EPAPER

Hydra demolish: హైడ్రాను స్వాగతించిన బీఆర్ఎస్.. వాటిపై నిర్ణయమేంటి? ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రశ్న

Hydra demolish: హైడ్రాను స్వాగతించిన బీఆర్ఎస్.. వాటిపై నిర్ణయమేంటి? ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రశ్న

Hydra demolish: రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన హైడ్రా వ్యవస్థపై బీఆర్ఎస్ రెండుగా చీలిపోయినట్టు కనిపిస్తోంది. కొందరు ఎమ్మెల్యేలు హైడ్రాను సపోర్టు చేస్తుండగా, మరికొందరు తప్పుబడుతున్నారు. తాజాగా హైదరాబాద్ సిటీకి చెందిన ఓ ఎమ్మెల్యే.. హైడ్రాను సపోర్టు చేయడం బీఆర్ఎస్‌లో కలకలం రేపింది. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే?


బీఆర్ఎస్‌కి చెందిన కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన హైడ్రాను స్వాగతిస్తున్నట్లు మనసులోని మాట బయటపెట్టారు. చెరువుల్లో కట్టుకున్న అక్రమ కట్టడాలపై సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం బాగుందన్నారు.

కాకపోతే గొలుసుకట్టు చెరువులపై అనేక నాలాలు ఉన్నాయని, వాటిపైనున్న నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలన్నారు సదరు ఎమ్మెల్యే. కాకపోతే ఎఫ్‌టీఎల్ పరిధిలో చాలామందికి పట్టాలున్నాయని, వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని సీఎం రేవంత్‌రెడ్డి, హైడ్రా చీఫ్ రంగనాథ్‌ను ప్రశ్నించారు.


ALSO READ: బీజేపీ కొత్త ఇన్చార్జ్‌గా అభయ్ పాటిల్.. కొట్లాటకు చెక్ పడుతుందా?

హైదరాబాద్ సిటీ పెద్దది కావడంతో పట్టాదారులు వ్యవసాయం చేసే పరిస్థితి లేదన్నారు ఎమ్మెల్యే. పట్టాదారులకు అనుకూలంగా న్యాయస్థానం స్టే సందర్భాలను గుర్తు చేశారాయన. ఆ ల్యాండ్‌ను ప్రభుత్వం తీసుకుంటే బాగుంటుందన్నారు. రాజకీయాలకు అతీతంగా చేయాలని, కక్ష సాధింపు ఉండకూడదన్నారు.

ఎమ్మెల్యే మాధవరం మాటలను బీఆర్ఎస్‌లోని నేతలు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. కృష్ణారావు మాటల వెనుక ఎవరున్నారు? బీఆర్ఎస్ ఆ విధంగా మాట్లాడించిందా? తన నియోజకవర్గాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడారా? ఇలా రకరకాల ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి. మొత్తానికి మాధవరం కృష్ణారావు మాటలు ఆ పార్టీలో దుమారం రేగుతున్నట్లు సమాచారం.

ఇదిలావుండగా హైడ్రా ఇప్పటికే కూల్చివేసిన నిర్మాణాల గురించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. హైదరాబాద్ సిటీ పరధిలో ఇప్పటివరకు చెరువులు, పార్కులు ఆక్రమించి 18 ప్రాంతాల్లోని 166 నిర్మాణాలను కూల్చివేసినట్టు డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ వెల్లడించింది.

ఇందులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ పార్టీల కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంకి చెందిన నేతలున్నారు. దాదాపు 44 ఎకరాల్లో కట్టిన నిర్మాణాలు ఉన్నాయి. హైడ్రా రంగంలోకి దిగిన నుంచి చెరువులు ఆక్రమించినవారిపై ప్రజల నుంచి ఫిర్యాదులు వెళ్లువెత్తుతున్నాయి. మరికొందరు వాటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు.

తాజాగా శేరిలింగంపల్లి ప్రాంతంలోని రాయదుర్గంలో అక్రమ నిర్మాణాల కూల్చివేశారు హైడ్రా అధికారులు. సర్వే నెంబర్ 2, 3, 4, 5 ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు వెలిశాయి. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టారు రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులు. కూల్చివేతలను స్థానికులు అడ్డుకోవడంతో భారీగా పోలీసుల మోహరించారు.

 

Related News

Bigg Boss 8 Day 19 Promo: కఠిన నిర్ణయం తీసుకున్న బిగ్ బాస్..సైలెంట్ అయిన కంటెస్టెంట్స్ ..!

Squid Game Season 2 Teaser: టీజర్ రిలీజ్ చేసిన నెట్ ఫ్లిక్స్.. ఈ భయంకరమైన ఆట చూడడానికి సిద్ధమా..?

Johnny Master: ఢీ 11 లో ఎలిమినేట్.. జానీ మాస్టర్ ఇంత కథ నడిపారా.?

Prabhas – Hanu : గప్ చుప్ గా షూటింగ్… ఇంత సీక్రెట్ గా ఎందుకో..?

Hansika Motwani: అసభ్యకరంగా తాకాడు.. నొప్పి భరించలేకపోయా అంటూ హన్సిక ఎమోషనల్..!

Mokshagna: తొలి మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా.. ఆల్ టైం రికార్డ్ సృష్టించబోతున్న బాలయ్య..!

Nagabubu: నాగబాబు సెటైరికల్ పోస్ట్.. జానీ మాస్టర్ కేనా..?

Big Stories

×