధించాడు జకోవిచ్. ఫస్ట్ సర్వీసులో మాంచి గ్రిప్ సాధించాడు ఆల్బోట్. కాకపోతే మైదానంలో ఆట తీరు ఇంకా మెరుగుపర్చు కోవాల్సివుంది. అనవసర తప్పిదాలు ఆయన కొంప ముంచేశాయి. దీంతో తొలి రౌండ్‌లో ఇంటిదారి పట్టాడు మోల్డోవా ఆటగాడు.

ఈ ఏడాదిలో ఇప్పటివరకు జరిగిన మూడు మేజర్ల టైటిళ్లను కోల్పోయాడు జకోవిచ్. తొలుత ఆస్ట్రేలియా, ఫ్రెంచ్, వింబుల్డన్ అనుకోని సమస్యలు వెంటాడాయి. కాకపోతే పారిస్ ఒలింపిక్స్‌‌లో బంగారు పతకం సాధించి కాస్త రిలీఫ్ పొందాడు. ఇదే జోరు యూఎస్ ఓపెన్‌లో ప్రదర్శించి 25 గ్రాండ్ స్లామ్ టైటిల్ దక్కించుకోవాలని ఆరాటపడుతున్నాడు.

 

ప్రపంచ మహిళ సింగిల్స్ విభాగంలో బెలారస్ బ్యూటీ అరీనా సబలెంక రెండో రౌండ్‌కి చేరింది. ఆస్ట్రేలియాకు చెందిన ప్రిస్సిల్లా హాన్‌పై విజయం సాధించింది. ఇరువురు మధ్య గట్టి పోటీ ఉంటుందని అభిమానులు భావించినప్పటికీ సబలెంక ముందు నిలబడలేకపోయింది ప్రిస్సిల్లా. దీంతో రెండు సెట్లను 6-3,6-3 తేడాతో విజయం సాధించింది. గతేడాది రన్నరప్ అయిన సబలెంక.. ఈసారి టైటిల్‌పై కన్నేసింది.  రెండో రౌండ్‌లో ఇటలీకి చెందిన లూసియాతో పోరుకు సిద్ధమైంది.

 

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×