EPAPER

US Open 2024: సెకండ్ రౌండ్లో టాప్ సీడ్ ఆటగాళ్లు, భారత్ ఆటగాడు నగల్ ఔట్

US Open 2024: సెకండ్ రౌండ్లో టాప్ సీడ్ ఆటగాళ్లు, భారత్ ఆటగాడు నగల్ ఔట్

US Open 2024: యూఎస్ ఓపెన్ టెన్నిస్ ప్రారంభమైంది. పురుషులు, మహిళల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ ఆటగాళ్లు శుభారంభం చేశారు. భారత్ ఆటగాడు సుమిత్ నాగల్ తొలి రౌండ్‌లో ఇంటి దారి పట్టాడు.


మహిళల సింగిల్స్ విభాగంలో  రష్యాకు చెందిన 12వ సీడ్ కసట్కినా తొలి రౌండ్‌లో విజయం సాధించింది. రొమేనియాకు చెందిన జాక్వెలిన్ క్రిస్టియన్‌పై 6-2,6-4 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించింది. క్రిస్టియన్ 31 సార్లు అనవసర తప్పిదాలకు పాల్పడడంతో తగిన మూల్యం చెల్లించుకుంది.

అలాగే రష్యాకు చెందిన ఆంద్రీవా, క్రొయేషియా బ్యూటీ వెకిచ్ తర్వాత రౌండ్లోకి ప్రవేశించారు. రష్యాకు చెందిన ఆంద్రీవా.. చైనా ప్లేయర్ యువాన్‌పై 6-3, 9-7 తేడాతో విజయం సాధించింది. క్రొయేషియాకు చెందిన వెకిచ్.. ఆస్ట్రేలియాకు చెందిన బిరెల్‌పై 6-4, 6-4 తేడాతో విజయం సాధించింది.


పురుషుల సింగిల్స్ విభాగంలో ఫ్రెంచ్ ఆటగాడు ఆర్థర్ కాజాక్స్ తర్వాత రౌండ్‌కి అర్హత సాధించాడు. స్పెయిన్‌కి చెందిన పాబ్లో కారెనో బస్టా తలపడ్డాడు. వరస సెట్లలో ఆర్థర్ కాజాక్స్ 6-1, 6-3, 6-3 తేడాతో విజయం సాధించాడు. ఆర్థర్ బలమైన ఏస్‌లకు పాబ్లో చేతులెత్తేశాడు. ఏ దశలోనూ ప్రత్యర్థికి పోటీ ఇవ్వలేకపోయాడు. పాబ్లో అయితే అనవసర తప్పిదాలకు పాల్పడ్డాడు.

మరో సింగిల్స్ విభాగంలో భారత్ ఆటగాడు సుమిత్ నగల్ తొలి రౌండ్‌లో ఓటమి పాలయ్యాడు. డచ్‌కు చెందిన టాలన్ గ్రీక్సూపూర్‌తో తలపడ్డాడు. తొలి సెట్‌ను సునాయాశంగా గెలుచుకున్న టాలన్, రెండో సెట్‌లో అదే దూకుడు కనబరిచాడు. దీంతో మూడో సెట్ ఇద్దరి ఆటగాళ్లు ఆసక్తిపోరు సాగింది. దీంతో ఈ సెట్ టైబ్రేక్‌కు దారి తీసింది. ఇందులో టాలర్ ది పైచేయి అయ్యింది. దీంతో మూడు సెట్లను 1-6, 3-6, 6-7 తేడాతో విజయం సాధించి తర్వాత రౌండ్‌కు అర్హత సాధించాడు.

 

Related News

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Big Stories

×