EPAPER

YSRCP MLC Anantha Babu: అడ్డంగా బుక్కైన అదే కథ.. అనంత పరువు పాయే?

YSRCP MLC Anantha Babu: అడ్డంగా బుక్కైన అదే కథ.. అనంత పరువు పాయే?

YSRCP MLC Anantha Babu About Video Call: ముందు వెనుకా చూసుకోకుండా ఇష్టానుసారం వ్యవహరించడం.. అడ్డంగా బుక్ అవ్వడం వైసీపీ నేతలకు కామన్‌గా మారిపోయింది. ఎప్పటికప్పుడు ఫోన్ సంభాషణలు, వీడియో క్లిప్పింగులు లీకవుతూ.. నెగిటివ్‌గా ఫోకస్ అవుతున్న నాయకులు ఆ పార్టీ పరువును మరింత దిగజార్చేస్తున్నారు. ఆ పార్టీ నేతల లీలలు ఒకొక్కటిగా బయటపడుతుండటం చర్చనీయాంశంగా మారింది. అయితే సదరు నేతలు మాత్రం ఆ పాపమంతా తమ ప్రత్యర్ధులదే అని.. మార్ఫింగ్‌లతో తమను ఇరికిస్తున్నారని పత్తిత్తుల్లా స్టేట్ మెంట్లు ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు గోరంట్ల మాధవ్ నుంచి ఇప్పుడు అనంతబాబు వరకు అందరూ ఒకే స్టోరీ చెప్తూ నెట్టింట్లో ట్రోల్ అవుతున్నారు.


రాష్ట్రానికి అటు చివర శ్రీకాకుళం జిల్లా నుంచి ఇటు చివర అనంతపురం వరకు ఒకటొకటిగా బయటపడుతున్న వైసీసీ నేతల కుటుంబకథా చిత్రాలు , రాసలీలలు అందర్నీ ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి. ఇలాంటి వారికా తాము ఓట్లేసిందని ప్రజలు ఈసడించుకునే పరిస్థితులు తలెత్తుతున్నాయి. తమ లీలలు స్పష్టంగా బహిర్గతమవుతున్నా.. నవ్వి పోదురు గాక.. మా కేటి సిగ్గు అన్నట్లు .. తమ భాగోతాలకు కవరింగ్ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తూ .. సదరు నేతాశ్రీలు మరింత అభాసుపాలు అవుతున్నారు.

శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ ప్రేమ కథా సీరియల్ అనంతంగా కొనసాగుతూనే ఉంది … అటు భార్య దువ్వాడ వాణితో పాటు కుమార్తెలపై పోలీసు కేసులు పెట్టిన శ్రీనివాస్.. దివ్వెల వాణితో తన అనుబంధాన్ని సవివరంగానే చెప్పుకొచ్చారు. భార్యకు విడాకులంటూ తన భవిష్యత్తు ఎవరితోనో సిక్ట్సీ ప్లస్ వయస్సులో చెప్పకనే చెప్పారు ..అసలు ఆయన నోటి దురుసుతో తాము బాధపడిన వారిమేనని, ఇప్పుడు అతని భార్య, పిల్లలు భరించలేక బయటకు వచ్చారని వైసీపీ నేతలే అంటున్నారంటే అతని కరెక్ట్ క్యారెక్టర్ ఏంటో అర్థం చేసుకోవచ్చంటున్నారు.


దువ్వాడ కుటుంబ గొడవల నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ పై వైసీపీ అధిష్టానం చర్యలు తీసుకుంది. పార్టీకి చెడ్డపేరు వస్తుందని భావించిన జగన్‌.. టెక్కలి ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి శ్రీనివాస్‌ను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆ వివాదం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. అది కొలిక్కి రాకముందే.. తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్సీ అనంతబాబు రాసలీలల వీడియో బయటపడింది. వీడియో కాల్‌లో అశ్లీలంగా ప్రవర్తించిన అనంతబాబు వీడియా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

జగన్ ప్రియ శిష్యుడు అనంతబాబు అని టాగ్ చేస్తూ తెగ ట్రోల్చేస్తున్నారు నెటిజన్లు .. ఎన్నికల ముందు డ్రైవర్ అయిన దళిత యువకుడిని చంపి డోర్ డెలివరీ చేశారన్న ఆరోపణలతో అనంతబాబు జైలుకు వెళ్లారు . ఆ సమయంలో పదవి నుంచి తొలగించాలని, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్లు వినిపించాయి. దీంతో పార్టీ అధిష్టానం అనంతబాబును సస్పెండ్ చేసింది… 6 నెలలు జైలులో ఉన్న వైసీపీ ఎమ్మెల్సీకి సుప్రీం కోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. జైలు నుంచి విడుదలైన తర్వాత అనంతబాబుకు అప్పటి అధికార పార్టీ నేతలు ఘన స్వాగతం పలికి, సత్కారాలు చేయడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.

అదే కాదు ఇంతవరకు ప్రత్యక్ష రాజకీయాల ముఖం చూడని అనంతబాబుకు ఘనమైన చరిత్రే ఉంది .. అనంత సత్య ఉదయ భాస్కర్… ఇదీ అనంత బాబు పూర్తి పేరు .. అతని తండ్రి అడ్డతీగల సమితి అధ్యక్షుడిగా ఉంటూ మావోయిస్టుల చేతిలో హత్యకు గురయ్యార ఎస్టీ రిజర్వ్‌డ్ రంపచోడవరం నియోజకవర్గానికి చెందిన అతను ఏజెన్సీ ప్రాంతంలో దొరికే రంగురాళ్ల అక్రమ వ్యాపారంలో కీలక పాత్ర పోషించేవాడని… రౌడీషీట్ కూడా తెరిచారు పోలీసులు .. గతంలో అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతపై దాడికి పాల్పడి వైజాగ్‌లో జైలు శిక్ష అనుభవించాడు…

2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా రంపచోడవరం నుంచి నామినేషన్ ధాఖలు చేశాడు.. షెడ్యూల్ తెగ అయిన కొండకాపు వర్గానికి చెందిన వాడినంటూ సర్టిఫికేట్ పుట్టించి ఎస్టీ రిజర్వ్‌డ్ సెగ్మెంట్లో నామినేషన్ వేశాడు. అయితే అతను ఎస్టీ కాదని ఫిర్యాదులు రావడంతో రిటర్నింగ్ అధికారి అతని నామినేషన్‌ను తిరస్కరించారు. అప్పట్లో అనంతబాబుకు డమ్మీగా నామినేషన్ వేసిన వంతల రాజేశ్వరి రంపచోడవరం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమె తర్వాత ఆతనికి షాక్ ఇచ్చి టీడీపీలో చేరిపోయారు.

Also Read: అడ్డంగా బుక్కైన అదే కథ.. అనంత పరువు పాయే?

అటువంటి వ్యక్తిని జగన్ 2021లో ఎమ్మెల్సీని చేశారు. ఎమ్మెల్సీ అయ్యాక మరింత దూకుడు పెంచిన అనంతబాబు తన రహస్యాలు, వ్యాపారాలు, ఇతరాత్ర కార్యకలాపాలు గురించి తెలిసిన తన డ్రైవర్.. వాటిని ఎక్కడ బయటపెడతాడో అని హత్య చేసినట్లు అభియోగాలు నమోదయ్యాయి. అసలు మొన్నమొన్నటి వరకు అటు రంపచోడవరంలో కొందరికి, ఇటు జగన్‌కి తప్ప పెద్దగా ఎవరికీ పరిచయం లేని అనంతబాబు అశ్లీల వీడియోతో అందరికీ నోటెడ్ అవుతున్నారు. అయితే అందరిలాగే అతను ఈ వీడియో ఫేక్ అని కొట్టిపడేశారు. అతను ఎవరికో బర్త్ డే విషెస్ చెబుతున్న వీడియోను కట్ చేసి.. మార్ఫింగ్ చేశారని.. వారిపై చర్యలు తీసుకోవాలని రంపచోడవరం స్టేషన్లో కేసు కూడా పెట్టాడు.

మార్ఫింగ్ వీడియో చూపించి అయిదారు నెలలుగా ఒకరు తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని అనంతబాబు ఆరోపిస్తున్నాడు… మరి అప్పుడున్నది వైసీపీ ప్రభుత్వమే.. మరి ఆ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న అతను అప్పుడే పోలీసులను ఎందుకు ఆశ్రయించలేదంటే.. సమాధానం లేదు. ఇప్పుడు తన లీలలు బయటపడ్డాయి కాబట్టి కవరింగ్ చేసుకోవడానికి నానా పాట్టు పడుతున్నాడు. అసలు ఇలాంటి భాగోతాలు వైసీపీలో కొత్తమీ కాదు. హిందూపురం ఎంపీ ఉన్నట్టు గోరంట్ల మాధవ్.. ఓ మహిళతో అసభ్యంగా వీడియో కాల్ మాట్లాడి అడ్డంగా బుక్ అయ్యారు.

ఎంపీ పదవికి కళంకం తెచ్చేలా గోరంట్ల వ్యవహార శైలి ఉందంటూ.. ప్రతిపక్షాలు, మహిళా సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. అయితే దీనిపై స్పందించిన గోరంట్ల వీడియో మార్ఫింగ్ చేశారని ఆరోపించారు. జిమ్ చేస్తున్న సమయంలో వీడియో తీసి మార్ఫింగ్ చేశారంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో ఆ మాజీ సీఐ గోరంట్ల మాధవ్‌కి జగన్ రెండో సారి టికెట్ కూడా ఇవ్వలేదు.

అప్పుడెప్పుడో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆడియో ఒకటి లీక్ అయింది.. ఓ యువతితో అంబటి అసభ్యకరంగా మాట్లాడిన ఆడియో ఒకటి సంచలం సృష్టించింది… దానిపై అంబటి వీడియో రిలీజ్ చేసి క్లారిటీ ఇచ్చారు. ఆడియోకు తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ప్రతిపక్షాలు తన వాయిస్‌ను టెక్నాలజీతో మార్చేశాయన్నారు … ఇక వైసీపీ రాజ్యసభాపక్షం నేత విజయసాయిరెడ్డి – శాంతిల ఎపిసోడ్ కూడా అదే రేంజ్లో కలకలం సృష్టించింది. దానిపై తండ్రి కూతళ్ల బంధమని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది విజయసాయికి … ఇప్పుడు అదే గోరంట్ల ఇన్సిపిరేషన్‌తో అనంతబాబు రోత పురాణం మొదలుపెట్టి కవర్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇది ఎంత దూరం వెళ్తుందో చూడాలి.

 

Tags

Related News

Israel Hezbollah War: యుద్ధంలో నయా వెపన్.. ఇక ఊచకోతే

YCP Leaders to Join in Janasena : గేట్లు తెరిచిన పవన్.. వైసీపీ ఖాళీ?

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

Big Stories

×