EPAPER

Weight Loss Tips: ఇలా చేస్తే.. ఈజీగా బరువు తగ్గుతారు తెలుసా ?

Weight Loss Tips: ఇలా చేస్తే.. ఈజీగా బరువు తగ్గుతారు తెలుసా ?

Weight Loss Tips: ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో అధిక బరువు కూడా ఒకటి. మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మంది ఉబకాయంతో ఇబ్బంది పడుతున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా పెరిగిన బరువుతో అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలోనే ఎక్కువ మంది బరువు తగ్గేందుకు రకరకాల ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. అయినా ఫలితం అంతంత మాత్రమే.


ఎందకంటే పెరిగిన బరువు ఎలా తగ్గించుకోవాలనే దానిపై వారికి అవగాహన లేకపోవడమే అని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గాలని అనుకునే వారికి ఉపయోగపడే కొన్ని విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అధిక బరువు ఉన్నవాళ్లు ఎలాగైనా బరువు తగ్గాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొందరు జిమ్‌లకు వెళ్లి తెగ కసరత్తులు చేస్తూ ఉంటారు.

మరి కొంతమంది ఏవేవో చిట్కాలు పాటిస్తుంటారు. అయినప్పటికీ బరువు తగ్గే వారి సంఖ్య తక్కువగానే ఉంటుంది. వ్యాయామంతో వెయిట్ లాస్ అవ్వడం సాధ్యం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. వ్యాయామంతో పాటు తినే ఆహార పదార్థాలు ఈ విషయంలో కూడా జాగ్రత్తలు పాటించండి. అప్పుడే అనుకున్న రిజల్ట్ వస్తుంది.


ఒకే సారి పూర్తిగా మీరు తినే ఆహార పరిమాణం తగ్గించడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఎందుకంటే ఏ మార్పునైనా తీసుకోవడానికి శరీరానికి కొంత సమయం పడుతుంది. శరీర తత్వానికి అనుగుణంగా నెమ్మదిగా బరువు తగ్గించడానికి పాటించాల్సిన ఆహారపు అలవాట్ల గురించి తెలుసుకోవడం ముఖ్యం.

వెయిట్ లాస్‌కు అనుగుణంగా ఉండేలా కేలరీలు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. అదే విధంగా డైట్ ప్లాన్‌లో కూడా తగినంత పోషకాహారం ఉండేలా చూసుకోవాలి. సరైన పోషకాహారం లేక పోతే శరీరానికి సరిపడా శక్తి కూడా లభించందన్న విషయాన్ని గుర్తుంచుకోండి.

ముఖ్యంగా ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్ వంటి వాటికి పూర్తిగా దూరంగా ఉండడం మంచిది. ఎందుకంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తయారవడానికి ఇది ఉపయోగపడుతుంది. అంతే కాకుండా బరువు తగ్గాలనుకునేవారు వీటిని అస్సలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు.

ఆహార పదార్థాలను ఎంచుకోవడం మాత్రం కాదు. అవి తినే ముందు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత వరకు గ్రిల్లింగ్, స్టీమ్మింగ్, బేకింగ్ చేసిన పదార్థాలు తినడానికి ప్రయత్నించండి. కూరలు వండే క్రమంలో కూడా ఎక్కువ నూనెను వాడకూడదు. ఎందుకంటే ఆయిల్ వాడి కూరలను వేయించడం వల్ల అదనపు కొవ్వులు చేరుతాయి. రోజు వారి డైట్‌లో తాజా కూరగాయలు, పండ్లను ఎక్కువ మొత్తంలో తీసుకోవాలి. ఫలితంగా వెయిట్ లాస్ అవ్వడానికి అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా ఆహారంలో కార్బోహైడ్రేట్స్, పప్పు, అన్నంతో పాటు ఉండేలా చూసుకోండి.

రాగులు, కొర్రలు వంటి తృణధాన్యాలను ఉపయోగించి దోశలు, రొట్టెలు వంటివి చేసుకుని తినాలి. వీటి వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందడమే కాకుండా బరువు కూడా తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు.

Also Read: బాదంపప్పు తొక్కలో ఉండే పోషకాలతో ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే అస్సలు పడేయరు..

వ్యాయామం విషయానికి వస్తే జిమ్‌లో జాయిన్ అయిన మొదటి రోజే గంటల కొద్దీ శ్రమించకుండా ఉండాలి. మొదటి రోజు ఎక్కువగా కష్టపడితే తర్వాత రోజు నిలబడేందుకు కూడా ఓపిక ఉండదు. కాబట్టి నిదానంగా చిన్న చిన్న స్టెప్పులతో మొదలు పెట్టి వర్కౌట్లు పెంచుకోవాలి.

ఏ రకమైన వ్యాయామం చేస్తే బరువు తగ్గుతారో అలాంటి వ్యాయామం చేయడానికి కొంత సమయాన్ని కేటాయించుకోండి. నడవడం వల్ల కూడా మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ టిప్స్ ఫాలో అవడం వల్ల కనీసం నెలలో 5 కేజీలు తగ్గవచ్చు.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Big Stories

×